Mister Telangana: రోడ్డు ప్రమాదంలో మిస్టర్ తెలంగాణ మృతి - బైక్‌పై వేగంగా అదుపు తప్పి ఆటోను ఢీకొని..
Telangana News: ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ మహమ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వేగంగా వెళ్తుండగా.. స్క్రాప్ ఆటోను ఢీకొని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
![Mister Telangana: రోడ్డు ప్రమాదంలో మిస్టర్ తెలంగాణ మృతి - బైక్‌పై వేగంగా అదుపు తప్పి ఆటోను ఢీకొని.. mister telangana mohammad sohail died in a road accident in siddipeta Mister Telangana: రోడ్డు ప్రమాదంలో మిస్టర్ తెలంగాణ మృతి - బైక్‌పై వేగంగా అదుపు తప్పి ఆటోను ఢీకొని..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/11/0ee33be19fc7141fd5ec6ecac7837e4f1720684563411876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mister Telangana Mohammad Sohail Died In A Road Accident: ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ (Mister Telangana) విజేత మహ్మద్ సోహైల్ (23) (Mohammad Sohail) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సోహైల్ తన స్నేహితుడు మహ్మద్ ఖదీర్‌తో కలిసి జూన్ 29న సిద్దిపేట నుంచి మిరిదొడ్డి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బైక్‌పై వేగంగా వెళ్తుండగా.. అదుపు తప్పి స్క్రాప్ ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సోహైల్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్నవయసులోనూ తమకు దూరమయ్యాడంటూ తీవ్ర ఆవేదన చెందారు.
కెరీర్ లో విజేతగా..
సిద్ధిపేట జిల్లాకు చెందిన సోహైల్ అనేక జిల్లా, రాష్ట్ర స్థాయి, దక్షిణ భారత స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్స్ గెలుచుకున్నాడు. మిస్టర్ తెలంగాణ ఛాంపియన్ షిప్‌లోనూ విజేతగా నిలిచారు.
Also Read: Dowry Harassment: ఐఏఎస్ ఆఫీసర్‌గా నమ్మించి పెళ్లి, అదనపు కట్నం కోసం వేధింపులతో వెలుగులోకి వాస్తవం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)