News
News
X

Madhapur Accident: మద్యం వల్లే మాదాపూర్ యాక్సిడెంట్‌! ఆ కారుపై భారీ చలాన్లు, అన్నీ అలాంటివే..

మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సీఐఐ జంక్షన్ వద్ద ఆగివున్న బైక్‌ను కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

FOLLOW US: 

హైదరాబాద్‌లోని మాదాపూర్‌‌లో జరిగిన రోడ్డు ప్రమాద కారణాలను పోలీసులు గుర్తించారు. బైక్‌ను ఢీకొన్న ఘటనలో కారు నడిపిన సృజన్ కుమార్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహించగా.. మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని రక్తపరీక్షలు కూడా పోలీసులు చేయిస్తున్నారు. ఆదివారం రాత్రి ప్రమాదం జరిగిన తర్వాత కారు వదిలి సృజన్ పరారైన సంగతి తెలిసిందే. సృజన్‌ కుమార్ కారుపై 11పైగా ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో అధికభాగం డేంజరస్, ర్యాష్ డ్రైవింగ్‌ కింద నమోదైనవే కావడం గమనార్హం.

మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సీఐఐ జంక్షన్ వద్ద ఆగివున్న బైక్‌ను కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ సైనిక్‌పురిలో నివాసం ఉండే అజయ్, జెన్నిఫర్ డిక్రూజ్ మాదాపూర్ ఐటీ జోన్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఈ మధ్యే వారిద్దరికీ పెళ్లి సంబంధం కుదరగా.. పెద్దల సమక్షంలో ఘనంగా నిశ్చితార్ధం జరిగింది. త్వరలో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే శనివారం అజయ్, జెన్నిఫర్ గచ్చిబౌలిలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. 

Also Read: ప‌ద్మశ్రీ అవార్డుల కోసం పేర్లు పంపాలా? వ‌ద్దా? కేంద్రంతో గలాటనే.. అసెంబ్లీలో కేసీఆర్

రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనంపై కొత్తగూడ వైపు నుంచి సైబర్ టవర్ వైపు వెళుతుండగా .. సీఐఐ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో బైక్ ఆపారు. ఇంతలో వెనక వైపు నుంచి వేగంగా వచ్చిన మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ కారు బైక్ ని ఢీకొట్టింది. దీంతో బైక్ ఉన్న ఇద్దరూ కిందపడిపోయారు. జెన్నిఫర్ తలకు బలమైన గాయాలు కావడంతో సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే‌ ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. బైక్ నడుపుతున్న అజయ్ ఎడమ చేయి, ఎడమ కాలు, వెన్నముకకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

News Reels

Also Read: TSRTC: మీరు సిటీ బస్ ఎక్కుతారా? అయితే గుడ్‌న్యూస్.. మీకు డబ్బు ఆదా.. సంస్థకు లాభం!

అయితే ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ సృజన్ అక్కడినుంచి పరారయ్యాడు. మృతురాలి తండ్రి జాన్ సిరిల్ డిక్రూజ్ ఫిర్యాదు మేరకు‌ కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘనంగా నిశ్చితార్థం చేశారు. త్వరలోనే ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలవుతుందనుకున్నారు. ఇంతలోనే అంతులేని విషాదాన్ని నింపింది రోడ్డు ప్రమాదం. ఓ కుటుంబానికి కడుపుకోత మిగిల్చితే మరో కుటుంబానికి కొడుకు ఎప్పటికి తేరుకుంటాడో తెలియని పరిస్థితిలోకి నెట్టేసింది.

Also Read: రిపబ్లిక్ సినిమా చూసిన రేవంత్ రెడ్డి, సీతక్క.. వారి స్పందన ఏంటంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Oct 2021 03:05 PM (IST) Tags: hyderabad accident madhapur police CAA Junction accident Car Bike accident Madhapur Accident

సంబంధిత కథనాలు

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

Peddapalli Crime News: అప్పు ఇచ్చిన పాపానికి దివ్యాంగుడిపై దాడి, ఏం జరిగిందంటే?

Peddapalli Crime News: అప్పు ఇచ్చిన పాపానికి దివ్యాంగుడిపై దాడి, ఏం జరిగిందంటే?

Crime News: ఈజీ మనీ కోసం రిటైరయ్యాక ఫేక్ దందా షురూ, కథ అడ్డం తిరిగి బుక్కయ్యాడు !

Crime News: ఈజీ మనీ కోసం రిటైరయ్యాక ఫేక్ దందా షురూ, కథ అడ్డం తిరిగి బుక్కయ్యాడు !

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

COOKIES_POLICY