News
News
X

Khammam: భర్త ఫ్రెండుతో భార్య శారీరక సంబంధం, పరువు పోతుందని పాడు పని!

భర్తకు ఈ విషయం తెలిసిపోయిందని, అతని ద్వారా ఇంకొంత మందికి ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆమె హత్యకు కుట్ర పన్నింది.

FOLLOW US: 

వివాహేతర సంబంధాల మోజు అయిన వారిని కూడా పొట్టన పెట్టుకుంటున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపించింది. పరాయి వ్యక్తితో తాను నడుపుతున్న వివాహేతర సంబంధం బయటివారికి ఎక్కడ తెలుస్తుందో అనే భయంతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదని పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.

పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామానికి చెందిన ఓ యువతికి 2010లో ఆమె సొంత మేనమామతో వివాహం జరిగింది. వీరిద్దరికీ మనస్పర్థలు రావడంతో 2015లో విడాకులు తీసుకొని, విడిగా ఉంటున్నారు. రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ ఆమెకు ఖమ్మం రూరల్‌ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన యువకుడు సాయిచరణ్ అనే 28 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఖమ్మంలో కాపురం పెట్టారు. ఈ యువకుడు కోడి పెంట, చికెన్ వ్యర్థాలను తరలించే ఓ లారీకి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇలా ఉండగా, ఇతనికి ఖమ్మంకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ కరుణాకర్ తో పరిచయం ఏర్పడి, అది స్నేహంగా మారింది. ఆ కరుణాకర్ తరచూ యువకుడి ఇంటికి వెళుతూ ఉండేవాడు. అలా అతడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య తన స్నేహితుడైన ఆటో డ్రైవర్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని చూసిన ఆ యువకుడు సాయి, ఆమెను కొన్నిసార్లు హెచ్చరించాడు.

పరువుపోతుందని కుట్రకు ప్లాన్
అయితే, భర్తకు ఈ విషయం తెలిసిపోయిందని, అతని ద్వారా ఇంకొంత మందికి ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆమె హత్యకు కుట్ర పన్నింది. అలా ఈ నెల 1న యువకుడు, ఆటో డ్రైవర్‌ కలిసి వాహనంలో కోళ్ల పెంట, చికెన్ వ్యర్థాలను తీసుకొని ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాకు బయలుదేరాడు. మార్గం మధ్యలో ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌ వద్ద మద్యం తీసుకుని ప్రకాశ్‌ నగర్‌ ప్రాంతంలో ఎవ్వరులేని చోటుకు వెళ్లి ఇద్దరూ మద్యం తాగారు. ఈ క్రమంలో గొడవ పడ్డారు. కోపంతో ఊగిపోయిన వివాహిత ప్రియుడు, ఆ యువకుడు సాయిని పారతో గట్టిగా కొట్టాడు. మృతదేహాన్ని వాహనంలోని కోళ్ల పెంట మధ్య దాచేశాడు. 

తర్వాత నేరుగా వాహనంతో ఎన్టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదుప గ్రామంలోని ఓ చేపల చెరువులో మృత దేహాన్ని పడేశారు. ఆ చేపల చెరువు యజమానికి ఈ నెల 4న చెరువులో మృతదేహం తేలుతూ కనిపించింది. గుర్తు పట్టిన ఆ యజమాని, మృతుడి స్నేహితుడైన నిందితుడికే ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. అయితే విషయం బయటపడితే చెరువులోని చేపలను ఎవ్వరూ కొనరని, అందుకే గప్‌చుప్ గా ఉండాలని యజమానికి చెప్పాడు. దీంతో ఆ యజమాని, మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరువు మధ్యలోకి తీసుకెళ్లి ముళ్ల కంప చెట్టు వద్ద వదిలేశాడు. అది వరదకు కొట్టుకుపోయింది. 

ఈ హత్యోదంతం గురించి తెలిసినా కూడా ఆ వివాహిత ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదంటూ ఈ నెల 11న ఖమ్మం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అనుమానంతో పోలీసులు ఆమెను, ఆమె ప్రియుడిని ప్రశ్నించడంతో అసలు నిజం బయటికి వచ్చింది. ఈ ఘటనలో ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహం కోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్పారు.

ఆగస్టు 1న హత్య
ఈనెల మొదట్లోనే హత్య జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయినా దాదాపు 10 రోజుల పాటు ఎక్కడా బయటకు పొక్కలేదు. సాయి ఎక్కడికి వెళ్లాడని, అతని బంధువులు, యజమాని భార్యను ప్రశ్నించారు. తనకు తెలీదని చెప్తూ వచ్చిన ఆమె తర్వాత అనుమానం రాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయి ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా విచారణ చేయగా, ఫ్రెండ్ కరుణాకర్ తో ఎక్కువ సార్లు మాట్లాడినట్లుగా గుర్తించారు. ఆ వివరాల ఆధారంగా శవం కోసం ఖమ్మం పోలీసులు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోకి వెళ్లి గాలించారు. ఇప్పటికి హత్య జరిగి 25 రోజులు అవుతున్నా శవం దొరక్కపోవడంతో హతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Published at : 25 Aug 2022 10:40 AM (IST) Tags: Wife murders husband khammam crime news Khammam News Extra Marital Affairs

సంబంధిత కథనాలు

Nizamabad News : మూడు నెలలైనా దొరకని బ్యాంకు దొంగల జాడ, 8 కేజీల బంగారం తిరిగివ్వాలని బాధితులు ధర్నా

Nizamabad News : మూడు నెలలైనా దొరకని బ్యాంకు దొంగల జాడ, 8 కేజీల బంగారం తిరిగివ్వాలని బాధితులు ధర్నా

Chandrababu Tweet : స్కూల్ పిల్లల వరకూ గంజాయి వచ్చేసింది, ఇది క్షమించరాని నేరం- చంద్రబాబు

Chandrababu Tweet : స్కూల్ పిల్లల వరకూ గంజాయి వచ్చేసింది, ఇది క్షమించరాని నేరం- చంద్రబాబు

Vizag Crime News : 70 ఏళ్లు దాటిన వృద్ధుడ్ని ఇలా కూడా చంపేస్తారా ? విశాఖలో ఇక రోడ్డెక్కితే గ్యారంటీ ఉండదు !

Vizag Crime News : 70 ఏళ్లు దాటిన వృద్ధుడ్ని ఇలా కూడా చంపేస్తారా ?  విశాఖలో ఇక రోడ్డెక్కితే గ్యారంటీ ఉండదు !

Palnadu District News: పల్నాడులో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం, కారులోనే వదిలి నిందితులు పరార్

Palnadu District News: పల్నాడులో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం, కారులోనే వదిలి నిందితులు పరార్

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

టాప్ స్టోరీస్

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

Central Information Commission: భర్త జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుంది, ఆ చట్టంతో లెక్కలు తేల్చేయచ్చు!

Central Information Commission: భర్త జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుంది, ఆ చట్టంతో లెక్కలు తేల్చేయచ్చు!