Spa Center Murder: స్పా సెంటర్‌లో పని చేస్తున్న భార్యను నరికేన భర్త - అనుమానంతోనే?
Spa Center Murder: హైదరాబాద్ వాడిగూడలోని ఒక స్పా సెంటర్‌లో పనిచేస్తున్న బ్యూటీషియన్‌ను ఆమె భర్తే అత్యంత కిరాతకంగా హతమార్చాడు. తర్వాత నింపాదిగా వెళ్లిపోయాడు.

Husband Kills Wife: హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కవాడిగూడ ప్రాంతంలో మంగళవారం పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. బహదూర్ పూరా పరిధిలోని కిషన్ బాగ్ నివాసి అయిన బంగి దేబోరా , కవాడిగూడ రత్నదీప్ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో ఉన్న ఒక స్పా సెంటర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఉదయం సమయంలో దేబోరాకు తన భర్తతో మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. గొడవ తర్వాత ఆమె ఎప్పటిలాగే తన విధుల కోసం స్పా సెంటర్‌కు వెళ్లిపోయింది. కానీ, క్షణికావేశంలో ఊగిపోయిన భర్త, అంతటితో శాంతించకుండా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.
భార్య వెనకాలే స్పా సెంటర్‌కు చేరుకున్న భర్త, తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగాడు. స్పా సెంటర్ లోపలే సిబ్బంది , కస్టమర్లు చూస్తుండగానే, ఆమెను విచక్షణ రహితంగా పొడిచి కిరాతకంగా చంపేశాడు. తీవ్ర గాయాలు కావడంతో దేబోరా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నిందితుడు దాడి చేసిన తీరు చూసి అక్కడ ఉన్నవారు భయాందోళనతో పరుగులు తీశారు. హత్య అనంతరం నిందితుడు రక్తపు మరకలతోనే అక్కడి నుంచి పరారయ్యాడు.
హత్య జరిగిన కొద్దిసేపటికే నిందితుడు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తాను తన భర్తను చంపినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక విచారణ ప్రకారం, వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గృహ కలహాలు నడుస్తున్నాయని, ఆ గొడవలే ఈ హత్యకు దారితీశాయని పోలీసులు భావిస్తున్నారు. పట్టపగలు, రద్దీగా ఉండే కవాడిగూడ వంటి ప్రాంతంలో ఒక మహిళను పని ప్రదేశంలోనే చంపేయడం పట్ల స్థానిక మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని విచారిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















