అన్వేషించండి

Maharashtra: మెదటి భార్య కుమారుడు రెండో భార్యతో పారిపోయాడు - పోలీసుల్ని ఆశ్రయించిన వ్యక్తి !

Viral Love Story: తన రెండో భార్య మొదటి భార్య కుమారుడితో వెళ్లిపోయిందని మహారాష్ట్రలో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హర్యానాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

Maharashtra Viral Love Story:  మహారాష్ట్రలో సినిమా స్టోరీని తలపించేలా అత్యంత విచిత్రమైన, విస్తుపోయే క్రైమ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన మొదటి భార్య కుమారుడు  తన  రెండవ భార్యతో  కలిసి పారిపోయాడంటూ ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కుమారుడు కనీసం మేజర్ కూడా కాదు. ఇంకా పద్దెనిమిదేళ్లు నిండలేదు. ఈ వ్యవహారంపై బాధితుడు కైజ్   పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో  దర్యాప్తులో అసలు విషయాలు బయటపడ్డాయి.  

ట్రాఫిక్ చలాన్‌తో బయటపడ్డ గుట్టు                                       

బీడ్ జిల్లాకు చెందిన బాధితుడికి మొదటి భార్య ద్వారా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం ఆయన రెండో వివాహం చేసుకున్నాడు. ఇటీవల ఆయన ముంబైలో ఒక ధార్మిక కార్యక్రమానికి వెళ్లిన సమయంలో, ఇంట్లో ఉన్న మైనర్ కుమారుడు,  రెండో భార్య కనిపించకుండా పోయారు. అయితే, వారు ఎక్కడికి వెళ్లారో తెలియక కుటుంబ సభ్యులు తలలు పట్టుకుంటున్న తరుణంలో.. బాధితుడి అల్లుడి ఫోన్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుండి ఒక  ఈ-చలాన్ మెసేజ్ వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వచ్చిన ఆ చలాన్ ఆధారంగా.. అల్లుడి బైక్ వేసుకుని ఆ ఇద్దరూ హైదరాబాద్‌కు పారిపోయినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించుకున్నారు. ఈ విచిత్ర ఉదంతంపై బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

మహిళ కోసం హైదరాబాద్‌లో వెదుకులాట                           

తన మైనర్ కుమారుడిని తన భార్య ప్రలోభపెట్టి కిడ్నాప్ చేసిందని, ఇంటి నుండి వెళ్లేటప్పుడు కొంత నగదు, నగలు కూడా తీసుకువెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీసులు మైనర్ బాలుడి కిడ్నాప్ మరియు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.   కుమారుడు  మైనర్ కావడంతో పోలీసులు ఈ కేసును మరింత సీరియస్‌గా తీసుకున్నారు. బాలుడిని ప్రలోభపెట్టి తీసుకువెళ్లినందుకు సదరు మహిళపై చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అటు హైదరాబాద్ పోలీసులు, ఇటు మహారాష్ట్ర పోలీసులు సమన్వయంతో ఆ ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 
 
 హర్యానాలోనూ ఇలాంటిదే మరో ఉదంతం 

ఇదే తరహా విస్తుపోయే ఘటన హర్యానాలోని నుహ్  జిల్లాలోనూ చోటుచేసుకుంది. అక్కడ మొదటి భార్య మరణించడంతో సదరు వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, తండ్రి రెండో భార్యను తల్లిగా గౌరవించాల్సిన కొడుకు, ఆమెతోనే ప్రేమలో పడి ఏకంగా  వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం ఆ జంట అక్కడి నుండి మాయమవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ రెండు ఘటనల్లోనూ కుమారులు తమ సవతి తల్లులతోనే ప్రేమలో పడి పారిపోవడం సామాజిక సంబంధాల పతనాన్ని సూచిస్తోంది.                        

 

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Leak: అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Pamban Rail Bridge suicides: పాంబన్ రైల్వే వంతెనపై విషాదాలు.. సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నం, ఒకరి మృతి, మహిళ పరిస్థితి విషమం
పాంబన్ రైల్వే వంతెనపై వరుస విషాదాలు.. సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నం, ఒకరి మృతి, మహిళ పరిస్థితి విషమం
Kulgam Encounter: సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి ప్రతీకారం.. కుల్గాం ఎన్‌కౌంటర్‌లో లష్కర్ అగ్ర కమాండర్ లతీఫ్ భట్‌ హతం!
సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి ప్రతీకారం.. కుల్గాం ఎన్‌కౌంటర్‌లో లష్కర్ అగ్ర కమాండర్ లతీఫ్ భట్‌ హతం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
Mitchell Santner Injury: టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Embed widget