IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Nalgonda: 14 ఏళ్లకే పెళ్లి చేయమన్న బాలిక, తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో అఘాయిత్యం!

Nalgonda Crime: మైనర్ బాలిక - యువకుడి ప్రేమ చివరికి విషాదాంతమైంది. వివాహ వయసు రాకముందే పెళ్లి చేసుకుంటామని పట్టుబట్టగా తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది.

FOLLOW US: 

టీనేజీ వయసు రాగానే ప్రేమ పట్ల ఆకర్షితులై కొందరు యువతి యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరీ 14 ఏళ్ల వయసులోనే అనవసర వ్యామోహాలకు లొంగిపోయి ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఇప్పుడు నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియుడు తనకు దక్కడేమోననే అనుమానంతో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు అతణ్ని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని బాలిక తన తల్లిదండ్రుల వద్ద ఒత్తిడి తెచ్చింది. అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో బాలిక ప్రాణాలు తీసుకుంది.

నల్గొండ జిల్లాలో సోమవారం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మండలం నాగార్జున పేట తండాకు చెందిన ఆంగోతు పాప, కమిలి దంపతులు హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. కుమార్తె ఆంగోతు ఇందుకు 14 ఏళ్లు. ఈమె దేవరకొండ కస్తూర్బా గాంధీ గర్ల్స్ స్కూలులో 8వ తరగతి చదువుతోంది.

ఇదే ఊరిలో బాణావత్‌ శ్రీను - మంగ దంపతులు కూడా ఉన్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. మొదటి కుమారుడు బాణావత్‌ వినోద్‌ అనే 20 ఏళ్ల వ్యక్తి దేవరకొండ టౌన్‌లోనే డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. 

రెండేళ్ల క్రితం కరోనా వల్ల అన్ని మూత పడటంతో పాప - కమిలి దంపతులు తమ కూతురు ఇందును తీసుకుని సొంతూరికి వచ్చేసి బత్తాయి పనులకు వెళ్తూ ఉండేవారు. వినోద్‌ది కూడా అదే ఊరు కావడంతో వారితో పాటే కూలి పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో వినోద్, ఇందు మధ్య పరిచయం పెరిగి అది క్రమంగా ప్రేమగా మారింది. ఈ విషయం కొన్ని నెలల క్రితం రెండు కుటుంబాల్లోని పెద్దలకు తెలిసింది. దీంతో వినోద్‌ తల్లిదండ్రులు 3 నెలల క్రితమే అమ్మాయి ఇంటికి వెళ్లి, పిల్లనివ్వాలని కోరారు. దాంతో వారు అమ్మాయికి ఇప్పుడు పెళ్లి చేయలేమని, ఆమెకు 14 ఏళ్లు మాత్రమేనని తేల్చి చెప్పారు. ఆ తర్వాత బాలిక కూడా తల్లిదండ్రులను వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో బాలిక కొద్ది రోజులుగా ఒత్తిడిలో ఉంటూ ఈ నెల 10 పురుగుల మందు తాగేసింది.

కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఇందును నాగార్జున సాగర్‌ కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. సోమవారం అదే ఆస్పత్రిలో పోస్టుమార్టం కూడా నిర్వహించారు. బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, ఇందు మరణానికి ప్రియుడే కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆత్మహత్య పాల్పడిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రియుడి పాత్ర అందులో ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు.

Published at : 12 Apr 2022 01:36 PM (IST) Tags: Nalgonda Minor girl Nalgonda girl suicide nagarjunapeta thanda Minor love in Nalgonda love in Nalgonda

సంబంధిత కథనాలు

Karimnagar: సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ! ఏకంగా లాయర్‌నే బురిడీ - రూ.లక్షలు హుష్‌కాకీ!

Karimnagar: సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ! ఏకంగా లాయర్‌నే బురిడీ - రూ.లక్షలు హుష్‌కాకీ!

Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు

Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు

Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు

Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు

Karimnagar News : కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు

Karimnagar News :  కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు

Nellore Knife Attack : నెల్లూరులో దారుణం, పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి

Nellore Knife Attack : నెల్లూరులో దారుణం, పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Balakrishna Warning: మళ్లీ రిపీట్ అయితే ఖబడ్దార్! బాలకృష్ణ తీవ్ర హెచ్చరిక

Balakrishna Warning: మళ్లీ రిపీట్ అయితే ఖబడ్దార్! బాలకృష్ణ తీవ్ర హెచ్చరిక

Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు- 14 మంది మృతి

Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు- 14 మంది మృతి

TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు

TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు

Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్‌, నిఫ్టీ