By: ABP Desam | Updated at : 02 Mar 2023 05:24 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
హరిహరకృష్ణ, నవీన్
Naveen Murder Case : రంగారెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్‌లో బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. హరిహరకృష్ణకు వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తన లవర్ తో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడు నవీన్‌ను హరిహరకృష్ణ అత్యంత హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన నిందితుడు హరిహరకృష్ణ ప్రస్తుతం చర్లపల్లి సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నాడు. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు నిందితుడి కస్టడీ కోరారు. ఈ మేరకు పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ చేశారు. పోలీసుల తరఫున అదనపు పీపీ ప్రతాప్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపిస్తూ ... హరిహర కృష్ణను 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే కోర్టు వారం రోజుల కస్టడీకి అనుమతించింది. హరిహర కృష్ణ పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత, ఆధారాలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ తొందరగా ముగిసేలా చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ కేసు విచారణలో యువతి నిహారిక సహకరించడంలేదని పోలీసులు అంటున్నారు. మద్యం, గంజాయి మత్తులో నవీన్ ను హత్య చేసి, శరీర భాగాలు కోశాడని హరిహరకృష్ణ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసుల వాదనలు
నవీన్ హత్య జరిగిన ఘటనా స్థలాన్ని నిందితుడితో కలిసి పరిశీలించాల్సి ఉందని పిటిషన్ లో పోలీసులు తెలిపారు. అలాగే ఈ హత్య వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. నవీన్ ఫోన్ పగలగొట్టిన హరిహర కృష్ణ దాన్ని ఔటర్ రింగ్ రోడ్డు పక్కన పడేశాడని, అది ఎక్కడో తెలుసుకోవాల్సి ఉందన్నారు పోలీసులు. నిందితుడు హరిహర కృష్ణ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పిటిషన్ లో పోలీసులు తెలిపారు. ఫోన్‌ను ఎక్కడ దాచాడనే విషయాన్ని హరిహర కృష్ణను విచారించాల్సి ఉందన్నారు.
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న యువతి
నవీన్ హత్య దర్యాప్తులో పోలీసులు సంచలన నిజాలు వెలుగులోకి తెచ్చారు. నవీన్ ను హత్య చేసిన తర్వాత నిందితుడు తన స్నేహితుడు హసన్, స్నేహితురాలు, తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పాడని పోలీసులు తేల్చారు. వాళ్లు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పకుండా దాచే ప్రయత్నం చేశారని పోలీసులు అంటున్నారు. విచారణలో హరిహరకృష్ణ, అతని స్నేహితురాలు నిహారిక సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ హత్యను నిందితుడు, అతని స్నేహితురాలు చాలా తేలికగా తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే హరిహరకృష్ణ, నిహారికను మూడుసార్లు పోలీసులు విచారించారు. యువతికి సఖి సెంటర్‌లో కౌన్సిలింగ్ ఇప్పించినా అమ్మాయి తీరు మారలేదన్నారు పోలీసులు. తాము చాలా పేదవాళ్లమని అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు ఎదుట వాపోతున్నారు. కౌన్సిలింగ్ ఇప్పించినా, కుటుంబ సభ్యులు ఇంత బాధపడుతున్నా యువతి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు కనపడడం లేదని పోలీసులు విస్తుపోతున్నారు.
హరిహర కృష్ణ స్నేహితుడ్ని విచారించిన పోలీసులు
నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణ స్నేహితుడు హసన్ ను పోలీసులు విచారించారు. హత్య చేసిన అనంతరం హరిహర కృష్ణ తన స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లినట్లు చెప్పాడు. హత్య జరిగిన తర్వాత హరిహర కృష్ణ ఏంచేశాడో హసన్ ను విచారించారు పోలీసులు. బ్రాహ్మణపల్లిలోని రాజీవ్ గృహకల్పలో ఉంటున్న హసన్ ఇంటికి హరిహరకృష్ణ వెళ్లాడు. అక్కడ రక్తపు మరకలు అంటిన డ్రస్ విప్పేసి హసన్ దుస్తులు వేసుకున్నాడు హరిహరకృష్ణ. రక్తపు మరకల గురించి అడగగా, నవీన్‌ను హత్యచేసినట్టు హరిహరకృష్ణ చెప్పినట్టు హసన్ పోలీసులకు చెప్పాడు. తన ప్రేమకు అడ్డువస్తున్నాడని నవీన్ ను హత్య చేసినట్టు హరిహర కృష్ణ చెప్పాడని హసన్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్
Visakha News : విశాఖలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Pulivendula Firing : పులివెందుల కాల్పులకు ఆర్థిక లావాదేవీలే కారణం- ఎస్పీ అన్బురాజన్
Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!
Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!