అన్వేషించండి

కన్న తండ్రే కామంధుడు.. ఏడాది పాటు కూతురిపై అఘాయిత్యం, కోనసీమలో దారుణం!

కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన క‌న్న తండ్రే కామాంధుడై కుమార్తెను లైంగికంగా వేధించాడు.. మాయ‌మాట‌ల‌తో లొంగ‌దీసుకుని ఆపై బెదిరిస్తూ మైన‌ర్ బాలిక‌పై ఏడాది కాలంగా త‌న లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు..

ఉప్ప‌ల‌గుప్తం: ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ క‌ర‌వ‌వుతోంది.. కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన వారే అత్యంత హేయ‌మైన చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు.. మైన‌ర్ బాలిక‌ల‌పై పెరుగుతోన్న అఘాయిత్యాల్లో ఎక్కువ‌గా అయిన‌వారే ఉండ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశంగా మారింది.. తాజాగా అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలో జరిగిన ఓ సంఘ‌ట‌న స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా చేసింది.. 

కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన వాడే కామాంధుడై..

కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన క‌న్న తండ్రే కామాంధుడై కుమార్తెను లైంగికంగా వేధించాడు.. మాయ‌మాట‌ల‌తో లొంగ‌దీసుకుని ఆపై బెదిరిస్తూ మైన‌ర్ బాలిక‌పై ఏడాది నుంచి త‌న లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు.. ఈ దారుణ ఘ‌ట‌న అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా ఉప్ప‌ల‌గుప్తం మండ‌లం కూన‌వ‌రంలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.. ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డ తండ్రి అయితాబ‌త్తుల బాల‌య్య పై పోక్సో కేసు న‌మోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలిక సోద‌రుడు ఈ అమాన‌వీయ చర్యను గమనించడంతో విషయం బహిర్గతం అయింది. కన్న తండ్రే లైంగిక వేధింపులకు పాల్ప‌డుతూ ప‌శువులా మారి వేధిస్తుండ‌గా బ‌య‌ట‌కు చెబితే ఏమవుతోందోన‌న్న భ‌యంతో ఆ బాలిక బ‌య‌ట పెట్ట‌కుండా ఉండిపోయింది.. 

త‌ల్లి స్థానికంగా లేక‌పోవ‌డంతో బ‌రితెగించి..

బాధిత బాలిక త‌ల్లి ఉపాధి నిమిత్తం ఏడాది క్రింతం కువైట్‌కు వెళ్లింది. క‌ష్టం ద్వారా వచ్చిన డ‌బ్బుతో తాగి తంద‌నాలు ఆడే భ‌ర్త‌తో పిల్ల‌ల్ని ఎలా పెంచుకోవాలో తెలియ‌ని స్థితిలో కువైట్ వెళ్లి కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాల‌న‌కున్న త‌ల్లికి ఆశ‌ల‌న్నీ అడియాశ‌లే అయ్యాయి. త‌ల్లి ఏడాదిగా కువైట్‌లో ఉంటుండ‌గా తండ్రి బాల‌య్య వ‌ద్ద‌నే కుమారుడు, ప‌దిహేనేళ్ల‌ కుమార్తె క‌లిసి ఉంటున్నారు. భార్య లేక‌పోవ‌డంతో ఇక మ‌రింత మ‌ద్యానికి బానిసైన బాల‌య్య ఎదుగుతోన్న కుమార్తెపై క‌న్నేశాడు. ఏడాది కాలంగా బాలిక‌ను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు.

ఇటీవ‌ల ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన బాలిక‌ సోద‌రుడు తండ్రి పాల్ప‌డుతున్న దుర్మార్గ‌పు చ‌ర్య‌ను స‌మీప‌ బంధువుల‌కు తెల‌ప‌డంతో ఈ విష‌యం బ‌ట్ట‌బ‌య‌ల‌య్యింది.. విస్తుపోయిన బంధువులు, స‌మీప‌స్తులు వెంట‌నే ఈ విష‌యాన్ని గ్రామ మ‌హిళ పోలీసుకు సమాచారం అందివ్వ‌డంతో ఆమె వ‌చ్చి బాధిత బాలిక‌ను తొలుత‌ విచారించింది. దీంతో అస‌లు విష‌యం బ‌ట్ట‌బ‌య‌ల‌ైంది. త‌న‌పై క‌న్న తండ్రి చేస్తున్న అఘాయిత్యాన్ని మ‌హిళా పోలీస్‌కు వివ‌రించిన ఆ బాలిక బ‌య‌ట‌కు చెబితే చంపేస్థాన‌ని బెదిరించాడ‌ని వాపోయింది. దీంతో ఉన్న‌తాధికారుల‌కు మ‌హిళా పోలీసుల తెల‌ప‌డంతో పోలీసులు రంగ‌ ప్ర‌వేశం చేశారు. 

నిందితుడిపై ఫోక్సో కేసు న‌మోదు..

తండ్రి చేస్తున్న అమాన‌వీయ చ‌ర్య‌ను గ‌ల్ఫ్‌లో ఉంటోన్న త‌ల్లికి తెలిపాడు కుమారుడు. దీంతో  కుటుంబికుల స‌హ‌కారంతో బాధితురాలి సోద‌రుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే శ‌నివారం అమ‌లాపురం టీఎస్‌కే ప్ర‌సాద్‌, రూర‌ల్ సీఐ ప్ర‌శాంత్ కుమార్, ఎస్సై సీహెచ్ రాజేష్‌ కూన‌వ‌రం వ‌చ్చి విచార‌ణ చేప‌ట్టారు.  బాలిక‌ను విచారించిన పోలీసులు నిందితుడైన తండ్రి బాల‌య్య‌పై పోక్సో కేసు న‌మోదు చేసిన‌ట్లు ఉప్ప‌ల‌గుప్తం ఎస్సై రాజేష్‌కుమార్ తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Vijayawada Digital Arrest: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Railway Mobile Charging Ban: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
Embed widget