అన్వేషించండి

Kuppam Hotel Attack : భోజనం లేదన్నారని హోటల్ పై దాడి, వీడియో షేర్ చేసిన చంద్రబాబు

Kuppam Hotel Attack : కుప్పం బైపాస్ రోడ్డులోని ఓ డాబాపై ఓ పార్టీ కౌన్సిలర్, అతని అనుచరులు దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kuppam Hotel Attack : కుప్పం మండలం పరిధిలోని  బైపాస్ రోడ్డులో ఉన్న హర్షిత డాబాలో ఆదివారం సాయంత్రం స్థానిక కౌన్సిలర్ అనుచరులు బీభత్సం సృష్టించారు. హోటల్ వచ్చిన వ్యక్తులు భోజనం కావాలని అడిగారు. అప్పటికే హోటల్ లో భోజనం అయిపోవడంతో సదరు హోటల్ నిర్వాహకులు లేదని చెప్పడంతో మాకే భోజనం లేదని చెప్తావా అంటూ దాడికి దిగారు. ఈ దాడికి సంబంధిచిన వ్యవహారం మొత్తం సీసీటీవీలో రికార్డు అయింది. దీంతో ఈ వీడియా ఒక్కసారిగా వైరల్ గా మారింది. తమ తప్పేమి లేకుండా అన్యాయంగా మాపై దాడి చేయడమే కాకుండా డాబాలోని కుర్చీలు, టేబుళ్లు ధ్వంసం చేశారని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు చెప్తున్నారు.

దాడి ఘటనపై చంద్రబాబు ట్వీట్ 

కుప్పంలో హోటల్‌పై వైసీపీ కౌన్సిలర్ అనుచరల దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. కుప్పంలో దాడుల సంస్కృతిని వైసీపీ తీసుకురావడం దురదృష్టకరమన్నారు. హోటల్‌లో ఫర్నీచర్‌ ధ్వంసం చేసి మహిళలను బెదిరించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు ట్వీట్ చేశారు. కుప్పం బైపాస్‌ రోడ్డులోని ఓ దాబాలో వైసీపీ కౌన్సిలర్ అనుచరులు వీరంగం సృష్టించిన సీసీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్‌, మరో కౌన్సిలర్‌ కుమారుడు, వారి అనుచరులు దాబాపై దాడి చేసినట్లు నిర్వాహకులు అంటున్నారు. 

"కుప్పంలో హోటల్ పై వైసిపి కౌన్సిలర్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. కుప్పంలో ఎప్పుడూ లేని దాడుల సంస్కృతిని వైసిపి తీసుకురావడం దురదృష్టకరం. భోజనం అయిపోయిందన్న పాపానికి స్థానిక హోటల్ పై వైసిపి ప్రజా ప్రతినిధులు దాడి చెయ్యడం దారుణం. ఫర్నిచర్ ధ్వంసం చేసి, మహిళలను బెదిరించడంపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలి. హోటల్ నిర్వాహకులను చంపేస్తాం.హోటల్ తగలబెడతాం అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కఠిన చర్యలతో క్రిమినల్స్ యాక్టివిటీకి ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుంది" అని చంద్రబాబు ట్వీట్ చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Kawasaki KLX230: ఇండియాలో కవాసకీ సూపర్ బైక్ లాంచ్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఇండియాలో కవాసకీ సూపర్ బైక్ లాంచ్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Kawasaki KLX230: ఇండియాలో కవాసకీ సూపర్ బైక్ లాంచ్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఇండియాలో కవాసకీ సూపర్ బైక్ లాంచ్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget