అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Chain Snatching: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ దొరికిన దొంగ, స్థానికులు ఏం చేశారంటే?

Chain Snatching: భాగ్యనగరంలో నిత్యం చైన్ స్నాచింగ్ ఘటనలు ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. మంగళవారం సిటీలో ఓ చైన్ స్నాచింగ్ యత్నం జరిగింది.

Chain Snatching: భాగ్యనగరంలో నిత్యం చైన్ స్నాచింగ్ ఘటనలు ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. మంగళవారం (అక్టోబరు 10) సిటీలో ఓ చైన్ స్నాచింగ్ యత్నం జరిగింది. ఓ తల్లి తన కూతురుని బడి నుంచి ఇంటికి తీసుకువెళ్తుండగా ఓ చైన్ స్నాచర్ ఆమెను ఫాలో అయ్యాడు. చుట్టుపక్కల ఎవరూ లేని సమయం, స్థలంలో చైన్ లాక్కుని పారిపోవడానికి యత్నించాడు. ప్రతిఘటించిన మహిళపై పిడిగుద్దులు కురిపించాడు. బ్యాగ్ తీసుకుని పారిపోయేందుకు యత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు చైన్ స్నాచర్‌ను పట్టుకుని దేహ శుద్ధి చేశారు. ఘటన లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుండి గొలుసు దొంగతానికి ప్రయత్నించిన ఓ దొంగకు స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల వివరాల మేరకు.. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాపునగర్ శివాలయం ఉంది. అక్కడ చదువుతున్న తన కూతురిని ఇంటికి తీసుకు వెళ్లడానికి వెళ్లింది. అక్కడి నుంచి బిడ్డతో ఇంటికి బయల్దేరింది. అయితే ఆమెను ఓ చైన్ స్నాచర్ ఫాలో అయ్యాడు. మెడలో బంగారం చూసి కాజేయాలని స్కెచ్ వేశాడు. ఆమెకు తెలికుండా ఆమె వెనుకే వెళ్లాడు. 

ఎవరు లేని చోట, మహిళ ఒంటరిగా వెళ్తుండగా మెడలో చైన్ తెంచేందుకు యత్నించాడు. మహిళ తీవ్రంగా ప్రతిఘటించి దొంగను తోసేసింది. దీంతో ఆగ్రహించిన చైన్ స్నాచర్ మహిళ పొత్తి కడుపులో పడి గుద్దులు కురిపించాడు. నొప్పి భరించలేని మహిళ చేతిలో బ్యాగ్, చైన్‌ను వదిలిపెట్టేసింది. అదే అదునుగా స్నాచర్ వాటితో పారిపోవడానికి యత్నించాడు. అయితే బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు దొంగను వెంబడించారు. పట్టుకుని దేహశుద్ధి చేశారు. లంగర్ హౌజ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

చందానగర్‌లో మంగళసూత్రం దోపిడీ
గత ఏప్రిల్ నెలలో చందానగర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలోంచి 4 తులాల మంగళ సూత్రాన్ని అపహరించారు. చందానగర్ పీజేఆర్ స్టేడియం సమీపంలో ఉంటున్న శ్యామల (40) షాపింగ్‌కు వెళ్లారు. కేఎల్ఎం మాల్ వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో పీజేఆర్ స్టేడియం వద్ద గుర్తు తెలియని అగంతకులు వెనక నుంచి బైక్ మీద వచ్చి నాలుగు తులాల మంగళ సూత్రాన్ని అపహరించుకు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కూకట్‌పల్లిలో ఇలాంటి ఘటనే
కూకట్ పల్లిలో ఫిబ్రవరి నెలలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ మహిళ బాలకృష్ణ నగర్ లో కూరగాయలు కొనుగోలు చేసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఓ వ్యక్తి బైక్ పై వచ్చి సైనిక్ పురికి ఎలా వెళ్లాలని అడ్రాస్ అడిగాడు. జేబు నుంచి కారం తీసి మహిళ కళ్లలో చల్లాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మహిళ మెడలోని గోల్డ్ చైన్ ను లాక్కునేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో బాధితురాలి భర్త టూవీలర్ పై వస్తూ ఈ సంఘటనను గమనించాడు. చోరీకి ప్రయత్నించిన దొంగను స్థానికుల సహాయంతో పట్టుకొని దేహశుద్ధి చేశాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget