News
News
X

Mumbai Rave Party: సముద్రం మధ్యలో రేవ్ పార్టీ.. భారీగా డ్రగ్స్ పట్టివేత, అదుపులో టాప్ హీరో కొడుకు..!

ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌కు చెందిన అగ్ర హీరో తనయుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు.

FOLLOW US: 
Share:

సముద్రంలో ఉన్న కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరుగుతున్న రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్‌ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్‌ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. 

ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌కు చెందిన అగ్ర హీరో తనయుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరుపుతున్నామని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. సెలబ్రిటీల గురించి విలేకరులు ప్రశ్నించగా.. దానిపై తాను స్పందించబోనని చెప్పారు.

Also Read: ఈ సారి "శాక్రిఫైజ్" అయినట్లే !? పోలీసులపైనే వీడియోలు పెట్టి దొరికిపోయిన సునిశిత్ !

అయితే, షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఈ కేసులో పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా జాతీయ వార్తా పత్రికలు రాశాయి. కానీ, వాంఖడే మాత్రం సెలబ్రిటీలను అదుపులోకి తీసుకున్నారనే విలేకరుల ప్రశ్నకు ప్రస్తుతం ఆ విషయంపై తాను స్పందించబోనని తేల్చి చెప్పారు. కానీ, ఎన్సీబీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆర్యన్ ఖాన్‌కు ఈ రేవ్ పార్టీతో సంబంధం ఉందా లేదా అనే అంశంపై అతణ్ని విచారణ జరుపుతున్నారని జాతీయ వార్తా పత్రికలు పేర్కొన్నాయి. అతని ఫోన్ సీజ్ చేశామని, ఛాటింగ్, ఫోన్ కాల్ డేటా ఇతర వివరాలను పరిశీలిస్తున్నామని వారు తెలిపారు.

Also Read : పోలీసుల్నే బురిడీ కొట్టించిన దొంగ.. డబ్బు కొట్టేసేందుకు మాస్టర్ ప్లాన్, చొక్కాతో అసలు గుట్టు బయటికి..

కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో మూడు రోజుల పాటు ‘మ్యూజికల్ వోయేజ్’ పార్టీ జరగాల్సి ఉంది. బాలీవుడ్ ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. ఈ పార్టీలో పాల్గొనేందుకు ఇద్దరు అమ్మాయిలు సహా ఓ వ్యాపారవేత్త ఢిల్లీ నుంచి ముంబయికి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు.

Also Read : ఆమిర్ ఖాన్ తో అక్కినేని ఫ్యామిలీ డిన్నర్ పార్టీ.. సమంత ఎక్కడ..? అంటూ నెటిజన్ల ప్రశ్నలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 03 Oct 2021 10:27 AM (IST) Tags: Shah Rukh Khan Mumbai rave party Aryan Khan in Drugs case Narcotics Control Bureau cordelia cruise empress Bollywood Drugs Case

సంబంధిత కథనాలు

Delhi Hit And Drag Case: ఢిల్లీలో మరో హిట్ అండ్ డ్రాగ్ కేసు - 350 మీ. ఈడ్చుకెళ్లిన కారు,  ఒకరు మృతి

Delhi Hit And Drag Case: ఢిల్లీలో మరో హిట్ అండ్ డ్రాగ్ కేసు - 350 మీ. ఈడ్చుకెళ్లిన కారు, ఒకరు మృతి

Hyderbad Crime : ఆన్లైన్ లో కాంటాక్ట్ చేసి హైదరాబాద్ కు రప్పించి, వ్యాపారి నుంచి డైమండ్ కొట్టేసిన కేటుగాడు

Hyderbad Crime : ఆన్లైన్ లో కాంటాక్ట్ చేసి హైదరాబాద్ కు రప్పించి, వ్యాపారి నుంచి డైమండ్ కొట్టేసిన కేటుగాడు

BBC Documentary Row: ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ వివాదం, ఢిల్లీ వర్సిటీ వద్ద రచ్చ రచ్చ - పలువురు విద్యార్థుల అరెస్ట్

BBC Documentary Row: ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ వివాదం, ఢిల్లీ వర్సిటీ వద్ద రచ్చ రచ్చ - పలువురు విద్యార్థుల అరెస్ట్

Warangal Crime : చెత్త సేకరణ ముసుగులో చోరీలు, ముగ్గురు కిలేడీలు అరెస్టు

Warangal Crime : చెత్త సేకరణ ముసుగులో చోరీలు, ముగ్గురు కిలేడీలు అరెస్టు

Vijayawada: పక్కవీధి మహిళతో భర్త ఆరేళ్లుగా అఫైర్, ఊహించని షాక్ ఇచ్చిన భార్య!

Vijayawada: పక్కవీధి మహిళతో భర్త ఆరేళ్లుగా అఫైర్, ఊహించని షాక్ ఇచ్చిన భార్య!

టాప్ స్టోరీస్

Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్

Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !

Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?