Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ శాఖ సిబ్బందిపై స్థానికుల దాడి, ప్రాణ భయంతో పరుగులు!
Hyderabad Old City News | బకాయి ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లించాలని చెప్పడానికి వెళ్లిన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిపై హైదరాబాద్ పాతబస్తీలో స్ధానికులు దాడికి యత్నించారు.
Hyderabad Old City | హైదరాబాద్: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత చేసిన ఆరోపణలు నిజమయ్యాయి. ఓల్డ్ సిటీలో ఎవరైనా అధికారి వెళ్లి ప్రభుత్వానికి రావాల్సిన బిల్లులు వసూలు చేయగలరా అని, ఇది తెలిసినా ఇప్పటివరకూ ఉన్న ప్రభుత్వాలు ఎందుకు దీనిపై చర్యలు తీసుకోలేదు అని తెలంగాణ లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ మహిళా నాయకురాలు మాధవీలత ప్రశ్నించారు. తాజాగా ఆమె చెప్పిందే జరిగింది. హైదరాబాద్ పాతబస్తీ (Hyderabad Old City)లో విద్యుత్ అధికారులపై స్థానికులు దాడికి యత్నించారు. .
మీరాలం దర్గా ప్రాంతంలో సంబంధిత సిబ్బంది విద్యుత్ కనెక్షన్లను పరిశీలించడానికి వెళ్లారు. ఇది గమనించిన స్థానికులు విద్యుత్ అధికారులపై దాడికి దిగుతూ తరిమికొట్టే ప్రయత్నం చేశారు. వారి వద్ద ఉన్న విద్యుత్ బకాయిలకు సంబంధించిన పేపర్లు, రిపోర్ట్స్ చింపేసినట్లు తెలుస్తోంది. మీరాలం దర్గా వాసులు వాగ్వాదానికి దిగి, దాడికి యత్నించడంతో విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టడం కలకలం రేపుతోంది. నెలలు తరబడి కరెంట్ బిల్లులు చెల్లించడం లేదని, పరిశీలించి కలెక్షన్లు తొలగించడానికి విద్యుత్ సిబ్బంది వెళ్లగా.. స్థానికులు వారిపై దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురిచేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.