By: Ram Manohar | Updated at : 05 Jan 2023 10:50 AM (IST)
కంజావాలా కేసులో సీసీటీవీ ఫుటేజ్‌పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Kanjhawala Delhi Case:
ఎందుకు పరారయ్యారు..?
ఢిల్లీలోని కంజావాలా కేసు మరో మలుపు తిరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే...ఇంకా కొన్ని విషయాల్లో స్పష్టత రావడం లేదు. అందుకే...పోలీసులు ఆ నిందితులకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలని భావిస్తున్నారు. యాక్సిడెంట్ అయిన వెంటనే అక్కడి నుంచి ఎందుకు పరారయ్యారు..? ఇది కావాలనే చేశారా..? ఇనే నిజా నిజాలు బయటకు రావాలంటే..ఈ టెస్ట్ తప్పదని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే...యాక్సిడెంట్ చేశాక కూడా అసలేమీ జరగనట్టుగా తిరిగారు నిందితులు. అంతే కాదు. కార్ ఓనర్‌కు ఆ కార్‌ని తిరిగి ఇవ్వలేదు కూడా. "అంత రాత్రి పూట నిద్ర లేపి కార్ ఇవ్వడం ఎందుకని ఆగిపోయాం" అని నిందితులు విచారణలో చెప్పినప్పటికీ పోలీసుల అనుమానం తీరలేదు.
టైమ్ మిస్‌మ్యాచ్..
ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా చూస్తే...అంజలి (మృతురాలు) ముందువైపు ఎడమ చక్రంలో ఇరుక్కుపోయింది. ఆమె రక్తపు మరకలు కూడా ఆ వీల్‌కే ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కార్ కింద భాగంలోనూ రక్తపు మరకలున్నట్టు ఫోరెన్సిక్ రిపోర్ట్ వెల్లడించింది. అయితే... అంజలికి,ఆమె బాయ్‌ఫ్రెండ్‌కి ఈ యాక్సిడెంట్‌కు ముందు ఓ హోటల్‌లో వాగ్వాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తెలుసుకున్నారు పోలీసులు. అంజలి ఫ్రెండ్ నిధి కూడా ఈ విషయం చెప్పింది. పైగా...వాళ్లిద్దరి మధ్య జరిగిన ఘర్షణలోనే అంజలి ఫోన్ కింద పడి పగిలి పోయిందని కూడా వివరించింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే...సీసీటీవీ ఫుటేజ్ మిస్ మ్యాచ్ అవుతోంది. నిధి ఇంటి వద్ద సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ ప్రకారం చూస్తే...ఆమె తన ఇంటికి తిరిగి వచ్చిన టైమ్ 1.36 AM. కానీ...పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే...ఆ సీసీటీవీ DVR 45-50 నిముషాలు లేట్‌గా నడుస్తోందని. ఇక నిధి, అంజలి హోటల్ నుంచి బయటకు వచ్చిన టైమ్‌ని సీసీటీవీలో చూస్తే 1.32AM. కానీ...ఇక్కడ కూడా CCTV 15 నిముషాలు ఆలస్యంగా నడుస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. ఫలితంగా..ఈ "టైమింగ్స్" మిస్‌మ్యాచ్ అవుతున్నాయి.
దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
DCW chief @SwatiJaiHind ‘s byte on Anjali’s friend !! pic.twitter.com/0XA42DTOnG
— Vandana Singh (@VandanaSsingh) January 4, 2023
ఎవరు వాళ్లు..?
ఇక పోలీసులు చెప్పిన మరో విషయం ఏంటంటే...కార్‌లో ఉన్న 5గురితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరి కొందరిని కూడా అదుపులోకి తీసుకున్నామని. కానీ...వారెవరు అన్న వివరాలు వెల్లడించలేదు. వాళ్లెవరు..? ఈ కేసుతో వాళ్లకున్న సంబంధం ఏంటి..? వాళ్లు నిధికి తెలిసిన వాళ్లా..? లేదంటే అంజలికి పరిచయస్థులా..? ఇలా ఎన్నో సందేహాలు కేసుని సంక్లిష్టం చేస్తున్నాయి.
Also Read: Delhi Girl Attacked: బ్రేకప్ చెప్పినందుకు రెచ్చిపోయిన యువకుడు, యువతిపై కత్తితో దాడి
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్
Adilabad Cheddi Gang : ఆదిలాబాద్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం, రాత్రిపూట కర్రలతో గ్రామాల్లో గస్తీ
Hyderabad News: హైదరాబాద్‌లో ‘అత్తిలి సత్తి’ - విక్రమార్కుడు సీన్ రిపీట్!
Odisha Health Minister Injured: ఆరోగ్యశాఖ మంత్రిపై కాల్పులు - తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స
Hyderabad Crime News: పెళ్లై నలుగురు పిల్లలు, తొమ్మిదేళ్లు చిన్నోడైన వ్యక్తితో సహజీవనం - ఇంతలో ఇద్దరూ మృతి!
Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !
Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!