By: Ram Manohar | Updated at : 07 Jan 2023 04:10 PM (IST)
కంజావాలా కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Kanjhawala Accident:
2020లో ఆగ్రాలో అరెస్ట్..
కంజావాలా కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అంజలి సింగ్ ఫ్రెండ్ నిధి గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఈ యువతి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్టు పోలీసులు వెల్లడించారు. 2020 డిసెంబర్‌లో Narcotic Drugs and Psychotropic Substances Act కింద నిధిని ఆగ్రాలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయట ఉన్నట్టు ANI వార్తా సంస్థ తెలిపింది. తెలంగాణ నుంచి ఆగ్రాకు గంజాయి తీసుకొ స్తుండగా ఆగ్రా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీ చేసి అరెస్ట్ చేశారు. అదే కేసులో సమీర్, రవి అనే యువకులనూ అరెస్ట్ చేశారు పోలీసులు. నిధి నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2020 డిసెంబర్ 15న ఆమెకు బెయిల్ వచ్చినట్టు రిపోర్ట్‌లు చెబుతు న్నాయి. అయితే...కంజావాలా కేసులో భాగంగా ఆమెను విచారిస్తున్న సమయంలో ఈ పాత కేసు బయటకు వచ్చింది. ఇప్పటికే ఈమెను అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు స్పందించారు. విచారణకు మాత్రమే తనను పిలిచనట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే నిధి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కొత్త ఫుటేజ్‌లు..
అయితే..కంజావాలా కేసులో మరో రెండు సీసీటీవీ ఫుటేజ్‌లు కొత్త అనుమానాలకు తెర తీశాయి. అంజలి, నిధితో పాటు స్కూటీపై ఓ యువకుడు కూడా ఉన్న విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. అంజలి, నిధితో పాటు ఉన్న ఆ వ్యక్తి ఎవరు అన్న కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. రెండు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా విచారిస్తున్నారు. వీటిలో మొదటి ఫుటేజ్ 7.7 నిముషాల నిడివి ఉంది. ఇది డిసెంబర్ 31 అర్ధరాత్రి వీడియో. అందులో స్కూటీపై అంజలి నిధి ఉన్నారు. ఓ యువకుడు స్కూటీ నడుపుతున్నాడు. మధ్యలో అంజలి కూర్చోగా... చివర నిధి కూర్చుంది. ఓ వీధి వద్ద స్కూటీని ఆపారు. వెంటనే నిధి కిందకు దిగి అంజలికి ఏదో ఇచ్చింది. తరవాత లోపలకు వెళ్లి పోయింది. అంజలి, ఆ యువకుడు మాత్రం అక్కడే ఉన్నారు. ఉన్నట్టుండి అంజలి అదే వీధిలోకి తొందరగా వెళ్లిపోయింది. ఆ తరవాత యువకుడు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంజలి ఇంటి వద్ద ఉన్న కెమెరాలోనే ఇదంతా రికార్డ్ అయిందని పోలీసులు తెలిపారు.
మూడు నిముషాల్లో..
ఓ మూడు నిముషాల తరవాత అంజలి బయటకు వచ్చింది. ఆ తరవాత ఆమె వెనక నిధి వచ్చింది. అప్పటికే ఓ చోట స్కూటీ పార్క్ చేసి ఉంది. మళ్లీ యువకుడు కనిపించ లేదు. అంజలి స్కూటీ నడుపుతుండగా...నిధి వెనకాల కూర్చుంది. మూడు నిముషాల తరవాత ఇదే వీధిలో అంజలి మృతదేహాన్ని కింద పడేసి వెళ్లినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మూడే మూడు నిముషాల్లోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. అసలు ఆ యువకుడు ఎవరు..? అని ప్రశ్న తెరపైకి వచ్చింది. అయితే...ఆ వ్యక్తి అంజలి ఫ్రెండ్ నవీన్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ యువకుడిని పోలీసులి విచారించారనీ సమాచారం. కానీ...ఆ మూడు నిముషాల్లోనే ఏం జరిగి ఉంటుందన్నది తేలాల్సి ఉంది.
Also Read: Joshimath Sinking: ఉన్నట్టుండి బీటలు వారిన ఇళ్లు, రోడ్లు - ఉత్తరాఖండ్‌లో టెన్షన్
Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Hyderabad Crime: అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్, గుడి నుంచి ఫాలో అయ్యి చివరి నిమిషంలో ట్విస్ట్
Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపూనకు జీవిత ఖైదు విధించిన గుజరాత్ కోర్ట్
Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి