Nirmal News: తెలంగాణలో తీవ్ర విషాదం - సెల్ ఛార్జర్ పిన్ నోట్లో పెట్టుకుని షాక్‌తో చిన్నారి మృతి
Telangana News: సెల్ పిన్ ఛార్జర్ నోట్లో పెట్టుకుని ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Child Died Due To Mobile Charger In Nirmal: తెలంగాణలో గురువారం రాత్రి తీవ్ర విషాదం జరిగింది. సెల్ పిన్ ఛార్జర్ నోట్లో పెట్టుకుని ఏడాదిన్నర చిన్నారి మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో (Nirmal District) చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కడెం మండలం కొత్తమద్దిపడిగకు చెందిన దుర్గం రాజలింగు, సుశీల దంపతుల కుమార్తె ఆరాద్య (18 నెలలు) గురువారం రాత్రి ఇంట్లో ఆడుకుంటూ స్విచ్ బోర్డుకు ఉన్న సెల్ ఫోన్ ఛార్జర్ పిన్‌ను (Charger Pin) నోట్లో పెట్టుకుని విద్యుత్ షాక్‌కు గురైంది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని వెంటనే ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అప్పటివరకూ తమతో ఆడుకున్న చిన్నారి ఇక లేదని తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.
కాగా, ఇటీవలే ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన కటికాల రామకృష్ణ దంపతులకు కుమార్తె అంజలీ కార్తీక (9) తడి చేతులతో మొబైల్ ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్ గురై మృతి చెందింది. తన తండ్రి వద్ద మొబైల్ తీసుకుని తడి చేతులతో ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
NOTE: చిన్న పిల్లలు ఉండే ఇళ్లల్లో సెల్ ఫోన్ ఛార్జర్స్ వారికి అందే ఎత్తులో ఉంచకూడదు. సెల్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయాలి. వర్షాల సమయంలో స్విచ్ బోర్డుల వద్ద అప్రమత్తంగా ఉండాలి. లూజ్ కనెక్షన్ ఉన్న వాటి పట్ల జాగ్రత్త వహించాలి. తడి చేతులతో సెల్ ఛార్జింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు ముట్టుకోకూడదు. వర్షాల సమయంలో బయటకు వెళ్లేటప్పుడు కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలి.
Also Read: Siricilla News: నిద్రిస్తున్న వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలు - సిరిసిల్ల జిల్లాలో ఘోరం