అన్వేషించండి

Markapuram Lecturer: స్టూడెంట్‌ని ప్రెగ్నెంట్ చేసిన లెక్చరర్! ఆమెపై దాడి, పొట్టమీద తన్నడంతో సీరియస్!

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ ఘటనలో అక్టోబరు 10న వెలుగులోకి వచ్చింది. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన స్థితిలో ఉండి వారినే ఉపాధ్యాయులు చెరబట్టిన ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు, ప్రిన్సిపాళ్లు బాలికలను లైంగికంగా వేధించిన ఘటనలు గతంలో వెలుగు చూశాయి. తాజాగా ఇప్పుడు కూడా పాఠాలు చెప్పి విద్యార్థుల్ని ఉద్ధరించాల్సిన ఓ ప్రైవేట్‌ లెక్చరర్ దారి తప్పి కామాంధుడిలా ప్రవర్తించాడు. తన వద్దకు పాఠాల కోసం వచ్చే విద్యార్థినిపై కన్నేసి ఆమెను చెరబట్టాడు. ఫోన్లో ఫోటోలు తీసి వాటితో బెదిరించి అదే పనిగా తన కోరికను తీర్చుకున్నాడు. కొన్నాళ్లకు ఆమె గర్భం దాల్చడంతో అసలు విషయం బయటికి వచ్చింది. బాలిక గర్భం దాల్చిందన్న విషయం తెలుసుకొన్న లెక్చరర్ ఆమెపై దాడికి కూడా పాల్పడ్డాడని స్థానికులు చెప్పారు.

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ ఘటనలో అక్టోబరు 10న వెలుగులోకి వచ్చింది. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్కాపురం టౌన్ చెందిన ఓ విద్యార్థిని 2022లో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదవడానికి చేరింది. అదే కాలేజీలో యర్రగొండపాలెం మండలం పాలుట్ల గ్రామానికి చెందిన గోవింద్‌ నాయక్‌ అనే వ్యక్తి లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అప్పటికే అతనికి పెళ్లై ఓ కొడుకు కూడా ఉన్నాడు. కాలేజీ నుంచి ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పి ఆ బాలికను ఓ రోజు తన బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లాడు. మార్కాపురం శివారులోకి తీసుకెళ్లి అక్కడ ఆమెను దింపి.. అసభ్యకర చిత్రాలను ఫోన్లో తీశాడు. అప్పటి నుంచి ఆమెను వేధింపులకు పాల్పడుతున్నాడు.

Also Read: Chain Snatching: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ దొరికిన దొంగ, స్థానికులు ఏం చేశారంటే?

ఈ సమస్య వల్ల బాలిక ఇంటర్‌ సెకండ్ ఇయర్ ను వేరే కాలేజీలో చదవడానికి వెళ్లిపోయింది. అయినా గోవింద్‌ నాయక్‌ ఆమెను వదలలేదు. తన ఫోన్లో బాలిక అసభ్య చిత్రాలు ఉండడంతో వాటికి వేరే వారికి షేర్ చేస్తానని చెప్పి అదే పనిగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే కొన్నాళ్లకు ఆ విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన నిందితుడైన లెక్చరర్ అబార్షన్ చేసుకోవాలని చెప్పాడు. దీంతో బాలిక అంగీకరించలేదు. దీనిపై ఇద్దరూ పోట్లాడుకొని అది కొట్టుకునే వరకూ వెళ్లింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ఆమెను డాక్టర్లు టెస్టులు చేసి .. ఆమె పొట్టపైన గాయాలు అయ్యాయని చెప్పారు. దీంతో విద్యార్థిని ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని చెప్పారు. వెంటనే అబార్షన్ చేయాలని సూచించారు. 

అక్కడి నుంచి బాధితురాలు తనపై జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రైవేటు లెక్చరర్ పై అత్యాచారం, పోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు మార్కాపురం పోలీసులు వెల్లడించారు.         

Also Read: Navdeep drug case: నైజీరియన్లతో లింకేటి- ఆర్థికలావాదేవీల సంగతేంటి-నవదీప్‌పై ఈడీ ప్రశ్నలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Best Budget Bikes Good Mileage: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?బన్నీకి బాలయ్య సర్‌ప్రైజ్, అస్సలు ఊహించలేదట!అమ్మో! ఇళ్ల పక్కనే పెద్దపులి! గజగజ వణికిపోతున్న జనంనడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Best Budget Bikes Good Mileage: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
Viral Video: 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలెన్నో!' - కీరవాణికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్
'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలెన్నో!' - కీరవాణికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్
Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
Kanguva Release Trailer: కంగువ రిలీజ్ ట్రైలర్... సూర్య అస్సలు తగ్గట్లేదుగా - హిట్టు కళ కనపడుతుంది రోయ్
కంగువ రిలీజ్ ట్రైలర్... సూర్య అస్సలు తగ్గట్లేదుగా - హిట్టు కళ కనపడుతుంది రోయ్
iPhone 15 Sales: అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!
అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!
Embed widget