World Athletics U20 C'ships: భారత్ ఖాతాలో మూడో పతకం.. శైలి సింగ్‌కు రజతం.. త్రుటిలో మిస్ అయిన గోల్డ్
ప్రపంచ జూనియర్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం భారత్ ఖాతాలో చేరింది. ఉమెన్స్ లాంగ్ జంప్ విభాగంలో భారత్ కు చెందిన శైలి సింగ్ రజత పతకం కైవసం చేసుకుంది.
ప్రపంచ జూనియర్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం భారత్ ఖాతాలో చేరింది. ఉమెన్స్ లాంగ్ జంప్ విభాగంలో భారత్‌కు చెందిన శైలి సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 0.01 మీటర్ల దూరంతో త్రుటిలో బంగారు పతాకాన్ని మిస్ చేసుకుంది. 6.59 మీటర్ల దూరం లాంగ్ జంప్ చేసి పతకాన్ని సాధించింది. స్వీడన్‌కు చెందిన మజా అస్కాగ్ 6.60 మీటర్ల దూరంతో బంగారు పతకం సాధించింది. ఉక్రెయిన్‌కు చెందిన మారియా హెరీలోవా కాంస్య పతకం దక్కించుకుంది.
Maja Åskag – double #WorldAthleticsU20 champion 🥇🥇
— World Athletics (@WorldAthletics) August 22, 2021
The Swede leaps to a personal best 6.60m to add the long jump title to her triple jump crown from Friday!
India's Shaili Singh wins 🥈 just 1cm shy of Åskag's winning mark with Ukraine's Mariia Horielova taking 🥉. pic.twitter.com/in5dd57lWh
17 ఏళ్ల శైలి.. మొదటి రెండు రౌండ్‌లను 6.34 మీటర్ల దూరంతో పూర్తి చేసింది. ఇక మూడో రౌండ్‌లో 6.59 మీటర్ల దూరం వరకు జంప్ చేసింది. అస్కాజ్ తన నాలుగో ప్రయత్నంలో 6.60 దూరం జంప్ చేయడంతో బంగారు పతకం దక్కించుకుంది. ఇక ఈరోజు జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్‌లో డోనాల్డ్ మకిమైరాజ్ నాల్గవ స్థానంలో నిలవగా.. అంకిత మహిళల 5000 మీటర్ల రన్నింగ్‌లో ఆరో స్థానంలో నిలిచింది.
Third medal for #India at the #WorldAthleticsU20
— Athletics Federation of India (@afiindia) August 22, 2021
LONG JUMPER SHAILI SINGH WINS
A SILVER MEDAL with a jump of 6.59m
European Champion Maja Askag of Sweden takes home Gold with a leap of 6.60m, a centimetre better!
Super proud of you #ShailiSingh, well done Champ! pic.twitter.com/hkAsQoiPTH
మొత్తం మూడు పతకాలు..
అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్ రెండు రజత పతకాలు గెలుచుకోగా.. ఇది మూడోవది. శనివారం జరిగిన 10 వేల మీటర్ల నడకలో భారత అథ్లెట్ అమిత్ ఖత్రి రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఇండియాకు చెందిన మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలే జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
Third medal for #India at the #WorldAthleticsU20
— SAIMedia (@Media_SAI) August 22, 2021
Long Jumper #ShailiSingh wins 🥈 for 🇮🇳 with a jump of 6.59m
She trains at SAI Bangalore and is trained by veteran long jumper @anjubobbygeorg1 and husband Robert Bobby George
Way to go champ!#Athletics pic.twitter.com/C4P5fEHUie