News
News
X

Karimnagar: హత్య చేసి గుట్టుగా అంత్యక్రియలకు, నమ్మేసిన జనం - ఆ తప్పిదంతో పట్టేసిన పోలీసులు

పోలీసులు పకడ్బందీగా విచారణ జరపడంతో నిందితులను అరెస్టు అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను నస్పూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో DCP అఖిల్ మహాజన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

FOLLOW US: 

వారంతా జట్టుగా కలిసి ఓ హత్య చేశారు.. ఆ హత్య ఎవరు చేశారో గుర్తించకుండా తిరిగి మృతుడి అంత్యక్రియలకు వచ్చి మరీ అందరినీ నమ్మించాలని ప్లాన్ వేశారు. అది దొంగల పని అన్నట్టుగా ఆ ఇంట్లో దొరికిన బంగారం డబ్బులను సైతం ఎత్తుకెళ్లారు. సాక్ష్యాలను మాయం చేశారు. కానీ పోలీసులు పకడ్బందీగా విచారణ జరపడంతో నిందితులను అరెస్టు అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను CC నస్పూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో DCP అఖిల్ మహాజన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

అసలేం జరిగింది?
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం జై గిరి గ్రామానికి చెందిన లింగాల రాజుకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు మార్చి 31, 2019 తేదీన సీసీ నస్పూర్ కు చెందిన పిడిశెట్టి శ్రీధర్ కు ఇచ్చి వివాహం చేశారు. కొద్ది రోజులకు ఒక కొడుకు పుట్టిన తరువాత తన బిడ్డను అల్లుడు కాపురానికి తీసుకెళ్లడం లేదని రాజు మనసులో పెట్టుకున్నాడు. ఈ లోపల అల్లుడు కూడా తన భార్య నుండి విడాకులు కావాలంటూ హనుమకొండ కోర్టులో కేసు వేశాడు. ఎన్నిసార్లు పంచాయితీలకు వెళ్లినా అతని తీరు మారలేదు. దీంతో ఈ విషయంలో పూర్తిగా తన అల్లుడి తల్లిదండ్రుల వ్యవహారం తెరవెనుక ఉండి నడిపిస్తున్నారని అనుమానించిన రాజు వారిని చంపితే గాని అల్లుడు దారికి రాడని హత్యకు కుట్ర పన్నాడు.

దీనికి బయటి వారి కంటే కొడుకు శ్రీకాంత్ పెద్ద కూతురు సాయి తేజ సహకారం అందించాలని కోరారు దీంతో వీరంతా కలిసి ఆగస్టు 8న మధ్యాహ్నం సమయంలో అల్లుడైన శ్రీధర్ ఇంటికి వెళ్లారు. అక్కడ శ్రీలత తండ్రి మొగిలి ఒంటరిగా కనిపించడంతో ముగ్గురు కలిసి దాడికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో చంపి తీరాలని రాజు, మొగిలి గొంతు బిగించగా శ్రీకాంత్ అక్కడే ఉన్నా దిండుతో అదిమిపట్టి హత్య చేశారు. దీనికి కోడలైన తేజశ్రీ కూడా పూర్తిగా సహకరించింది. అతని వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్లను కూడా తన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుంది. ఇదంతా దొంగల పని లాగా కనబడాలని వారి ఇంట్లో ఉన్న బీరువా తెరిచి అందులో నుండి విలువైన బంగారు నగలను దొంగిలించింది.

అంతేకాకుండా, మృతుడి జేబులో ఉన్న డబ్బులను సైతం తీసుకున్నారు. తిరిగి అక్కడి నుండి ఆటోలో మంచిర్యాల రైల్వే స్టేషన్ కి వెళ్లి ముగ్గురూ కలిసి హన్మకొండలోని తమ ఇంటికి వెళ్ళిపోయారు. మధ్యలో రైలు గోదావరి నది దాటుతుండగా తేజస్వి రెండు సెల్ ఫోన్లను నదిలోకి విసిరేసింది. మరోవైపు ఎవరు చంపారో తెలియని పరిస్థితుల్లో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక చనిపోయిన విషయం ఇతరుల ద్వారా తెలుసుకున్నట్టు నటించిన రాజు గుండు చేసుకొని ఎవరు గుర్తు పట్టరని భావించాడు. 

అందరూ కలిసి ఏమీ జరగనట్టుగానే అంత్యక్రియలకు సైతం హాజరయ్యారు. అయితే, ఆ ప్రాంతంలో హత్య జరిగిన సమయంలో ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్స్.. అప్పటికే వీరిపై ఉన్న కారణంగా లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వీరు ముగ్గురు హత్య చేశామని ఒప్పుకున్నారు. ఈ కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని డీసీపీ అభినందించారు.

Published at : 11 Aug 2022 10:05 AM (IST) Tags: karimnagar ramagundam news Karimnagar Crime News divorce news

సంబంధిత కథనాలు

చైన్‌ లాగుతూ దొరికిన కానిస్టేబుల్- స్థానికులు బాదుడే బాదుడు!

చైన్‌ లాగుతూ దొరికిన కానిస్టేబుల్- స్థానికులు బాదుడే బాదుడు!

గురువుగారూ అంటూ గుండెల్లో గునపం దింపారు- స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల కోసం కిల్లర్ ప్లాన్

గురువుగారూ అంటూ గుండెల్లో గునపం దింపారు- స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల కోసం కిల్లర్ ప్లాన్

పుకార్లు నమ్మొద్దు -మతిస్తిమితం లేకే విగ్రహాల విధ్వంసం: హైదరాబాద్‌ పోలీసులు

పుకార్లు నమ్మొద్దు -మతిస్తిమితం లేకే విగ్రహాల విధ్వంసం: హైదరాబాద్‌ పోలీసులు

అడవిలో చెట్టుకు గర్భిణి మృతదేహం-నెల్లూరులో భయం భయం- పోలీసుల్లో కొత్త టెన్షన్

అడవిలో చెట్టుకు గర్భిణి మృతదేహం-నెల్లూరులో భయం భయం- పోలీసుల్లో కొత్త టెన్షన్

Nayeem case: నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న ఇన్నాళ్లూ అక్కడే తలదాచుకున్నాడు

Nayeem case: నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న ఇన్నాళ్లూ అక్కడే తలదాచుకున్నాడు

టాప్ స్టోరీస్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..! | ABP Desam

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..!  | ABP Desam