Watch: రక్షా బంధన్‌కి సారా టెండుల్కర్‌కి అర్జున్ లాస్ట్ ఇయర్ గిఫ్ట్ ఇవ్వలేదట... వీడియో షేర్ చేసిన ముంబయి ఇండియన్స్
గత ఏడాది రక్షా బంధన్‌కి సారా టెండుల్కర్‌కి అర్జున్ గిఫ్ట్ ఇవ్వలేదట. ఈ విషయాన్ని స్వయంగా సారానే చెప్పింది.
గత ఏడాది రక్షా బంధన్‌కి సారా టెండుల్కర్‌కి అర్జున్ గిఫ్ట్ ఇవ్వలేదట. ఈ విషయాన్ని స్వయంగా సారానే చెప్పింది. ఆదివారం నాడు దేశ వ్యాప్తంగా ఈ ఏడాది రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. IPL - 2021 కోసం భారత్‌కు క్రికెటర్లు UAE చేరిన సంగతి తెలిసిందే. క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్... ముంబయి ఇండియన్స్ జట్టులో సభ్యుడు.
Also Read: World Athletics U20 C'ships: భారత్ ఖాతాలో మూడో పతకం.. శైలి సింగ్‌కు రజతం.. త్రుటిలో మిస్ అయిన గోల్డ్
రాఖీ పండుగ సందర్భంగా UAE నుంచి పలువురు ఆటగాళ్లు తమ సోదరీమణులతో వీడియో కాల్ మాట్లాడి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ తమ జట్టులోని ఆటగాళ్లు సోదరీమణులతో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
Separated by seas, bound by the sibling bond 💙
— Mumbai Indians (@mipaltan) August 22, 2021
Presenting heartwarming #OneFamily conversations on the occasion of #RakshaBandhan 🥰#MumbaiIndians #KhelTakaTak @MXTakaTak MI TV pic.twitter.com/NN8Du2cYB9
ఈ వీడియోలో అర్జున్ టెండుల్కర్... సారాకి ఫోన్ చేసి విషెస్ చెప్పాడు. అప్పుడు రాఖీ సందర్భంగా ఏం గిఫ్ట్ కావాలని అర్జున్... సారాని అడిగాడు. అప్పుడు సారా... నువ్వు లాస్ట్ ఇయర్ కూడా నాకు గిఫ్ట్ ఇవ్వలేదు అని అంది. అప్పుడు అర్జున్... ఐతే రెండు గిఫ్ట్‌లు ఇస్తాను బదులిచ్చాడు. అర్జున్‌తో పాటు అనుమోల్‌ప్రీత్ సింగ్, యుద్ధ్‌వీర్ సింగ్, ఆదిత్య ఠారే తదితరులు తమ తోబుట్టువులతో మాట్లాడారు.
సెప్టెంబరు 19న ipl-2021 రెండో దశ సీజన్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది సీజన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన ముంబయి ఇండియన్స్ నాలుగింట్లో విజయం సాధించింది.
Also Read: IPL 2021: సెప్టెంబరులో IPL రెండో దశ సీజన్‌కి దూరమైన ఆటగాళ్లు... ఇంతకీ ఎవరు? ఎందుకు?