అన్వేషించండి

Kurukshetra News: భర్తను చంపి పేగులు సంచిలో వేసిన భార్య! ఇంటి యజమాని చూడటంతో...! 

Kurukshetra Murder News: కురుక్షేత్రలోని పెహోవా రోడ్డులో రాజ్ ప్యాలెస్ సమీపంలోని ఒక ఇంట్లో భర్తను దారుణంగా హత్య చేసిందో భార్య. తన భర్త పేగులను కట్ చేసి సంచివేసుకుంది.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కురుక్షేత్రలో భార్య విమల భర్త రాజేష్‌ను కత్తులతో హత్య చేసింది.
  • మృతదేహం పేగులను సంచిలో వేస్తుండగా ఇంటి యజమాని చూశాడు.
  • భయంతో బాల్కనీ నుండి దూకిన ఆమె ఆసుపత్రిలో చేరింది.
  • పోలీసులు ఘటనా స్థలంలో మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

Kurukshetra News: హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఘోర ఘటన అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. భార్య ప్రవర్తించిన తీరుకు అంతా షాక్ అయ్యారు. ఈ ఘటన కురుక్షేత్రలోని పెహోవా రోడ్డులో ఉన్న రాజ్ ప్యాలెస్ సమీపంలో జరిగింది. రాజ్ ప్యాలెస్ సమీపంలోని ఒక ఇంట్లో, ఒక మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. అతని శరీరాన్ని ముక్కలు చేసింది. పేగులను కూడా బయటకు తీసి సంచిలో వేసుకుంది. ఆ మహిళ తన భర్త రాజేష్ (40)ను కత్తులతో పదేపదే పొడిచింది. అతని పొట్టను సుమారు 35 సెంటీమీటర్ల మేర చీల్చింది. మృతుడి పోస్ట్‌మార్టం సమయంలో వైద్యులు షాక్ అయ్యారు.  

మృతుడిని ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా, ధాంపూర్ గ్రామానికి చెందిన రాజేష్‌గా గుర్తించారు. అతను సుమారు ఒక సంవత్సరం నుంచి తన భార్య విమలా దేవితో కలిసి కురుక్షేత్రలో నివసిస్తున్నారు. పెహోవా రోడ్డులోని పిబి ఆర్ఓ వాటర్ ట్రేడింగ్ కంపెనీలో నీటి సరఫరాదారుగా పనిచేసేవాడు.

దర్యాప్తులో ఘోరమైన నిజం వెలుగులోకి...

విచారణలో, ఆ మహిళ కత్తిపోట్ల వల్ల రాజేష్ కడుపు సుమారు 35 సెంటీమీటర్ల మేర ఓపెన్ అయ్యింది. గాయాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, అతని పేగులు శరీరం నుంచి బయటకు వచ్చేశాయి. పోస్ట్‌మార్టం సమయంలో గాయాలు గురించి తెలుసుకున్న వైద్యులకే కళ్లు తిరిగాయి. మృతుడి సగం కాలేయం నుజ్జు నుజ్జు అయ్యింది. కుడి మూత్రపిండం కూడా కనిపించకుండా పోయింది.

హత్య చేసిన తర్వాత ఆ మహిళ తన భర్త పేగులను ఒక సంచిలో పెట్టుకుంది. ఇంతలో, ఇంటి యజమాని రావడంతో మహిళ బాల్కనీ నుంచి దూకేసింది. తీవ్ర గాయాలు పాలైన మహిళను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.  

పోస్ట్‌మార్టంలో వెల్లడైన ఆశ్చర్యకరమైన వాస్తవాలు

ఇంటి యజమాని రింకు చెప్పిన ప్రకారం, రాజేష్ సుమారు ఒక సంవత్సరం క్రితం ఆ ఇంటిపై అంతస్తులో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. సాయంత్రం సుమారు 5 గంటలకు, అతనికి రాజేష్, విమల అరుపులు వినిపించాయి. ఆ శబ్దం విని అతను టెర్రస్‌పైకి పరుగెత్తుకెళ్లాడు. ఏదో జరుగుతోందని గ్రహించి అక్కడకు చేరుకున్నాడు. అక్కడి దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి గురయ్యాడు. రక్తపు మడుగులో రాజేష్ పడి ఉన్నాడు. అతని శరీరంపై గాయాలు ఉన్నాయి.

రింకు చెప్పిన దాని ప్రకారం, పరుగెత్తుకొని గదిలోకి వెళ్ళినప్పుడు, రాజేష్ పేగులను ఒక సంచిలో పెడుతూ విమల కనిపించింది. ఇంతలో ఇంటి యజమాని ఎదురుగా చూసింది. ఒక్కసారిగా భయానికి గురైన మహిళ పైకప్పు నుంచి దూకేసింది. ఆ కిందపడటంతో ఆమె గాయపడి, ఆసుపత్రిలో చేరింది.

ఘటనా స్థలం నుంచి మూడు కత్తులు స్వాధీనం

సమాచారం అందుకున్న తర్వాత, థర్డ్ గేట్ ఇన్‌చార్జ్ సతీష్ గౌర్, కేయూకే ఇన్‌చార్జ్ సురేంద్ర సింగ్ ఒక పోలీసు బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు పెద్దవి, చిన్నవి కలిపి మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించి, కేసు దర్యాప్తును ప్రారంభించారు.

ఇంటి యజమాని మరికొన్ని దిగ్భ్రాంతికరమైన వివరాలు వెల్లడించారు. విమల చేతబడి, భూతవైద్యం కూడా చేసేదన్నారు. ఆ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. అయితే, హత్య వెనుక అసలు కారణం ఇంకా తెలియరావడం లేదు. ఆ మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది, పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

వివాహం జరిగి చాలా ఏళ్లు అవుతున్నా పిల్లలు లేరు 

నివేదికల ప్రకారం, రాజేష్, విమలకు పెళ్లై చాలా సంవత్సరాలైంది, కానీ ఆ దంపతులకు పిల్లలు లేరు. పోలీసులు ఇప్పుడు ఆ జంట మధ్య ఉన్న రిలేషన్, వారి మధ్య ఉన్న వివాదాలు, హత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. మహిళ వాంగ్మూలం, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Frequently Asked Questions

కురుక్షేత్రలో జరిగిన ఘోర ఘటన ఏమిటి?

కురుక్షేత్రలోని పెహోవా రోడ్డులోని రాజ్ ప్యాలెస్ సమీపంలో ఒక మహిళ తన భర్త రాజేష్‌ను హత్య చేసింది. అతని శరీరాన్ని ముక్కలు చేసి పేగులను సంచిలో వేసింది.

ఈ ఘటనలో మృతుడు, నిందితులు ఎవరు?

మృతుడు ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాకు చెందిన రాజేష్ (40). నిందితురాలు అతని భార్య విమలా దేవి.

ఈ హత్య ఘటన ఎలా బయటపడింది?

ఇంటి యజమాని రింకు అరుపులు విని, గదిలోకి వెళ్ళగా రక్తపు మడుగులో రాజేష్‌ను చూశాడు. అతని పేగులను విమల సంచిలో పెడుతూ కనిపించింది.

రాజేష్ శరీరానికి ఎలాంటి గాయాలు అయ్యాయి?

రాజేష్ కడుపు 35 సెంటీమీటర్ల మేర చీలి, పేగులు బయటకు వచ్చాయి. సగం కాలేయం నుజ్జునుజ్జు అయ్యి, కుడి మూత్రపిండం కనిపించకుండా పోయింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget