అన్వేషించండి

Iran US War: బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు - చర్చలకు ఇరాన్ నో - తర్వాత ఏం జరగబోతోంది?

US ship seizure: హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో చర్చలు ఆగిపోయాయి. ఇరాన్..తాము అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తేలేదని చెబుతోంది.

Tehran skip talks With US: హార్ముజ్ జలసంధి  కేంద్రంగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధం అంచుకు చేరుకున్నాయి. అమెరికా నౌకాదళం ఒక ఇరాన్ సరుకు రవాణా నౌకను బలవంతంగా స్వాధీనం చేసుకోవడంతో, ఇరు దేశాల మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ  ఒప్పందం ప్రమాదంలో పడింది. ఇరాన్ ఈ చర్యను  సముద్రపు దొంగతనం  గా అభివర్ణించడమే కాకుండా, త్వరలోనే గట్టి సమాధానం ఇస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
 
అమెరికా నావికాదళం ఆదివారం రాత్రి హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ జెండాతో ఉన్న  టౌస్కా అనే కార్గో నౌకను అడ్డుకుంది. ఆరు గంటల పాటు సాగిన ఉత్కంఠ తర్వాత, అమెరికా మెరైన్లు హెలికాప్టర్ల ద్వారా నౌకలోకి ప్రవేశించి దానిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అమెరికా ఆంక్షలను ఉల్లంఘిస్తూ చైనా నుండి బందర్ అబ్బాస్ నౌకాశ్రయానికి వెళ్తున్నందున ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.  అమెరికా ప్రకటించిన నౌకా దిగ్బంధనం తర్వాత జరిగిన మొట్టమొదటి భారీ సీజ్ ఇదే  

 
అమెరికా చర్యపై ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికానే ఉల్లంఘించిందని, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా తమ నౌకను హైజాక్ చేసిందని ఆరోపించింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఈ వారం జరగాల్సిన రెండో రౌండ్ శాంతి చర్చల్లో పాల్గొనే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ మిలిటరీ కమాండ్ కూడా స్పందిస్తూ, తమ పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరిగితే గల్ఫ్ దేశాలలోని విద్యుత్ కేంద్రాలు, డీశాలినేషన్ ప్లాంట్లపై దాడి చేస్తామని హెచ్చరించింది.  

 
ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్‌పై తక్షణమే పడింది. చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే భయంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. చైనా విదేశాంగ శాఖ కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇరు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పరిస్థితి మరింత చేయి దాటకముందే కాల్పుల విరమణను పాటించాలని కోరింది.  ప్రస్తుతం పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న శాంతి ప్రయత్నాలు ఈ నౌక స్వాధీనంతో నీరుగారిపోయాయి. బుధవారంతో ముగియనున్న 15 రోజుల కాల్పుల విరమణ గడువు పొడిగింపుపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా మొండితనం, ఇరాన్ ప్రతీకార హెచ్చరికల మధ్య పశ్చిమ ఆసియా మరోసారి రణరంగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
US PERM Labor Certification Suspension: అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!
అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Embed widget