అన్వేషించండి

Kidnap case: 9 నెలల చిన్నారి కిడ్నాప్‌ కథ సుఖాంతం-కొన్ని గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు

హైదరాబాద్‌లో 9నెలల చిన్నారి కిడ్నాప్‌ కేసును ఛేదించారు పోలీసులు. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. పనిమనిషే కిడ్నాపర్‌గా గుర్తించి.. ఆమెను ఆరెస్ట్‌ చేశారు.

Hyderabad kidnap case: పనిమనిషిగా ఇంట్లో చేరింది. రెండు రోజులకే 9 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లింది. తల్లిదండ్రులు గమనించి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు... సీసీ ఫుటేజ్‌ ఆధారంగా... కొన్ని గంటల్లోనే  కేసును ఛేదించారు. జహీరాబాద్‌లో నిందితురాలని పట్టుకున్నారు. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారి దొరకడంతో అటు పేరంట్స్‌, ఇటు పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కాస్త ఆలస్యమయితే... నిందితురాలు...  తప్పించుకునేది అంటున్నారు పోలీసులు. 

అసలు ఏం జరిగిందంటే..?

హైదరాబాద్‌(Hyderabad) పాతబస్తీ (Old city)లోని మాదన్నపేటలో జరిగిందీ కిడ్నాప్‌. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన షహనాజ్‌ఖాన్‌ అనే మహిళ... చిన్నారి ఇంట్లో రెండు రోజుల క్రితమే పనికి కుదిరింది. చిన్నారి ఆరోగ్యం సరిగాలేకపోవడంతో... చంచల్‌గూడలోని నర్సింగ్‌హోమ్‌  ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలోనే... చిన్నారి కిడ్నాప్‌ అయ్యింది. ఇంట్లో పని ముగించుకుని... ఆస్పత్రికి వచ్చిన షహనాజ్‌ఖాన్‌ ఎవరికీ తెలియకుండా పాపను ఎత్తుకెళ్లింది. చిన్నారి కనిపించకపోవడంతో... వెంటనే పోలీసులను ఆశ్రయించారు  తల్లిదండ్రులు. సమీపంలోని సీసీ కెమరాలను పరిశీలించిన పోలీసులు... షహనాజ్‌ఖాన్‌ పాపను కిడ్నాప్‌ చేసినట్టు గుర్తించారు. ఆమె అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్లిందని.. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ (MGBS)లో  జహీరాబాద్‌ (zaheerabad) బస్సు ఎక్కినట్టు గుర్తించారు. వెంటనే జహీరాబాద్‌ పోలీసులను అప్రమ్తతం చేశారు... మాదన్నపేట పోలీసులు. జహీరాబాద్ పోలీసులు వెంటనే... బస్టాండ్‌ దగ్గరకు చేరుకుని వేచి చూశారు. షహనాజ్‌ఖాన్‌ ఎక్కిన బస్సు కోసం  ఎదురుచూశారు. ఆ బస్సు రాగానే అప్రమత్తమయ్యారు. చిన్నారితోపాటు బస్సు దిగిన షహనాజ్‌ఖాన్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

కిడ్నాప్‌ జరిగిన కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు పోలీసులు. చిన్నారిని సేఫ్‌గా పేరంట్స్‌కు అప్పగించారు. నిందితురాలు షహనాజ్‌ఖాన్‌... ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళగా గుర్తించారు. అయితే... ఆమె చిన్నారిని ఎందుకు కిడ్నాప్‌ చేసింది...?  ఎక్కడికి తీసుకెళ్లాలని అనుకుంది...? ఆమె వెనుక కిడ్నాప్‌ ముఠా ఉందా..? అన్న కోణంలో విచారణ జరపనున్నారు పోలీసులు. 

చిన్నారి క్షేమంగా తమ చెంతకు చేరడంతో తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. పాప కిడ్నాప్‌ అయినట్టు వెంటనే గుర్తించడం... త్వరత్వరగా దర్యాప్తు జరగడంతో నిందితురాలిని పట్టుకోగలిగారు పోలీసులు. లేదంటే.. పరిస్థితి ఏంటి..? అన్నది  ఆందోళనకరమే. ఇటీవల నిజామాబాద్‌లోనూ బెగ్గింగ్‌ ముఠా ఆగడాలు బయటపడ్డాయి. చిన్నారులను కిడ్నాప్‌ చేసి... వారిని చిత్రహింసలు పెట్టి దివ్యాంగులుగా మారుస్తున్న ఘటన వెలుగుచూసింది. పిల్లలను దివ్యాంగులుగా మార్చి.. వారితో  బెగ్గింగ్‌ చేయిస్తోంది ఈ ముఠా. ఈ మధ్య కాలంలో పిల్లల కిడ్నాప్‌లు ఎక్కువవుతున్నాయని... చిన్న పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని  హెచ్చరిస్తున్నారు. 

మాదన్నపేట (Madhannapet) కిడ్నాప్‌ కేసులో... నిందితులరాలు షహనాజ్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళ ఏ ఉద్దేశంలో ఇంట్లో పనిమనిషిగా చేరింది. కిడ్నాప్‌ చేయాలనే ప్లాన్‌తోనే ఇంట్లో పనికి చేరిందా? అని కూడా ఆరా తీయనున్నారు పోలీసులు. లేదంటే... కిడ్నాప్‌ వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా..? ఉంటే అవేంటి...? అంటూ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Nalgonda Crime News: యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget