X
Super 12 - Match 17 - 25 Oct 2021, Mon up next
AFG
vs
SCO
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Sacrifice Star Sunisith : ఈ సారి "శాక్రిఫైజ్" అయినట్లే !? పోలీసులపైనే వీడియోలు పెట్టి దొరికిపోయిన సునిశిత్ !

గతంలో హీరోయిన్లతో అఫైర్లు ఉన్నాయని చెప్పుకుని అరెస్టయిన సునిశిత్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఈ సారి అతను పోలీసులపైనే తప్పుడు వీడియోలు సృష్టించాడు.

FOLLOW US: 

వాడు మామూలోడు కాదు. వాడు మాటల దెబ్బకు పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లకే కళ్లు తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. కొంత మంది పిచ్చోడని లైట్ తీసుకున్నా.. కొంత మంది తట్టుకోలేక లావణ్య త్రిపాఠి లాంటి తారలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతగా వేధించాడు. అతనెవరో కాదు శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్. సోషల్ మీడియాలో సింపుల్‌గా ఫేమ్ ఎలా తెచ్చుకోవాలో బాగా అధ్యయనం చేసి ప్రముఖులందరిపై రూమర్లు పుట్టిస్తే.. అదీ కూడా తనకు లింక్ పెట్టుకుని పుట్టిస్తే.. తనకు కావాల్సినంత ఫేమ్ వస్తుందని అనుకున్నాడు. అలాగే చేశాడు. హీరోలు., హీరోయిన్లు అందరూ కలిసి తనను తొక్కేశారని.. అందరితోనూ తనకు పెళ్లిళ్లయ్యాయని.. వదిలేశారని చెప్పుకుని శాక్రిఫైజ్ స్టార్ అయ్యాడు. అయితే అందరూ ఊరుకోరుగా... ఓ సారి లోపలేసి కుమ్మేశారు పోలీసులు. అప్పట్నుంచి రూటు మార్చాడు. 

Also Read : ‘ఈబిడ్‌’ వ్యవహారంలో కొత్త కోణం.. సంస్థ ప్రతినిధుల ఆస్తులను రాయించుకున్న ముగ్గురు నేతలు!

ఫేమ్ తెచ్చుకోవడానికి హీరోయిన్లతో అఫైర్లను తనకు తానే అంటగట్టేసుకుని ఇతర యూ ట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చిన సునిషిత్ తర్వాత రూటు మార్చాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత సొంతంగా యూట్యూబ్ చానల్ పెట్టాడు. సునిశిత్ టీవీ పేరుతో యూట్యూబ్ చానల్ పెట్టి.. ఈ సారి వాళ్లూ.. వీళ్లు ఎందుకనుకున్నాడేమో కానీ ఏకంగా పోలీసుల మీదే పుకార్లు పుట్టించి వీడియోలు పెట్టడం ప్రారంభించాడు. మొదట్లో ఊరుకున్న పోలీసులు ...  చురుకు తగిలిన తర్వాత ఊరుకుంటారా..?

Also Read: అధిక వడ్డీ పేరుతో కుచ్చుటోపీ.. రూ.50 కోట్ల వరకు వసూలు.. జగిత్యాలలో ఓ వ్యాపారి మోసం..

ఇటీవల మల్కాజిగిరి స్టేషన్‌లో పని చేసే ఓ పోలీసు అధికారిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియో పోస్ట్‌ చేశాడు. అది అటూ ఇటూ తిరిగి బాగా వైరల్ అయింది. చివరికి ఆ అధికారి దృష్టిలో పడింది. వెంటనే ఆ అధికారి ఫిర్యాదు చేశాడు. సునిశిత్ నివాసం ఉన్న కీసర పరిధిలో పోలీసులు మిగతా పని పూర్తి చేశారు. అరెస్ట్ చేశారు. తప్పుడు వీడియో ఇచ్చినట్లు నిందితుడు ఒప్పుకొన్నాడని పోలీసులు ప్రకటించారు. ఇక పోలీస్ మార్క్ కోటింగ్ ఇచ్చారో లేదో  బయటకు రాలేదు. 

Also Read: ఎవరు గొప్ప అంటూ చెలరేగిన ఘర్షణ.. విద్యార్థి ప్రాణాల్ని బలిగొన్న కొట్లాట.. విశాఖలో దారుణం

ఈ సునిశిత్‌ది చూడటానికి అమాయకంగా చెబుతున్నట్లుగా ఉంటాడు చాలా క్రిమినల్ మైండ్ సెట్ అని పోలీసులు చెబుతున్నారు. గతంలో ఉద్యోగం చేసిన కాలేజీలో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి జైలుకు వెళ్లాడు. వచ్చాక హీరోయిన్లపై వీడియోలు చేశాడు. ఇప్పుడు పోలీసులపై వీడియోలు తీశాడు.

Also Read : పోలీసుల్నే బురిడీ కొట్టించిన దొంగ.. డబ్బు కొట్టేసేందుకు మాస్టర్ ప్లాన్, చొక్కాతో అసలు గుట్టు బయటికి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: police Sunishit sacrifising star snisit videos sunishit arrest

సంబంధిత కథనాలు

India Vs Pak Match Betting: భారత్-పాక్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్... విశాఖలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...

India Vs Pak Match Betting: భారత్-పాక్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్... విశాఖలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...

Warangal Crime: మద్యం షాపులను టార్గెట్ చేసిన జల్సారాయుళ్లు... చోరీల్లో సిద్ధహస్తులు... ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు

Warangal Crime: మద్యం షాపులను టార్గెట్ చేసిన జల్సారాయుళ్లు... చోరీల్లో సిద్ధహస్తులు... ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు

Nalgonda Lovers Suicide: నల్గొండ జిల్లాలో విషాదం... ప్రేమను చంపుకోలేక ప్రాణాలు తీసుకున్నారు...

Nalgonda Lovers Suicide: నల్గొండ జిల్లాలో విషాదం... ప్రేమను చంపుకోలేక ప్రాణాలు తీసుకున్నారు...

Husband Sells Wife: పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసిన భర్త.. ఆమెకు ఏం చెప్పి అమ్మాడో తెలుసా!

Husband Sells Wife: పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసిన భర్త.. ఆమెకు ఏం చెప్పి అమ్మాడో తెలుసా!

Hyderabad Crime: నడిరోడ్డుపై ఆగిపోయిన కారు... డోర్ తీసి చూస్తే మృతదేహం... కూపీ లాగితే వివాహేతర సంబంధం బయటపడింది

Hyderabad Crime: నడిరోడ్డుపై ఆగిపోయిన కారు... డోర్ తీసి చూస్తే మృతదేహం... కూపీ లాగితే వివాహేతర సంబంధం బయటపడింది
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!

IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!

Bigg Boss 5 Telugu: ఎలిమినేట్ అయిన ప్రియా.. షాక్ లో హౌస్ మేట్స్..

Bigg Boss 5 Telugu: ఎలిమినేట్ అయిన ప్రియా.. షాక్ లో హౌస్ మేట్స్..

Tdp Vs Ysrcp: దిల్లీకి చేరిన ఏపీ రాజకీయం... సోమవారం రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ బృందం

Tdp Vs Ysrcp: దిల్లీకి చేరిన ఏపీ రాజకీయం... సోమవారం రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ బృందం

Zika Virus In UP: యూపీలో తొలి జికా కేసు నమోదు.. అప్రమత్తమైన అధికారులు.. స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు

Zika Virus In UP: యూపీలో తొలి జికా కేసు నమోదు.. అప్రమత్తమైన అధికారులు.. స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు