అన్వేషించండి

CRPF Jobs: 9,195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. టెన్త్ పాసైన వారు అర్హులు, ఏజ్ లిమిట్ పూర్తి వివరాలు

CRPF Recruitment: సీఆర్పీఎప్ కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ రిక్రూట్‌మెంట్ 2026 కింద 9,195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మే 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పెద్ద జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. CRPF తన కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ 2026 (Constable Tradesman Recruitment 2026) కింద ఏకంగా 9195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు మే 19 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. 

వయోపరిమితి (Age Limit)

CRPF రిక్రూట్‌మెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయసు 18 ఏళ్లుగా నిర్ణయించారు. సిపాయి డ్రైవర్ పోస్టుకు 21 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. ఇతర పోస్టులకు 18 నుండి 23 సంవత్సరాల వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసును జనవరి 1, 2026 ఆధారంగా లెక్కిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాల వారికి ఇందులో మినహాయింపు ఉంటుంది.

అభ్యర్థులకు అర్హత ఏం ఉండాలి ?
అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. కానిస్టేబుల్ డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్ వంటి సాంకేతిక పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో టెక్నికల్ ఎలిజబిలిటీ లేదా తగిన అనుభవం కూడా అవసరం.

శారీరక ప్రమాణాలు ఎంత ఉండాలి
పురుష అభ్యర్థులకు - జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎత్తు కనీసం 170 సెం.మీ ఉండాలి. ఎస్టీ అభ్యర్థులు అయితే కనీసం 162.5 సెం.మీ ఎత్తు ఉండాలి. అలాగే ఛాతి 80 నుండి 85 సెం.మీ మధ్య ఉండాలి.

మహిళా అభ్యర్థులు - జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 157 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎస్టీ వర్గ అభ్యర్థులు కనీసం 150 సెం.మీ ఎత్తు ఉండాలి 

సీఆర్పీఎఫ్ పోస్టుల ఎంపిక ప్రక్రియ

  • మొదట CBT రాత పరీక్ష నిర్వహిస్తారు

  • ఆ తరువాత PET (Physical Efficiency Test)

  • తరువాత PST (Physical Standard Test) చేస్తారు

  • మీ సర్టిఫికెట్స్ పరిశీలన (Document Verification)

  •  చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ (Medical Examination) చేస్తారు

అప్లికేషన్ ఫీజు ఎంత ఎంత?

ఈ CRPF రిక్రూట్‌మెంట్ కోసం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన పురుష అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు, మాజీ సైనికోద్యోగులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

జీతం ఎంత ఇస్తారు
ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-3 (Pay Level-3) ప్రకారం శాలరీ లభిస్తుంది. ఇందులో ప్రారంభ జీతం నెలకు రూ. 21,700 నుండి గరిష్టంగా 69,100 వరకు ఉంటుంది. దీంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.

దరఖాస్తు చేయడం ఎలా?

  1. ముందుగా మీరు CRPF అధికారిక వెబ్‌సైట్ rect.crpf.gov.in కి వెళ్ళండి.

  2. హోంపేజీలో CRPF Constable Tradesman Recruitment 2026 లింక్‌పై క్లిక్ చేయండి.

  3. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

  4. అప్లికేషన్ ఫారమ్‌లో అన్ని వివరాలను ఫిల్ చేయాలి. 

  5. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని అప్‌లోడ్ చేయండి.

  6. అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేసిన తరువాత వచ్చే ఫాంను ఫ్యూచర్ అవసరాల కోసం పీడీఎఫ్ సేవ్ చేసుకోండి. అవసరమైతే ప్రింటౌట్‌ తీసి పెట్టుకోవడం మంచిది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
Embed widget