అన్వేషించండి

Praneeth Rao: 'ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అలా చేశా' - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు కీలక విషయాలు వెల్లడి!

Hyderabad News: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అలా చేశానని వెల్లడించినట్లు తెలుస్తోంది.

Praneeth Rao Key Details in Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను అలా చేశానని.. ఆ డేటాను కూడా ధ్వంసం చేశానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన్ను మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని ప్రత్యేక టీం భావిస్తోంది. 

ప్రణీత్ రావు ఏం చెప్పారంటే.?

'అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతిపక్ష నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దలకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేశా. ఈ సమాచారాన్ని అప్పటి ఎస్పీ స్థాయి అధికారుల నుంచి ఎస్ఐబీ చీఫ్ వరకూ అందరికీ అందజేశాను. కొందరు నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశాను. చాలామంది అధికారులు, ప్రజా ప్రతినిధుల వాట్సాప్ ఛాటింగ్స్ పై నిఘా పెట్టాను. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అధికారులకు ఇచ్చా. అప్పటి ఎస్ఐబీ మాజీ చీఫ్ ఆదేశాలతో మొత్తం డేటాను ధ్వంసం చేశాను. సెల్ ఫోన్స్, హార్డ్ డిస్కులతో పాటు వేలాదిగా పత్రాలు ధ్వంసం చేశా.' అని ప్రణీత్ రావు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

మరోసారి విచారించేందుకు సిద్ధం

ప్రస్తుతం చంచల్ గూడ జైలులో 14 రోజుల రిమాండ్ లో ఉన్న ప్రణీత్ రావును మరోసారి విచారించేందుకు ప్రత్యేక అధికారుల బృందం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆయన్ను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ లో కోరినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు విచారణలో వెల్లడించిన అధికారులను విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇదీ జరిగింది

ఎస్‌ఐబీలోని ఎస్‌వోటీ ఆపరేషన్‌ హెడ్‌గా ఉన్న సమయంలో డీఎస్పీ ప్రణీత్‌రావు రాజకీయ నాయకులు, ఎన్జీవోలు, పౌర హక్కుల నేతలతో పాటు మావోయిస్టులు, ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఫలితాల రోజు రాత్రి 9 గటల సమయంలో ఆయన లాగర్‌ రూమ్‌కు వెళ్లి హార్డ్‌ డిస్క్‌లతోపాటు డాక్యుమెంట్లను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఎస్‌వోటీ లాగర్‌ రూమ్‌ సీసీ కెమెరాలను ఆఫ్‌ చేయించారు. దాంతో ఆయన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఫోన్ల ట్యాప్‌ చేశారని ఆరోపణలకు పట్టు చిక్కినట్లయింది. లాగర్‌ రూమ్‌లో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేసి వెళ్లిపోయారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాపింగ్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ శాఖ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టింది. కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు మార్చి 12న రాత్రి సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి రాత్రికి రాత్రే ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు.

పక్కా ఆధారాలతో..

ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక ఆధారాలను సేకరించిన అనంతరం చర్యలకు సిద్ధమైంది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు పాత్రపై ఆధారాలు సేకరించిన తరువాతే అరెస్ట్‌ చేశామని పోలీసులు స్పష్టం చేశారు. ఎస్‌ఐబీ లాగర్‌ రూమ్‌లో హార్డ్‌ డిస్క్‌లు ధ్వంసం చేసి, ఆ తరువాత నుంచి ప్రణీత్‌రావు పక్కా ప్లాన్‌తో వ్యవహరించినట్టు పోలీసులు చెబుతున్నారు. గడిచిన నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో డీసీఆర్‌బీలో రిపోర్ట్‌ చేసిన ఆయన.. అక్కడ జాయిన్‌ అయిన రెండు రోజులకే సిక్‌ లీవ్‌ పెట్టారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కీలక ఆధారాలు లభ్యం కావడంతో ప్రణీత్ రావును డీఐజీ రవి గుప్త సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు వారం రోజులు ముందు నుంచే డీసీఆర్‌బీకి ప్రణీత్ రావు వెళ్లలేదని సమాచారం. సిరిసిల్ల హెడ్‌క్వార్టర్‌ విడిచి వెళ్లరాదని సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నట్టు తేలింది. 

Also Read: Hyderabad News: బహిరంగంగానే గంజాయి విక్రయం - ఏళ్ల తరబడి మహిళ మత్తు దందా, పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ తో కటాకటాల్లోకి నిందితురాలు

టాప్ హెడ్ లైన్స్

Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget