అన్వేషించండి

Crime News : బెజవాడలో కాల్‌మనీ కలకలం - టీడీపీ కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్ !

విజయవాడలో కాల్ మనీ వడ్డీ పేరుతో వేధిస్తున్న టీడీపీ కార్పొరేటర్ కుమారుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. యాభై వేలు అప్పు ఇచ్చి రెండున్నర లక్షలు వసూలు చేసినట్లుగా బాధితులు ఫిర్యాదు చేశారు.

Crime News : విజయవాడలో మరోసారి కాల్ మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  టీడీసీ కార్పోరేట‌ర్ కుమారుడు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని.. కాల్ మనీ కింద డబ్బులు అప్పు ఇచ్చి పీడిస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. తమను అధిక వడ్డీల పేరుతో వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది కూడా టీడీపీ కార్యకర్తలేనని పోలీసులు చెబుతున్నారు.  విజ‌య‌వాడ కార్పోరేష‌న్ ప‌రిదిలోని 61వ డివిజ‌న్ కు టీడీపీ కార్పొరేటర్ దుర్గ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కుమారుడు ధనశేఖర్  వడ్డీ వ్యాపారం చేస్తూంటారు. కాల్ మనీ పేరుతో అధిక వడ్డీ వసూలు చేస్తున్నాడన్న ఫిర్యాదులు రావడంతో  పోలీసులు 386, 509, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్య‌వ‌హ‌రం పై నున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.  

వడ్డీ వ్యాపారం చేస్తున్న టీడీపీ కార్పొరేటర్ కుమారుడు 

కార్పొరేటర్ కుమారుడు ఫణి కుమార్ అనే వ్యక్తికి రూ.50 వేలు ఇచ్చి. రెండున్నర లక్షలు వసూలు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ త‌రువాత కూడా వేదింపుల‌ను కంటిన్యూ చేశారు. బాధితుడు ఫణి కుమార్ భార్యను  ధన శేఖర్ వేదించిన‌ట్లుగా ఫిర్యాదు రావ‌టంతో పోలీసులు కేసు న‌మోదుచేసి విచార‌ణ చేప‌ట్టారు.  కాల్ మ‌ని...ఈ పేరు చెబితేనే ముందుగా గుర్తుకు వ‌చ్చేది బెజ‌వాడ‌...కాల్ మ‌ని కోసం దారుణాల‌కు ఒడిక‌ట్టిన ఘ‌ట‌న‌లు అనేకం వెలుగు లోకి వ‌చ్చాయి.అప్పులు ఇచ్చి దాని పై వ‌డ్డీల‌తో పాటుగా చ‌క్ర‌వ‌డ్డీలు వ‌సూలు చేయ‌టంతో పాటుగా బాధితుల అవ‌స‌రాల‌ను ఆస‌రాగా చేసుకొని మ‌హిళ‌ల పై లైంగిక వేదింపుల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌లు అనేక వెలుగు లోకి వ‌చ్చాయి. 

అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తున్నారని ఫిర్యాదు

కాల్ మ‌నీ వ్య‌వ‌హ‌రాలు పై గతంలో విజ‌య‌వాడ పోలీస్ క‌మీష‌న‌ర్ గా ప‌ని చేసిన గౌతం స‌వాంగ్ ప్ర‌త్యేక విచార‌ణ బృందాల‌ను ఏర్పాటు చేశారు. పోలీస్ క‌మీష‌న‌రేట్ లోనే ప్ర‌త్యేక ఫిర్యాదు విభాగం కూడా ఏర్పాటు చేశారు. దీంతో అనేక మంది బాదితులు వ‌చ్చి త‌మ ఆవేద‌న‌ను, జ‌రిగిన న‌ష్టాన్ని వివ‌రించారు. ఈ ఘ‌ట‌న విజ‌య‌వాడ‌లో తీవ్ర స్దాయిలో సంచ‌ల‌నం రేకెత్తించింది. విజయవాడలో జరిగిన ఘటనలతో  కాల్ మ‌ని వ్యాపారుల పై రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు. కాల్ మ‌నీకి డ‌బ్బులు ఇచ్చి వేధింపుల‌కు గురి చేసిన వారి పై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌టం తీవ్ర స్దాయిలో సంచ‌ల‌నంగా మారింది. 

గతంలో టీడీపీ నేతలపై కాల్ మనీ కేసులు.. 

గ‌తంలో టీడీపీ అదికారంలో ఉండ‌గానే కాల్ మ‌నికి సంబందించిన అరాచ‌కాలు వెలుగులోకి వ‌చ్చాయి.విజ‌య‌వాడ సీపీగా ప‌ని చేసిన స‌మ‌యంలో గౌతం స‌వాంగ్ కాల్ మ‌ని కాల్ నాగుల‌ను వెలుగు లోకి తీసుకువ‌చ్చి వారి ఆగ‌డాల‌కు చెక్ పెట్టారు. దీంతో చాలా మంది అస‌లు వ‌డ్డీ వ్యాపారం చేయ‌ట‌మే మానేశారు. అప్పులు దొర‌క్క చాలా మంది అవ‌స్ద‌లు కూడ ప‌డ్డారు.టీడీపీ అదికారంలో ఉండ‌గానే కాల్ మ‌ని వ్య‌వ‌హ‌రంలో టీడీపీ పార్టికి చెందిన నాయ‌కుల పేర్లే బ‌య‌ట‌కు రావ‌టంతో పోలీసులు వారి పై కేసులు కూడ పెట్టారు.ఇప్పుడు కూడ టీడీపీకి చెందిన కార్పొరేట‌ర్ కుమారుడు కాల్ మ‌ని వ్య‌వ‌హ‌రంలో అరెస్ట్ కావ‌టం సంచ‌ల‌నం గా మారింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Crime News: కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Maruti Suzuki Wagon R: 34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
Embed widget