అన్వేషించండి

Nellore Police Love Story : ప్రేమ పేరుతో యువతిని చీట్ చేసిన ఆర్ఎస్ఐ, రహస్యంగా విచారణ!

ఎస్సైగా విధుల్లో చేరిన ఓ యువ ఆర్ఎస్ఐ ప్రేమ కథ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది. ఆ ప్రేమ కథలో అతనే విలన్ కావడం విచిత్రం.

ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీసు విభాగంలో ఎస్సైగా విధుల్లో చేరిన ఓ యువ ఆర్ఎస్ఐ ప్రేమ కథ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది. ఆ ప్రేమ కథలో అతనే విలన్ కావడం విచిత్రం. కొన్నాళ్లుగా ప్రేయసిని దూరం పెట్టిన ఆర్ఎస్ఐ.. చివరకు ఆమెపై చేయి చేసుకోవడంతో ఆమె డయల్ 100కి కాల్ చేసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే విచారణ అంతా రహస్యంగా సాగడం విశేషం. 

ఎవరీ ప్రేమికులు..?

ప్రేమ పేరిట వంచించాడని నెల్లూరులో పనిచేస్తున్న ఓ ఆర్‌ఎస్‌ఐపై  హైదరాబాద్ కు చెందిన యువతి నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెండు రోజులుగా పోలీసు అధికారులు ఈ కేసులో రహస్య విచారణ సాగిస్తున్నారు. 

నెల్లూరు జిల్లాలో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్న ఆ యువకుడు హైదరాబాద్ లో ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇంజినీరింగ్‌ పూర్తయిన తర్వాత హైదరాబాద్ లోనే అతను కూడా కాంపిటీటివ్ పరీక్షలకు కోచింగ్ తీసుకున్నాడు. అప్పుడు కూడా వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. ఆ తర్వాత ఆర్ఎస్ఐగా అతనికి ఉద్యోగం రావడం, పోస్టింగ్ కోసం నెల్లూరుకు వచ్చాడు యువకుడు. నెల్లూరు వచ్చిన తర్వాత కూడా వారిద్దరి ప్రేమ కొనసాగింది. నెల్లూరుకు ఆ యువతి హైదరాబాద్ నుంచి తరచూ వచ్చిపోయేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తనను ఆర్ఎస్ఐ దూరం పెడుతున్నాడని గమనించింది. దీంతో ఆమె అతనితో గొడవ పడింది. చివరకు అతను చేయి చేసుకోవడంతో వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది.

గతంలోనూ ఫిర్యాదులు 

ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. ఆమెను కొట్టడం, ఆమె పోలీసులకు ఫోన్ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. దర్గామిట్ట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆర్ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. తర్వాత ఆమె వద్ద కంప్లయింట్ తీసుకున్నారు. అయితే నిందితుడు కూడా పోలీస్ అధికారి కావడంతో రహస్యంగా విచారణ చేపట్టారని తెలుస్తోంది. రెండు రోజులుగా రహస్యంగా విచారణ చేస్తున్నారు. ఆ యువతి కూడా అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. అయితే ఈ విషయంలో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఆర్ఎస్ఐ పై గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులే ఉన్నతాధికారులకు అందాయట. అప్పట్లో ఓసారి అతడిని ఉన్నతాధికారులు మందలించారని, ఇది రెండో సంఘటన అని అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget