Raja Raghuvanshi: రాజా రఘువంశీ హత్య కేసులో అటాప్సీ రిపోర్టులో సంచలన విషయాలు!
Raja Raghuvanshi: రాజా రఘువంశీ హత్య కేసులో దర్యాప్తులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతన్ని ఎలా చంపారో అటాప్సీ రిపోర్టులో బయటపడింది.

Raja Raghuvanshi: ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీపై రెండుసార్లు దాడి జరిగింది. ఒకసారి తలపై వెనుక భాగంలో, మరోసారి ముందు భాగంలో దాడి చేశారు. ఈ దాడిలో రాజా మరణించాడు. వివిధ జాతీయ న్యూస్ ఏజెన్సీల నివేదికలు, పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో తలపై గాయాల గుర్తులు ఉన్నాయి. రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీ ప్రస్తుతం గాజీపూర్ పోలీసుల కస్టడీలో ఉంది.
మేఘాలయలో హత్యకు గురైన ఇండోర్‌కు వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్యకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్యతో కలిసి హనీమూన్ కోసం వెళ్లాడు. మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌లోని వీసావ్‌డాంగ్ జలపాతం సమీపంలోని లోతైన లోయలో అతని మృతదేహం గుర్తించింది.
నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (NEIGRIHMS)లో నిర్వహించిన శవపరీక్ష ప్రకారం, మృతుడి తలపై రెండు గాయాలు అయ్యాయని వార్తా సంస్థ PTI నివేదించింది.
“మృతుడి తలపై రెండు గాయాలు ఉన్నాయి. ఒకటి వెనుక భాగంలో ఉంటే రెండోది ముందు భాగంలో” అని తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ తెలిపారు. అతని మృతదేహం దొరికిన ప్రదేశంలో విచారణ టైంలో పోలీసులు రాజా తలపై రెండు గాయాలు చూశారని ఆయన గతంలో PTIకి తెలిపారు.
గాజీపూర్ ఎస్పీ ఏమన్నారు?
గాజీపూర్ ఎస్పీ డాక్టర్ ఇరాజ్ మాట్లాడుతూ, ఈ రోజు (జూన్ 9) ఉదయం మధ్యప్రదేశ్ పోలీసుల నుంచి సోనమ్ అనే మహిళ గోరఖ్‌పూర్ హైవేపై ఉన్న కాశీ ధాబాలో ఉందని సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడ సోనమ్‌ను గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మేము మధ్యప్రదేశ్, మేఘాలయ పోలీసులతో నిరంతరం సంప్రదిస్తున్నాము.
ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు?
ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. సోనమ్, రాజ్ కుష్వాహాతో కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు సమాచారం. సోనమ్ తండ్రి ఫ్లైవుడ్ ఫ్యాక్టరీలో పని చేసేవాడు రాజ్ కుష్వాహా. అక్కడే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలైంది.
రాజా రఘువంశీ తల్లి ఏమన్నారు?
రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ మాట్లాడుతూ, సోనమ్ ఈ పని చేసి ఉంటే, ఆమెకు కఠినమైన శిక్ష విధించాలి. తామే కాదని యావత్ సమాజం ఇదే కోరుకుటుందని అన్నారు. రాజ్ కుష్వాహాతో సంబంధం గురించి ప్రశ్నించగా, తనకు ఏమీ తెలియదని రాజా తల్లి అన్నారు. దీనిపై సిబిఐ విచారణ జరగాలి, అప్పుడు అంతా స్పష్టమవుతుంది. సోనమ్ అలా చేయకపోతే, తాము ఎందుకు తప్పుడు ఆరోపణలు చేస్తాము? అని ప్రశ్నించారు..
సోనమ్ రఘువంశీ తండ్రి ఏమన్నారు?
నిందితురాలు సోనమ్ రఘువంశీ తండ్రి దేవి సింగ్ రఘువంశీ మాట్లాడుతూ, "హోటల్ యజమాని నుంచి ఫోన్ తీసుకుని తన సోదరుడితో మాట్లాడింది. హోటల్ యజమాని సోనమ్‌కు ఫోన్ ఇచ్చాడు. ఉదయం 5 గంటలకు మాకు తెలిసింది. సోదరుడు గోవింద్ సోనమ్ అప్పుడు ఏడుస్తూ వచ్చి ఈ విషయాన్ని చెప్పాడు. ప్రభుత్వం సిబిఐ విచారణ జరపాలని నేను కోరుతున్నాను, దీనిపై వెనక్కి తగ్గబోం . రాజా హత్యలో మేఘాలయ పోలీసుల పాత్ర 100 శాతం ఉంది, నేను ధైర్యంగా చెబుతున్నాను. మూడు నెలల క్రితం పెళ్లి జరిగింది. మా పిల్లలు ఇలాంటివారు కాదు. "
నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
ఇండోర్ రవాణా వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో అరెస్టయిన ముగ్గురు వ్యక్తులను సోమవారం (జూన్ 9, 2025) జిల్లా కోర్టులో హాజరుపరిచారు, వారిని ఏడు రోజుల పాటు మేఘాలయ పోలీసుల ట్రాన్సిట్ కస్టడీకి పంపారు. ఈ కేసు మిస్టరీని ఛేదించడానికి, పోలీసులు ఇప్పుడు సోనమ్ రఘువంశీని విచారించనున్నారు. పోలీసులు అలాంటి ప్రశ్నలను సిద్ధం చేశారు, దానికి సమాధానం తర్వాత రాజా రఘువంశీ హత్యకు సంబంధించిన అన్ని అంశాలు బయటపడతాయి.
మొదటి ప్రశ్న: రాజ్ కుష్వాహాతో ప్రేమలో ఉన్నప్పుడు రాజా రఘువంశీని ఎందుకు వివాహం చేసుకున్నట్టు?
రెండవ ప్రశ్న: కుటుంబ సభ్యులకు ఈ వ్యవహారం గురించి తెలుసా?
మూడవ ప్రశ్న: హంతకులు రాజా రఘువంశీని చంపడానికి ఎలా ప్లాన్ చేశారు?
నాల్గో ప్రశ్న: ఏదైనా ఒత్తిడితో ఈ హత్య జరిగిందా?
ఐదో ప్రశ్న: ప్రియుడు బ్లాక్ మెయిల్ చేశాడా?
రాజా హత్య కేసు మొత్తం ప్రణాళిక దాగి ఉన్న ప్రశ్నలు ఇవన్నీ. ఈ నిందితులు ఒకరినొకరు ముందు నుంచే తెలుసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ నిందితులలో ఇద్దరు రాజ్ కుష్వాహా స్నేహితులు. రాజా రఘువంశీ హత్య కేసులో నిందితులైన ముగ్గురు నిందితులను ఇండోర్ పోలీసులు, మేఘాలయ పోలీసులు ఆదివారం రాత్రి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో పట్టుకున్నారు.





















