News
News
X

Konaseema News : ఉసురు తీసిన ఉపాధి, మస్కట్ లో మహిళ ఆత్మహత్య!

Konaseema News : ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన ఓ మహిళ అక్కడ పనిఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంది.

FOLLOW US: 
Share:

Konaseema News : ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన ఓ నిరుపేద మహిళ అక్కడ పని ఒత్తిడి తట్టుకోలేక... ఇంటికి వచ్చే అవకాశం లేక బలవన్మరణానికి పాల్పడింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామానికి చెందిన కోజా వెంకటలక్ష్మి( 35) గల్ఫ్ దేశం అయిన మస్కట్ లో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజోలు మండలం శివకోటి గ్రామానికి చెందిన కోజా వెంకటలక్ష్మి ఆరు నెలల క్రితం జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లింది.  అక్కడ ఒక షేక్ ఇంట్లో పనికి కుదిరిన ఆమె ఆ ఇంట్లో జనాభా ఎక్కువ కావడంతో పని చేయలేక పోతున్నానని, ఆరోగ్యం సహకరించడంలేదని, తనను  ఇండియా తీసుకెళ్లిపోవాలని భర్త నాగరాజుకు అక్కడ పరిస్థితిని వీడియోలో చూపిస్తూ కాల్ చేసింది. తన భార్యను గల్ఫ్ దేశం పంపించిన ఏజెంట్లు జిలానీ, రవిలను కలిసిన నాగరాజు తన భార్యను స్వదేశం తీసుకురావాలని ప్రాధేయపడ్డాడు.  

లైవ్ లో సూసైడ్ 

వెంకటలక్ష్మిని ఇండియాకు తీసుకురావాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని ఏజెంట్లు నాగరాజుకు  తెలిపారు. నిరుపేదలమైన తాము అంత ఇవ్వలేమని, కొద్దిగా సర్దుతామని విన్నవించినా ఏజెంట్లు పట్టించుకోలేదని వెంకటలక్ష్మి కుటుంబ సభ్యుయలు తెలిపారు. దీంతో దిక్కుతోచని వెంకటలక్ష్మి లైవ్ లో ఉరి వేసుకుని  ఆత్మహత్యకు పాల్పడింది.  తన భార్య మృతికి ఏజెంట్లు జిలానీ, రవి కారణమని మృతురాలు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.  వెంకటలక్ష్మి మృతదేహాన్ని స్వగ్రామం శివకోటి తీసుకురావడంతో విషాధ ఛాయలు అలుముకున్నాయి. రాజోలు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. 

పెళ్లి కావడంలేదని ఆత్మహత్యలు

ఏ అమ్మాయికైనా, లేదంటే అబ్బాయికైనా వారి వివాహం చేసుకునే భాగస్వాములు మంచి వారై ఉండాలని అనుకుంటారు. మంచి భర్త కావాలని, మంచి భార్య దొరకాలని కలలు కంటుంటారు. అలా మంచి లక్షణాలున్న భాగస్వామి దొరికితే జీవితం సాఫీగా సాగుతుంది. కానీ పెళ్లి చేసుకునే వయస్సు దాటిపోతూ అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయికి దొరకకపోతే వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. అయితే కేవలం పెళ్లి కావడం లేదనే బాధతో ఏకంగా సూసైడ్‌ చేసుకున్నవాళ్లు కొందరైతే.. ఏకంగా మాజీ సీఎంకే లేఖ రాసిన పెళ్లికానీ ప్రసాద్‌లు చాలానే ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలు, పెళ్లి కావడం లేదన్న మనోవ్యథతో ప్రాణాలు తీసుకుంటున్న మగవారి సంఖ్య పెరుగుతున్న విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

ఎందుకీ ఆత్మహత్యలు? 

గత ఏడాది 2021లో దేశవ్యాప్తంగా కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి శాతం మొత్తం ఆత్మహత్యల్లో 56.6 శాతం ఉన్నట్లు ఎన్సీఆర్బీ రికార్డులలో తేలింది. ఇందులో వివాహంతో ముడిపడి ఉన్న ఆత్మహత్యలు 4.8శాతం ఉన్నాయి. మరీ ముఖ్యంగా కరోనా కారణంగా చేస్తున్న ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. మరోపక్క పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చాలామంది సమాజంలో ఉన్న యువతీ యువకులు పెళ్లి సమస్య కారణంగా కెరియర్ పై సరైన అవగాహన దృష్టి పెట్టలేకపోతున్నారు. యువతరం ఎదుర్కొంటున్న సమస్యలు నిరుద్యోగం తర్వాత జీవితంలో అతి ముఖ్య ఘట్టం పెళ్లి. ఒక పక్క ఉద్యోగాలు లేక మరో పక్క పెళ్లి చేసుకునే విషయంలో కాలం గడిచిపోతూ ఉండటంతో.. పాటు చుట్టుపక్కల ఉండేవాళ్లు, బంధువులు పెట్టే ఒత్తిడితో యువతరం నలిగిపోతోంది. పెళ్లి చేసుకోవాలంటే కచ్చితంగా ఉద్యోగం ఉండాల్సిన పరిస్థితి. కుటుంబం సాఫీగా జరగాలంటే ఒక అద్భుతమైన జాబ్ ఉంటేనే అవతలివాళ్ళు కమిటీ అయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉంది.  ఇక గత ఏడాదిలో దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న స్త్రీ, పురుష నిష్పత్తిలో ఎక్కువగా అబ్బాయిలే ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యలకు కారణమవుతున్న కుటుంబ సమస్యల్లో ప్రధానంగా కనిపించేది వివాహం. వైవాహిక సంబంధ సమస్యలతో పురుషులు ప్రాణాలు తీసుకుంటున్న ధోరణి పెరుగుతోంది. అయితే నిజానికి మహిళలు మానసికంగా సున్నితంగా బలహీనంగా ఉంటారన్నది సమాజాంలో వినిపించే అభిప్రాయం. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇందుకు భిన్నంగా మానసిక మనోవేదనకు గురి అయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Published at : 05 Dec 2022 10:20 PM (IST) Tags: Woman suicide Gulf country Muscat Konaseema Work tension

సంబంధిత కథనాలు

Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య

Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య

BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు

BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు

Naba Kishore Das: ఏఎస్ఐ కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్ మృతి

Naba Kishore Das: ఏఎస్ఐ కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్ మృతి

Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం

Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం

Balochistan Bus Accident : బలూచిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు లోయలో పడి 41 మంది మృతి

Balochistan Bus Accident : బలూచిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు లోయలో పడి 41 మంది మృతి

టాప్ స్టోరీస్

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Weather Latest Update: నేడు వాయుగుండంగా అల్పపీడనం, ఏపీకి వర్ష సూచన - ఈ ప్రాంతాల్లోనే

Weather Latest Update: నేడు వాయుగుండంగా అల్పపీడనం, ఏపీకి వర్ష సూచన - ఈ ప్రాంతాల్లోనే