అన్వేషించండి

Lenskart Controversy: లెన్స్ కార్ట్‌ను వదలని వివాదాలు - మతం కారణంగా తీసేశారని ఉద్యోగి ఆరోపణలు - సూరత్‌లో రచ్చ

Surat: లెన్స్‌కార్ట్ చుట్టూ ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. మతపరమైన చిహ్నాలను ధరించినందుకు ఉద్యోగిని తొలగించారన్న ఆరోపణలు రావడంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Surat lenscart:  గుజరాత్‌లోని సూరత్ నగరంలో ప్రముఖ ఐవేర్ బ్రాండ్  లెన్స్‌కార్ట్ (Lenskart) చుట్టూ ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. ఒక హిందూ ఉద్యోగి తన మతపరమైన చిహ్నాలను ధరించినందుకు కంపెనీ అతనిని పనిలో నుండి తొలగించిందన్న ఆరోపణలు రావడంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీల్ వఘాసియా అనే యువకుడు ట్రైనింగ్ సమయంలో తన మత విశ్వాసాలకు గుర్తులైన శిఖ , తిలకం , జంధ్యం ధరించాడని, కంపెనీ యాజమాన్యం వీటిని తొలగించాలని ఆదేశించిందని ఆరోపించాడు. దీనికి అతను నిరాకరించడంతో, అతనిని తక్షణమే ఉద్యోగం నుండి తొలగించారని  ప్రచారం జరుగుతోంది. 

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన హిందూ ధార్మిక సంస్థలు సూరత్ వీధుల్లో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. నగరంలోని ఒక లెన్స్‌కార్ట్ షోరూమ్ ఎదుట ఆందోళనకారులు బైఠాయించి, కంపెనీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కంపెనీ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు. ఇతర మతాలకు చెందిన చిహ్నాలను అనుమతిస్తూ, కేవలం హిందూ ధర్మ చిహ్నాలపైనే వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని వారు మండిపడుతున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ధోరణులను సహించబోమని హెచ్చరించారు.   

బాధితుడు జీల్ వఘాసియా కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు.  నా వృత్తి కంటే నా ధర్మమే నాకు ముఖ్యం. ధర్మం కోసం ఉద్యోగాన్ని వదులుకోవడానికైనా సిద్ధమే తప్ప, నా విశ్వాసాలను వదులుకోను అని చెబుతున్నారు.  ఈ క్రమంలో  గుజరాత్ కుచెందిన పలువురు హిందూ ప్రముఖులు కూడా రంగంలోకి దిగి, కంపెనీ తన విధానాలను మార్చుకోకపోతే ఈ నిరసనలు కేవలం సూరత్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా వ్యాపిస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగుల వ్యక్తిగత విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యత కార్పొరేట్ సంస్థలపై ఉందని వారు పేర్కొంటున్నారు.   

ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. నెటిజన్లు లెన్స్‌కార్ట్‌ను ఉద్దేశించి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై లెన్స్‌కార్ట్ అధికారికంగా ఇంకా పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సాధారణంగా కార్పొరేట్ సంస్థలకు డ్రెస్ కోడ్ నిబంధనలు ఉన్నప్పటికీ, అవి మతపరమైన స్వేచ్ఛను హరించేలా ఉండకూడదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
లెన్స్‌కార్ట్ సంస్థ ఇటీవల ఇలాంటి మతపరమైన అంశాల్లోనే వివాదాస్పదమయింది. ఆ వివాదంతో  ఇన్-స్టోర్ స్టైల్ గైడ్ ను సమూలంగా మార్చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు తమ మతపరమైన , సంస్కృతికి సంబంధించిన చిహ్నాలను ధరించేందుకు స్పష్టమైన అనుమతిని ఇచ్చింది. బిందీ, తిలకం, సింధూరం, , మంగళసూత్రం, కడా, హిజాబ్ ,  టర్బన్ వంటి వాటన్నింటినీ గౌరవిస్తామని, ఇవి ఎవరికీ మినహాయింపులు కావని, ఇవి మన భారతీయ మూలాల్లో భాగమని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. ఇప్పుడు తాజాగా సూరత్‌లో చోటుచేసుకున్న మతపరమైన చిహ్నాల వివాదం, పాత వివాదాలను మరోసారి గుర్తుచేస్తూ కంపెనీ బ్రాండ్ ఇమేజ్‌పై ప్రభావం చూపుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Embed widget