మద్యం విషయంలో వివాదం, మందలించాడని మామను చంపిన అల్లుడు- పామర్రులో దారుణం
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. మద్యం తాగి రావద్దన్నందుకు పిల్లనిచ్చిన మామనే హత్య చేశాడు అల్లుడు.
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. మద్యం తాగి రావద్దన్నందుకు పిల్లనిచ్చిన మామనే హత్య చేశాడు అల్లుడు.
పామర్రులో దారుణం...
జిల్లాలోని పామర్రు మండలం జమీగొల్వేపల్లి లో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. డెబ్బై సంవత్సరాల వయస్సులో అల్లుడు చేతిలో మామ దారుణ హత్యకు గురయ్యాడు. షేక్ అల్లా బక్షు ను అల్లుడు మీరావలి మెడపై దారుణంగా గాయపరిచాడు. దీంతో అతను అక్కడికక్కడు ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన స్దానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. హత్య ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. గ్రామస్దులు అందించిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
మద్యం వ్యవహరంలో ఘర్షణ...
ఈ హత్యకు మామ, అల్లుడు మధ్య మద్యం వివాదం కారణంగా జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మీరావలి ప్రతి రోజు మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవకు దిగుతున్నాడు. నిత్యం తాగి వచ్చి గొడవ పడటం, కుటుంబ సభ్యులను భార్య కూడ కొడుతుండంతో మామ అల్లా భక్షు అనేక సార్లు అల్లుడు మీరా వలిని మందలించాడు. ఇదే క్రమంలో సొమరవారం కూడ ఇరువురు మద్య వాగ్వాదం జరిగింది. ఆదివారం నాడు ఫుల్ గా మధ్యం సేవించి వచ్చిన అల్లుడు మీరావలి భార్య, ఇతర కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. దీంతో మామ అల్లా భక్షు కలగ చేసుకొని సముదాయించేందుకు ప్రయత్నించాడు. అయినా మీరా వలి పట్టించుకోలేదు. సోమవారం ఉదయం కూడా వీరి ఇరువురి మద్య మరో సారి వాగ్వాదం జరిగింది. అది కాస్త ఘర్షణకు దారి తీసింది. దీంతో కోపంలో ఉన్న అల్లుడు మీరావలి మామ మెడ పై కర్రతో దాడి దాచేశాడు. తీవ్ర గాయం కావటంతో అల్లా భక్షు సంఘటనా స్దలంలో నే పడిపోయాడు. కుటుంబ సభ్యులు స్థానిక వైద్యుడిని పిలిపించి చూపించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. తీవ్ర గాయం కావటంతో మామ అల్లా భక్షు స్పాట్ లోనే చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
అల్లుడితో గొడవ వద్దన్న కుమార్తె...
హత్యకు పాల్పడిన మీరా వలిది పామర్రు మండల పసుమర్రు గ్రామం.. మద్యం మత్తులో రోజు గోడవలు పడుతుండటంతో, కుటుంబ సభ్యులు అతన్ని వారించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కుటుంబ సభ్యులను వారించినప్పుడల్లా కుమార్తెను కొట్టడం కామన్ అయిపోయింది. దీంతో మీరా వలితో గొడవ పడొద్దని, కుమార్తె తన తండ్రి అల్లా భక్షును వారించింది. అయితే సొమవారం ఉదయం రోజు వారి పని నిమిత్తం భార్య బయటకు వెళ్లిన తరువాత మీరా వలి, తన మామ అల్లా భక్షుతో గొడవపడ్డాడు. అది కాస్త చిలికి చిలికి పెద్దది కావడంతో చివరకు హత్య కు దారితీసింది.
పోలీసుల అదుపులో అల్లుడు...
నిత్యం ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఒక్క సారిగా హత్య జరగడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. హత్యకు పాల్పడిన తరువాత మీరా వలి పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా స్దానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్దలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు మీరా వలిని ప్రశ్నిస్తున్నారు.