By: Ram Manohar | Updated at : 10 Jun 2023 11:27 AM (IST)
యూపీలో ఓ యువకుడు ప్రియురాలిని దారుణంగా హత్య చేసి ట్యాంక్‌లో బాడీని దాచి పెట్టాడు.
UP Crime:
యూపీలో ఘటన..
దేశవ్యాప్తంగా రోజూ ఎక్కడో ఓ చోట దారుణ హత్యలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే 24 గంటల్లోనే మూడు రాష్ట్రాల్లో ఒళ్లు జలదరించే ఘటనలు జరిగాయి. ఇప్పుడు యూపీలోనూ మరో హత్య జరిగింది. ప్రియురాలిని దారుణంగా చంపిన ఓ యువకుడు...డెడ్‌బాడీని ఇంటిపై ట్యాంక్‌లో దాచి పెట్టాడు. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లి ఎవరి కంటా పడకుండా ట్యాంక్‌లో పడేశాడు. మహేవాలో ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతురాలు రాజ్ కేసర్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. అరవింద్ అనే యువకుడు ఆమెను హత్య చేసినట్టు తెలిపారు. అయితే...ఈ మర్డర్ రెండు వారాల క్రితమే జరగ్గా...ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మే 30వ తేదీన మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చాడు నిందితుడు అరవింద్. విచారణ జరిపిన పోలీసులు...ఆమె కాల్ హిస్టరీని చెక్ చేశారు. ఆ తరవాత అనుమానంతో నిలదీశారు. వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించారు. అప్పుడు కానీ అసలు విషయం బయటపడలేదు. ప్రస్తుతానికి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు.
ముంబయిలోనూ దారుణం..
ముంబయిలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఓ మహిళను ముక్కలు ముక్కలుగా నరికాడు ఓ వ్యక్తి. వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం...డెడ్‌బాడీని ముక్కలు చేయడమే కాదు. వాటిలో కొన్ని భాగాల్ని కుక్కర్‌లో వేసి ఉడికించాడు. మరి కొన్ని అవయవాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేశాడు. తలుచుకుంటేనే ఒళ్లు వణికిపోయేంత పాశవికంగా ప్రవర్తించాడు. ఇంటిని సీజ్ చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గీతానగర్‌లోని ఫేజ్-7 లో ఈ దారుణం జరిగింది. 56 ఏళ్ల మనోజ్ సానే, 32 ఏళ్ల సరస్వతి వైద్య మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆమెను ఇలా రాక్షసంగా చంపేశాడు. పొరుగింటి వాళ్లకు దుర్వాసన రావడం వల్ల వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు రంగంలోకి దిగాక కానీ ఈ మర్డర్ గురించి తెలియలేదు. అప్పటికే స్పాట్‌లో ఉన్న నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. శ్రద్ధావాకర్ హత్యను గుర్తు చేసింది ఈ మర్డర్. బాడీని ముక్కలు నరికి ఎక్కడ పడితే అక్కడ పారేయాలని అనుకున్నాడు. వాటిని కట్ చేయడానికి కట్టర్ మెషీన్‌ని వాడాడు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. ప్రాథమికంగా కొన్ని వివరాలు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న ఆమె బాడీని కనిపించకుండా చేయాలని ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పారు.
#WATCH | Maharashtra | 32-year-old woman killed by 56-year-old live-in partner | As per Police, the accused Manoj Sahni killed Saraswati Vaidya 3-4 days back and after that, he purchased a tree-cutter to chop her into pieces. Police say that the accused boiled pieces of her body… pic.twitter.com/ilFUfWVOLY
— ANI (@ANI) June 8, 2023
Also Read: Mine Collapsed: ప్రాణాలు తీసిన అక్రమ మైనింగ్, బొగ్గు గనిలో ప్రమాదం - శిథిలాల కింద బాధితులు
Maharashtra Hospital: ఒకే ఆస్పత్రిలో ఒకే రోజులో 24 మంది మృతి - నాందేడ్‌లో తీవ్ర విషాదం!
Medipally: ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన జిమ్ ట్రైనర్-పోక్సో కేసు నమోదు
Tirupati Boy Kidnap: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్ - సీసీ ఫుటేజ్‌లో కీలక విషయాలు
UKG Student Died: పలకతో కొట్టిన టీచర్, యూకేజీ విద్యార్థి మృతి
UP News: వీళ్లు రక్షకభటులా! జంటను బెదిరించి యువతికి పోలీసుల లైంగిక వేధింపులు
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
Yashasvi Jaiswal: బాబోయ్ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్
/body>