అన్వేషించండి

Chhattisgarh: చత్తీస్‌ఘడ్‌లో కొండను ఢీకొని కూలిపోయిన ప్రైవేట్ జెట్ - అందులో ఎవరున్నారు?

Private jet: ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో ప్రైవేట్ జెట్ కొండను ఢీకొని కుప్పకూలింది. అందులో ఎవరైనా వీఐపీ ప్రయాణిస్తున్నారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Private jet crashes:  ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రైవేట్ జెట్ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. జిల్లాలోని నారాయణపూర్ ప్రాంతంలో ఉన్న ఆరా హిల్స్ (Ara Hills) వద్ద ఈ చార్టర్డ్ విమానం ఒక్కసారిగా కూలిపోయింది. కొండను ఢీకొన్న వెంటనే విమానంలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.                             

ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న పైలట్,  కో-పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ చిన్న ప్రైవేట్ జెట్ ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థకు చెందినదిగా తెలుస్తోంది. విమానంలో పైలట్లు మినహా ఇతర ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు. మృతుల వివరాలను సేకరించేందుకు , వారి కుటుంబాలకు సమాచారం అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.    

ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. విమానం చాలా తక్కువ ఎత్తులో  సుమారు 30 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా కొండను లేదా చెట్లను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో వాతావరణం అనుకూలించక పోవడం లేదా సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలంలో విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.                                      

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్  ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించింది. జష్‌పూర్ ఎస్పీ స్వయంగా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తూ, విమాన గమ్యం , ఇతర సాంకేతిక వివరాలను సేకరిస్తున్నారు. జష్‌పూర్ జిల్లాలోని దట్టమైన అటవీ,  కొండ ప్రాంతం కావడం వల్ల సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగింది. విమాన బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాతే ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.             

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
Donald Trump Order: ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
ABP Desam Top 10, 1 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 1 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Embed widget