(Source: ECI/ABP News/ABP Majha)
Kuppam Woman: మలేషియాలో కుంగిన ఫుట్ పాత్ - మ్యాన్ హోల్‌లో పడి కుప్పం మహిళ గల్లంతు, షాకింగ్ వీడియో
Malaysia: మలేషియాలో ఒక్కసారిగా ఫుట్ పాత్ కుంగి.. చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన ఓ మహిళ మ్యాన్ హోల్‌లో పడి గల్లంతైంది. అక్కడి అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
Kuppam Woman Falls In Manhole In Malaysia: మలేషియాలో (Malaysia) జరిగిన ప్రమాదంలో చిత్తూరు జిల్లా కుప్పానికి (Kuppam) చెందిన ఓ మహిళ గల్లంతైంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్పం మున్సిపాలిటీ అనిమిగానిపల్లికి చెందిన విజయలక్ష్మి(40) అనే మహిళ కొద్ది రోజుల క్రితం మలేషియా వెళ్లారు. రాజధాని కౌలాలంపూర్‌లో ఆమె పూసల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఫుట్ పాత్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా రోడ్డు కుంగింది. దీంతో ఆమె ఒక్కసారిగా మ్యాన్ హోల్‌లో పడి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న అక్కడి అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఈ విషయం తెలుసుకున్న విజయలక్ష్మి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.
మలేషియాలో ఫుట్ పాత్ కుంగి మ్యాన్ హోల్‌లో పడి గల్లంతైన తెలుగు మహిళ
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2024
మలేషియా - కౌలాలంపూర్‌లో ఓ తెలుగు మహిళ ఫుట్ పాత్ పై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుంగడంతో 10 మీటర్ల లోతెన మురికికాల్వలో పడి గల్లంతయ్యారు..
కుప్పంలోని అనిమిగానిపల్లెకు చెందిన బాధితురాలు విజయలక్ష్మి (45) తన భర్త,… pic.twitter.com/MYVy0gf8D6
సీఎం చంద్రబాబు ఆరా
కాగా, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి సాయంపై హామీ ఇచ్చారు. సీఎం సూచనలతో బాధిత కుటుంబాన్ని కలిసిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ వారికి ధైర్యం చెప్పారు.
Also Read: Crime News: తిరుపతిలో దారుణం - పాఠశాలలోనే బాలికపై అత్యాచారం, ఆలస్యంగా వెలుగులోకి