అన్వేషించండి

Tuni RTC Diesel Theft : 11 వేల లీటర్ల డీజిల్ మాయం ! భూమి తాగేసిందట...

తుని ఆర్టీసీ డిపోలో 11వేల లీటర్ల డీజిల్ మిస్సవడం కలకలం రేపుతోంది. భూమిలోకి ఇంకిపోయిందని అధికారులు చెబుతున్నారు.

Tuni RTC Diesel Theft :  గతుకుల రోడ్ల మీద మైలేజీ తీసుకు రాలేదని ఎంత మేర డీజిల్ ఎక్కువ ఉపయోగించారో అంత మేర బస్సు డ్రైవర్ జీతంలో కోత విధిస్తామని ఇటీవల ఆర్టీసీ ఉన్నతాధికారులు జారీ చేసిన మెమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెరిగిపోతున్న డీజిల్ ధరల కారణంగా ఆర్టీసీ డ్రైవర్లు మరింత జాగ్రత్తగా ఉండటానికి ఇలాంటి హెచ్చరికలు జారీ చేశారేమోనని అందరూ అనుకున్నారు. మామూలుగా ట్యాంకుల్లోని డీజిల్ విషయంలోనే ఇలా ఉంటే.. మరి డిపోల్లోని పెట్రోల్ ట్యాంకుల దగ్గర ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు కొలతలు తీసుకుని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారని మనం అనుకుంటాం.. కానీ అక్కడ జరిగింది వేరు. ఏకంగా 11వేల లీటర్ల డీజిల్ మాయమైపోయింది. 

భూమిలో ఉన్న ట్యాంకర్‌లో డీజిల్ మాయం !

కాకినాడ జిల్లాల తుని ఆర్టీసీ డిపోలో నిన్నామొన్నటి వరకూ బల్క్‌గా డీజిల్ కొనుగోలు చేసి అంతర్గతంగా పెట్రోలు పంపుల ద్వారా బస్సుల్లో నింపుతూంటారు. ఇదంతా పక్కాగా జరుగుతుంది. ఎంత ఆయిల్ వస్తోంది.. ఎంత బస్సులకు పట్టిస్తున్నారు.. మిగతా ఎంత స్టాక్ ఉంది.. లెక్కలు చూసుకుంటూ ఉంటారు. ఇటీవల బల్క్‌గా కొంటే.. రేటు ఎక్కువ అవుతోందని.. రీటైల్‌గా కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా ట్యాంకుల్లో ఉండాల్సిన ఆయిల్ అలాగే ఉండిపోయింది. రెండురోజుల కిందట... ట్యాంకులో చూస్తే చుక్క కూడా డీజిల్ కనిపించలేదు. 

ట్యాంకర్‌కు చిల్లు పడి భూమిలో ఇంకిపోయిందంటున్న అధికారులు

మొత్తంగా పదకొండు వేల లీటర్ల డీజిల్ కనిపించకుండా పోయింది. దీంతో ఇంటి దొంగలే కాజేరేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆర్‌టిసి గ్యారేజీ వద్ద భూమిలో ఉన్న ట్యాంకర్‌ లీకైందని చెబుతున్నారు. భూమిలో ట్యాంకర్ లీకవడం వల్ల డీజిల్ మొత్తం ఇంకిపోయిందని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఆర్‌టిసి విజిలెన్స్‌ బృందం విచారణ చేపడుతున్నట్లు తెలుస్తుంది. ట్యాంకర్‌ లీకేజీతోనే డీజిల్‌ కనిపించడం లేదా ? మరేదైనా కారణం ఉందా ? అనే కోణంలో విజిలెన్స్‌ అధికారులు తేల్చనున్నారు. 

విజిలెన్స్ విచారణ ప్రారంభఁ - డీజిల్ ఏమయిందో బయటకు వస్తుందా ?

గతంలో కొన్ని చోట్ల మద్యం.. బియ్యం.. గోధుమలు వంటివి ప్రభుత్వం గోడౌన్లలో మిస్సయ్యేవి. అప్పుడు ఎలుకలు తిన్నాయని.. మరొకటని కారణంగా చెప్పేవారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. కానీ ఇప్పుడు మాత్రం డీజిల్ భూమిలో ఇంకిపోయిందని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget