IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Chittoor News: మద్యం మత్తులో దారుణం.. పొట్టేలుకు బదులు వ్యక్తి తల నరకడంతో గ్రామస్తులు షాక్

సంక్రాంతి సంబరాలు విషాదాన్ని నింపాయి. ఎల్లమ్మ ఆలయం వద్ద మద్యం మత్తులో ఉన్న తలారి.. పొట్టేలు అనుకుని ఓ వ్యక్తి తలపై కత్తితో వేటు వేశాడు.

FOLLOW US: 

Man Killed Instead Of Sheep: జంతుబలులు చేయకూడదని, వాటిని నిషేధించాలని మానవతావాదులు వాదిస్తుంటారు. అయితే కొన్ని చోట్ల జంతుబలులే కాదు గుట్టు చప్పుడు కాకుండా నరబలులు చేసిన ఘటనలు వెలుగు చూస్తుంటాయి. కొందరు మందుబాబులు మద్యం మత్తులో ఏం చేస్తారో వారికే తెలియదు.. పీకల వరకు మద్యం సేవించి ఈ లోకంలో తనకు మించిన హీరో ఎవరూ లేరండూ రోడ్లపై విన్యాసాలు, కేకలతో తెప్పిస్తుంటారు. మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పని ఆ గ్రామాన్నే విషాదంలోకి నెట్టింది. జంతుబలి చేయబోతే అది నరబలిగా మారడంతో పెను విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలంలో ఈ ఘటన జరిగింది.

సంక్రాంతి సంబరాలు విషాదాన్ని నింపాయి. గ్రామ దేవతలకు జంతుబలులు ఇస్తుంటారు. పొలిమేరలో ఉన్న గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు పొంగళ్ళు నిర్వహించారు. ఈ క్రమంలో మదనపల్లె రూరల్ మండలం వలసపల్లెలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. అయితే స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టెలును బలిచ్చేందుకు తీసుకొచ్చారు. మద్యం మత్తులో ఉన్న తలారి.. పొట్టేలు అనుకుని ఓ వ్యక్తి తల నరికేశాడు. అక్కడ జరిగింది చూసిన వారు ఒక్కసారిగా షాకయ్యారు. జంతుబలి నరబలిగా మారిపోవడంతో స్థానికంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

మద్యం తాగిన తలారి..
పొలిమేరలో గ్రామదేవతకు బలి ఇచ్చేందుకు పొట్టేలును తీసుకొచ్చారు. తలారి లక్ష్మణ్ కుమారుడు తలారి సురేష్‌(35) పొట్టేలును పట్టుకుని నిల్చున్నాడు. మరో తలారి చలపతి అప్పటికే మద్యం సేవించి ఉన్నాడు. బలిచ్చే సమయం కాగా, అంతా ఒకే అన్నారు. కానీ మద్యం మత్తులో ఉన్న తలారి చలపతి పొట్టేలు తలకు బదులుగా తలారి సురేష్ తలపై కత్తితో వేటు వేశాడు.  ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అతడ్ని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు చలపతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మద్యం మత్తులో ఉండటం వల్లే ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Also Read: Kurnool కలెక్టర్ పీఏని అని చెప్పి డబ్బులు డిమాండ్.. నిందితుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

Also Read: Nellore: కోడి పెంట తరలింపు పేరుతో దిమ్మతిరిగే దందా.. ‘పుష్ప’ రేంజ్‌లో మాస్టర్ ప్లాన్లు, పక్క రాష్ట్రం నుంచి..

Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే

Also Read: D.Srinivas: కాంగ్రెస్ లోకి ధర్మపురి శ్రీనివాస్ రీ ఎంట్రీ.. 'కారు' దిగి 'చేయి' పట్టుకునేది ఎప్పుడంటే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 17 Jan 2022 10:04 AM (IST) Tags: AP News Crime News Chittoor District Madanapalle sheep Sankranti 2022 makar sankranti Man Killed Man Killed Instead Of Sheep

సంబంధిత కథనాలు

Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్

Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్

Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు

Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు

Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు

Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు

Guntur Ganja Cases : గంజాయి కోసం పోటీ ప‌డుతున్న గుంటూరు ఖాకీలు, లెక్కలు చెప్పిన ఎస్పీ!

Guntur Ganja Cases : గంజాయి కోసం పోటీ ప‌డుతున్న గుంటూరు ఖాకీలు, లెక్కలు చెప్పిన ఎస్పీ!

Renuka Chowdhury : మాజీ ఎంపీ రేణుకా చౌదరిపై కేసు నమోదు, వైద్యుడి సతీమణి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్!

Renuka Chowdhury : మాజీ ఎంపీ రేణుకా చౌదరిపై కేసు నమోదు, వైద్యుడి సతీమణి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!

Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!

Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!

Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!

Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?

Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?