అన్వేషించండి

Khammam: పది రోజుల్లో పెళ్లి, అయినా యువకుడి వివాహేతర సంబంధం! చివరికి హత్య

వివాహేతర సంబందం నేపథ్యంలో యువకుడిని హత్య చేసిన సంఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి

Khammam Crime News: వివాహేతర సంబంధం ఓ యువకుడిని బలిగొంది. పది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చివరికి అదే అతని ప్రాణాలను బలిగొంది. భార్య ఆ యువకుడితో అక్రమ సంబంధం ఏర్పర్చుకోవడంతో జీర్ణించుకోలేని భర్త ఆ ఇద్దరిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో యువకుడు మృతి చెందాడు. వివాహేతర సంబందం నేపథ్యంలో యువకుడిని హత్య చేసిన సంఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం అల్లీపురం గ్రామానికి చెందిన సంపంగి వీరబాబు, వైరా మండలానికి చెందిన మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి బాబు, పాప ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో మహిళ ఖమ్మం నగరంలోని గోపాలపురం సమీపంలో ఓ ఇల్లు అద్దె తీసుకుని నివసిస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్‌ సోర్సింగ్‌పై పనిచేస్తున్న అల్లిపురానికి చెందిన నల్లగట్ట నవీన్‌తో వివాహేతర సంబందం ఏర్పడింది. ఈ విషయం భర్త వీరబాబుకు తెలియడంతో నవీన్, వీరబాబుల మద్య గొడవలు జరిగాయి. ఈ విషయంపై ఇరువురు పోలీస్‌ స్టేషన్‌లో గతంలో కేసులు సైతం పెట్టుకున్నారు. గొడవలు జరిగినప్పటికీ నవీన్‌ అక్రమ సంబందం కొనసాగిస్తుండటంతో వీరబాబు తట్టుకోలేకపోయాడు. 

మరో పదిరోజుల్లో పెళ్లి..
అయితే, ఇటీవల నవీన్‌కు మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. మే 9న పెళ్లి చేసేందుకు ముహుర్తాలు పెట్టుకున్నారు. కాగా సదరు మహిళ ఇంటికి నవీన్‌ రాత్రి వెళ్లాడు. వీరిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న వీరబాబు అక్కడికి వెళ్లాడు. నవీన్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళకు సైతం గాయాలయ్యాయి. ఈ సంఘటనలో నవీన్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆటోలో ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించడంతో అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్‌ మృతి చెందాడు. కాగా పెళ్లి కార్డు ఇచ్చేందుకు తన కుమారుడు మహిళ ఇంటికి వెళ్లగా వీరబాబు దాడి చేసి హత్యకు పాల్పడ్డాడని నవీన్‌ తండ్రి శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన విషయం తెలుసుకున్న అర్బన్‌ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Exit trafficking case: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
Cyberabad Gandipet land scam 2026: గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Coimbatore petrol bomb attack: ఇలా ఉన్నారేంట్రా? ప్రేమను నిరాకరించిందని ఇంటిపై పెట్రోల్ బాంబులేశాడు !
ఇలా ఉన్నారేంట్రా? ప్రేమను నిరాకరించిందని ఇంటిపై పెట్రోల్ బాంబులేశాడు !

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
Tripti Dimri Photos : స్పిరిట్ బ్యూటీ క్యూట్ లుక్ - నేచర్ విత్ గ్లామరస్ వైబ్... షూటింగ్ అప్డేట్ ఏంటంటే?
స్పిరిట్ బ్యూటీ క్యూట్ లుక్ - నేచర్ విత్ గ్లామరస్ వైబ్... షూటింగ్ అప్డేట్ ఏంటంటే?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
DK Shivakumar Cars: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
Why Clouds Float: లక్షల కిలోల బరువు ఉండే మేఘాలు ఆకాశంలో ఎలా తేలుతాయి? వెనుక ఉన్న సైన్స్ ఇదే! 
100 ఏనుగుల బరువు, అయినా కింద పడవు! మేఘాల వెనుక ఉన్న సైన్స్ సీక్రెట్‌ మీకు తెలుసా? 
Embed widget