అన్వేషించండి
Advertisement
Nizamabad: పరాయి వ్యక్తితో భార్య అఫైర్, వారి బాగోతం కనిపెట్టేసిన భర్త! చివరికి భార్య ఊహించని ట్విస్ట్
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య. పక్క స్కెచ్ తో మర్డర్ ప్లాన్. చివరికి పోలీసులకు చిక్కిన వైనం. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటీవల అక్రమ సంబంధాల కేసులు పెరిగిపోతున్నాయ్. క్షణిక సుఖాల కోసం ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న ఆర్మూర్ నియోజవకవర్గంలో అక్రమ సంబంధానికి అడ్డొస్తుందన్న కారణంగా కన్న కూతురినే చంపేసింది ఓ తల్లి. తాజాగా కామారెడ్డి జిల్లా రుద్రూర్ లో అక్రమ సంబంధానికి అడ్డుతగులుతున్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి కడతేర్చింది ఓ భార్య. ఇలాంటి సంఘటనలు సభ్య సమాజంలో తలదించుకునేలా చేస్తున్నాయ్. అక్రమ సంబంధాల ఉబిలో పడి కట్టుకున్న వారిని కన్న వారిని చంపేయటానికీ వెనకాడటం లేదు.
తాజాగా కామారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో భర్తను హత్య చేయించిందో భార్య.. రుద్రూర్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రుద్రూర్ గ్రామానికి చెందిన కుమ్మరి పోశెట్టి వయస్సు 40 కి ధర్మాబాద్ బాలాపూర్ కు చెందిన సావిత్రితో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. దంపతులు ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవించే వారు. ఈ క్రమంలో గృహ నిర్మాణ పనులు చేసే జెఎస్సీ కాలనీకి చెందిన బట్టు శ్రీనివాస్ తో సావిత్రికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ విషయం ఇటీవల సావిత్రి భర్త పోశెట్టికి తెలియడంతో భార్యతో ఘర్షణ పడ్డాడు. చెడు అలవాట్లు మానుకోవాలని సావిత్రికి చెప్పాడు. సావిత్రి బుద్ధి మార్చుకోనందున తరుచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో సావిత్రి తల్లి చంద్రభాగ ఇటీవల రుద్రూర్ వచ్చింది. కూతురుతో తరుచూ గొడవ పడుతున్న పోశెట్టిని తప్పించాలని తల్లి కూతుళ్లు శ్రీనివాస్ ను ప్రేరేపించారు. దీంతో ఈ నెల 2న పోశెట్టిని ఇంటి నుంచి శ్రీనివాస్ బైక్ పై తీసుకుని వెళ్లాడు. కల్లు దుకాణంలో కల్లు తాగించాడు.
అనంతరం మద్యం షాపులో మందు తీసుకొని నక్కల ఒర్రెకు వెళ్లారు. అక్కడ పోశెట్టికి పూటుగా మద్యం తాగించి చెరువు బ్యాక్ వాటర్ ఒర్రెలోకి తోసేశాడు. చనిపోయాడని నిర్ధారించుకుని ఇంటికి వెళ్లి సావిత్రికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. అనంతరం సావిత్రి ఏమి తెలియనట్లు నటించింది. రెండు రోజులుగా పోశెట్టి కనిపించడం లేదని ఇరుగు పొరుగు వారు ప్రశ్నిస్తే సమాధానం దాటవేసింది. చివరకు పోలీస్ స్టేషన్ లో తన భర్త కన్పించడం లేదని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్సై రవీందర్ దర్యాప్తు చేయగా శ్రీనివాస్ సావిత్రికి ఉన్న సంబంధం బయటపడింది. శ్రీనివాస్ ను విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఘటన స్థలికి రుద్రూర్ సీఐ జాన్ రెడ్డి, ఎస్సై రవీందర్ వెళ్లి మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికి తీయించారు. మృతుడి భార్య సావిత్రి, అత్త చంద్రబాగ, శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తిరుపతి
నిజామాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement