News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

భార్యను కిరాతకంగా చంపి ఆమె మెదడు తినేసిన భర్త, పుర్రెని యాష్‌ట్రేగా వాడుకున్నాడు

Mexican Kills Wife: ఓ మెక్సికన్ తన భార్యను దారుణంగా చంపి ఆమె మెదడు తిన్నాడు.

FOLLOW US: 
Share:

Mexican Kills Wife:

మెక్సికోలో దారుణం..

మెక్సికోలో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా చంపేశాడు. అక్కడితో ఆగకుండా ఆమె మెదడుని బయటకు తీసి తినేశాడు. మెక్సికన్ ఫుడ్‌ Tacosలో ఆమె మెదడుని పెట్టి తిన్నాడు. ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...నిందితుడు అల్వారో ఓ బిల్డర్. జూన్ 29వ తేదీన డ్రగ్స్ తీసుకున్నాడు. అక్కడ నిషేధం ఉన్నా అక్రమంగా తెచ్చుకున్నాడు. ఆ మత్తులోనే భార్యను దారుణంగా హత్య చేశాడు. ఎందుకిలా చేశావని అడిగితే.."మృత్యుదేవత నాతో మాట్లాడింది. ఆమెని చంపాలని చెప్పింది" అని పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. ఏడాది క్రితమే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆమెకి అప్పటికే ఐదుగురు పిల్లలున్నారు. అయితే..తన భార్యని హత్య చేసిన తరవాత మెదడు బయటకు తీసి తిన్నానని పోలీసుల ముంద అంగీకరించాడు నిందితుడు. అంతేకాదు. ఆమె పుర్రెని యాష్‌ట్రేగా వాడుకున్నాడు. ఆ తరవాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టాడు. రెండ్రోజుల పాటు ఆ ఇంట్లోనే ఉన్న నిందితుడు ఆ తరవాత కూతురికి ఫోన్ చేసి మర్డర్ చేసినట్టు ఒప్పుకున్నాడు. "నేను మీ అమ్మని చంపేసి బ్యాగ్‌లో పెట్టాను. వచ్చి డెడ్‌బాడీని కలెక్ట్ చేసుకో" అని చెప్పాడు. సుత్తితో బలంగా కొట్టి చంపేసినట్టు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ హైడోస్ తీసుకోవడం వల్ల కంట్రోల్ కోల్పోయాడని, బహుశా మానసిక స్థితి కూడా సరిగ్గా లేనట్టుందని వివరించారు. ఆమె కూతుళ్లనూ చాలా సార్లు లైంగికంగా వేధించినట్టు ఆరోపణలున్నాయి. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోంది. 

ముంబయిలో ఇలా....

ముంబయిలో ఇటీవలే అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఓ మహిళను ముక్కలు ముక్కలుగా నరికాడు ఓ వ్యక్తి. వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం...డెడ్‌బాడీని ముక్కలు చేయడమే కాదు. వాటిలో కొన్ని భాగాల్ని కుక్కర్‌లో వేసి ఉడికించాడు. మరి కొన్ని అవయవాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేశాడు. తలుచుకుంటేనే ఒళ్లు వణికిపోయేంత పాశవికంగా ప్రవర్తించాడు. ఇంటిని సీజ్ చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గీతానగర్‌లోని ఫేజ్‌-7 లో ఈ దారుణం జరిగింది. 56 ఏళ్ల మనోజ్ సానే, 32 ఏళ్ల సరస్వతి వైద్య మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆమెను ఇలా రాక్షసంగా చంపేశాడు. పొరుగింటి వాళ్లకు దుర్వాసన రావడం వల్ల వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు రంగంలోకి దిగాక కానీ ఈ మర్డర్‌ గురించి తెలియలేదు. అప్పటికే స్పాట్‌లో ఉన్న నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. శ్రద్ధావాకర్  హత్యను గుర్తు చేసింది ఈ మర్డర్. బాడీని ముక్కలు నరికి ఎక్కడ పడితే అక్కడ పారేయాలని అనుకున్నాడు. వాటిని కట్ చేయడానికి కట్టర్ మెషీన్‌ని వాడాడు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. ప్రాథమికంగా కొన్ని వివరాలు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న ఆమె బాడీని కనిపించకుండా చేయాలని ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పారు. 

Also Read: హింసాత్మకంగా బెంగాల్ పంచాయతీ ఎన్నికలు, అల్లర్లలో 9 మంది మృతి

Published at : 08 Jul 2023 01:17 PM (IST) Tags: Mexico Crime Mexican Kills Wife Eats Brain Eats Wife Brain Skull Ashtray

ఇవి కూడా చూడండి

Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి

Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి

Online Betting Scam: ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, యువకులు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు 

Online Betting Scam: ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, యువకులు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు 

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Hyderabad: హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

Hyderabad:  హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

టాప్ స్టోరీస్

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?