అన్వేషించండి

Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న

Crime News: ఏపీలో దారుణాలు చోటు చేసుకున్నాయి. బాపట్ల జిల్లాలో స్థల వివాదంతో సొంత బాబాయ్‌నే కొట్టి చంపేశారు. అటు, కాకినాడ జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి సొంత తమ్ముడినే నరికేశాడు.

Man Murder In Bapatla District: కుటుంబంలో నెలకొన్న స్థల వివాదంతో కొందరు సొంత బాబాయ్‌పైనే దాడికి పాల్పడగా అతను మృతి చెందాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా (Bapatla District) నగరం మండలం దాసరిపాలెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూషయ్య (48), ఆయన ఇద్దరు సోదరుల కుమారుల మధ్య ఇంటి స్థలం విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీంతో పాటు ఇరు కుటుంబాల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయి. ఈ క్రమంలోనే శనివారం రాత్రి భూషయ్యకు, ఆయన సోదరుల కుమారులకు మాటా మాటా పెరిగి.. వారు కర్రలతో భూషయ్యపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన భూషయ్యను కుటుంబసభ్యులు జీజీహెచ్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తమ్ముడిని చంపిన అన్న

అటు, కాకినాడ జిల్లాలో (Kakinada District) దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన తమ్ముడినే దారుణంగా నరికేశాడు. తాళ్లరేవు మండలం పి.మల్లవరానికి చెందిన వ్యక్తి కుటుంబ వివాదాలతో తమ్ముడిని నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఆన్ లైన్ బెట్టింగ్‌కు కుటుంబం బలి

మరోవైపు, చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. కొడుకు ఆన్ లైన్ బెట్టింగ్‌కు బానిసై రూ.లక్షల కొద్దీ అప్పులు చేయగా.. కుటుంబం బలైంది. కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు యత్నించగా.. ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో నాగరాజురెడ్డి (61) కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆయన ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా.. ప్రస్తుతం అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. అతని కుమారుడు దినేష్ చిత్తూరులో బీటెక్ చదువుతున్నాడు. చిత్తూరులో తల్లీకొడుకులిద్దరూ అద్దె ఇంట్లో ఉంటుండగా.. తండ్రి స్వగ్రామంలోనే ఉంటున్నాడు. నాగరాజురెడ్డి కుమార్తె సునీత రాజస్థాన్‌లో ఉద్యోగం చేస్తూ 3 నెలల కిందటే వచ్చింది.

కుమారుడు దినేష్ 'ఆన్ లైన్ బెట్టింగ్‌'లకు బానిసై రూ.20 లక్షల వరకూ అప్పు చేశాడు. అయినా, ఆపకుండా మళ్లీ రూ.లక్షల్లో అప్పులు చేశాడు. కాగా, నాగరాజు సోదరుల మధ్య ఇటీవలే ఆస్తి పంపకాలు జరగ్గా.. వీరికి రూ.20 లక్షలు వచ్చింది. ఈ క్రమంలో కొడుకు అప్పులు చేసిన విషయం తెలిసి నాగరాజురెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో కుటుంబ బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకుంది. నలుగురూ శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు వారిని గమనించి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందగా.. కుమారుడు దినేష్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: AP Politics: క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget