![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Red Sandal Seized: కర్నూలులో భారీగా ఎర్ర చందనం స్వాధీనం... హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలిస్తుండగా పట్టివేత
కర్నూలు జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నన్నూరు టోల్ ప్లాజా వద్ద రూ.3.84 కోట్లు విలువ చేసే ఎర్ర చందనం దుంగలు పోలీసులు పట్టుకున్నారు.
![Red Sandal Seized: కర్నూలులో భారీగా ఎర్ర చందనం స్వాధీనం... హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలిస్తుండగా పట్టివేత Kurnool nannuru toll plaza nearly Rs. 4 crore worth of red sandals seized Red Sandal Seized: కర్నూలులో భారీగా ఎర్ర చందనం స్వాధీనం... హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలిస్తుండగా పట్టివేత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/23/7ad7b16827a1617ed488c2766c0843ed_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ గేటు వద్ద భారీగా ఎర్ర చందనం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి చెన్నైకి లారీలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.3.84 కోట్ల 177 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ ను కర్నూలుకు చెందిన శివ కుమార్‌గా గుర్తించారు. అతడిని విచారించగా విశ్వనాథ్ రెడ్డి అనే వ్యక్తి చెప్పిన కారణంగా దుంగలను తరలిస్తున్నట్లు డ్రైవర్ పేర్కొన్నారు. వ్యక్తికి చెందినవని తెలిపాడు. విశ్వనాథ్ రెడ్డిని గత నెలలోనే టంగుటూరు పోలీసులు అరెస్టు చేశారు. విశ్వనాథ్ రెడ్డి చెప్పిన మేరకు ఎర్ర చందనం దుంగలు తరలిస్తున్నట్లు తెలిపారు.
3.84 టన్నులు, రూ. 3.84 కోట్లు
కర్నూలు సమీపంలోని నన్నూరు టోల్ ప్లాజా వద్ద కోట్లు విలువ చేసే ఎర్రచందనం దుంగలను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ముందుగా అందిన సమాచారం ప్రకారం వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ఆదివారం సాయంత్రం గంటల సమయంలో హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న డీసీఎం వాహనంలో 177 ఎర్రచందనం దుంగలను పోలీసులు గుర్తించారు. లారీని స్వాధీనం చేసుకుని ఓర్వకల్లు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీటి బరువు 3.84 టన్నులు, రూ. 3.84 కోట్ల విలువ చేస్తాయని కర్నూలు డీఎస్పీ వెంకట్రామయ్య వెల్లడించారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మాగుంట విశ్వనాథ్‌రెడ్డి అలియాస్ ప్రసాద్‌రెడ్డి కొంతకాలం నుంచి ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.
Also Read: Hyderabad Fraud: యూపీఐ పిన్ నెంబరు ఇలా పెట్టుకుంటున్నారా? జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది!
బెయిల్ పై బయటకు వచ్చి...
శంషాబాద్ గౌడౌన్ లో ఉన్న ఎర్రచందనం దుంగలను కల్లూరు ఎస్టేట్‌కు చెందిన కంద గడ్డల సుబ్బారావు కుమారుడు శివకుమార్ స్కంద వెంచర్‌లో పనిచేస్తున్న నజీర్ అనే వ్యక్తి సహకారంతో చెన్నైకి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో ఎర్రచందనం దుంగులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. లారీ డ్రైవర్ శివకుమార్‌ను అరెస్టు చేశామని తెలిపారు. మరో వ్యక్తి నజీర్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా శివకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన శివకుమార్ మళ్లీ అక్రమాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ తెలిపారు. తనిఖీల్లో కర్నూలు రూరల్ సీఐ ఎం. శ్రీనాథ్‌రెడ్డి, కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఎం.తబ్రేజ్, ఓర్వకల్లు ఎస్‌ఐ మల్లికార్జున సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Ap Liquor Brands Raghurama : ఏపీ లిక్కర్ బ్రాండ్స్‌పై పరిశీలన.. ఎంపీ రఘురామకు కేంద్రం హామీ..!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)