అన్వేషించండి

Visakhapatnam: విశాఖలో దారుణం కత్తితో మహిళను పొడిచి చంపిన వ్యక్తి

కత్తితో పొడిచిన మహిళను దారుణంగా చంపిన వ్యక్తి.

విశాఖలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ వెంటపడుతూ ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న ఆమెతో వాగ్వాదానికి దిగి.. ఉన్మాదిగా మారి కత్తితో పొడిచి చంపేశాడు. ద్వారకా నగర్‌లో ఈ ఘటన జరిగింది.

 పెదగంట్యాడలోని సుభాషిని అనే మహిళ హత్య ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే.. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో డ్యూటీలో ఉన్న మహిళ దారుణ హత్యకు గురి కావడంతో తీవ్ర కలకలం రేగుతుంది. వివరాల్లోకి వెళితే.

ఆరిలోవ ప్రాంతంలో నివాసం ఉంటున్న సుజాత అనే మహిళకు గతంలో వివాహం అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటుంది. గత 20 రోజుల క్రితం ద్వారకా నగ‌ర్‌లోని మై రాంక్ అనే కన్సల్టెన్సీ కార్యాలయంలో టెలికాలర్‌గా చేరింది సుజాత.

ఏమైందో ఏమో కానీ ఆఫీసులో ఉన్న సుజాత దగ్గరికి వెళ్ళాడు ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి. HDFCలో రికవరీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు ఉమామహేశ్వరరావు. డ్యూటీలో ఉన్న సుజాత దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఇంతలో లోపలే ఉన్న మై ర్యాంక్ యజమాని శ్రీనివాసరావు ప్రశ్నించాడు. దీంతో తన అత్త కొడుకని చెప్పింది సుజాత. ఈలోగా ఆమె సెల్ఫోన్ తీసుకొని కిందకు వెళ్లిపోయాడు ఉమామహేశ్వరరావు.

వెంటనే అతను వెనుక సుజాత కూడా పరిగెత్తింది. ఐదో ఫ్లోర్ నుంచి నాలుగో ఫ్లోర్‌కు వచ్చేసరికి.. ఏమైందో ఏమో కానీ పెద్ద పెద్ద అరుపులు, కేకలు వినిపించాయి. వెళ్లి చూసేసరికి సుజాత రక్తపు మడుగులో పడి ఉంది. ప్రాణాలు కోల్పోయింది. పక్కనే ఉమామహేశ్వరరావు కూడా గొంతుకు గాయంతో ఉన్నాడు. దీంతో హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

అయితే గత కొంతకాలంగా సుజాత వెంట ఉమామహేశ్వరరావు పడుతున్నాడని ఆరోపిస్తోంది సుజాత తల్లి కృప. కత్తి పట్టుకుని తిరుగుతున్నాడని తన కూతురు చెప్పేదని అంటుంది. ఉమామహేశ్వరరావు, సుజాతకు పరిచయం ఎలా అన్నదానిపై తనకు తెలియదని అంటుంది తల్లి. కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు అంటూ కన్నీరు మున్నీరై విలపిస్తోంది.

సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు మార్చురీకి తరలించారు. ప్రస్తుతం నిందితుడు కే జి హెచ్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే పోలీసులు వెళ్లిన సమయంలో కత్తి ప్రాణాలు కోల్పోయిన సుజాత చేతిలో ఉండడం అయోమయానికి గురి చేసింది. నిందితుడే ఈ డ్రామా ఆడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుజాతతో వాగ్వాదానికి దిగడంతో ప్రశ్నించేసరికి కిందకు వెళ్లిపోయాడని.. గతంలో ఎప్పుడో సుజాత కోసం రాలేదని అంటున్నారు మై రాంక్ యజమాని శ్రీనివాసరావు. నగదు బాకీ ఉండటంతో.. తనతో గొడవ పడుతున్నట్టు సుజాత చెప్పిందని అంటున్నారు. మరోవైపు ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారు ఏసిపి వివేకానంద. ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో నిందితుడు ఉండడంతో.. అతని వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. 24 గంటలు గడవక ముందే  విశాఖలో మరో మహిళ దారుణ హత్య గురికావడంతో ప్రస్తుతం చర్చనీయంగా మారింది. 

టాప్ హెడ్ లైన్స్

హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Daughter in law Stab Mother in law: అత్తను విచక్షణారహితంగా పొడిచిన కోడలు - సికింద్రాబాద్‌లో ఘోరం - ఇలాంటి కారణంతో కూడానా?
అత్తను విచక్షణారహితంగా పొడిచిన కోడలు - సికింద్రాబాద్‌లో ఘోరం - ఇలాంటి కారణంతో కూడానా?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget