అన్వేషించండి

Hyderabad blackmail gang: జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ - ఇన్‌స్టా కీచకుల గుట్టురట్టు.. అసలు సూత్రధారి అర్జున్ అరెస్ట్!

Rich Kids Trap Case: జూబ్లీహిల్స్ లో సంచలనం సృష్టించిన రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మాస్టర్ మైండ్ ను అరెస్టు చేశారు. వీరు ఇప్పటికే బ్లాక్ మెయిలింగ్ తో కోట్లు వసూలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు.

Jubilee Hills Rich Kids Trap case Mastermind Arrest: హైదరాబాద్‌లో అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో కలకలం రేపిన  రిచ్ కిడ్స్ ట్రాప్  ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సంపన్న కుటుంబాలకు చెందిన యువతులను, మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న కింగ్‌పిన్  అర్జున్ అలియాస్ ఆజాద్ , అతని సోదరుడు రాజీవ్, తల్లి, మామతో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖరీదైన కార్లు, లగ్జరీ లైఫ్ స్టైల్‌ను ఎరగా చూపి ఈ ముఠా సాగిస్తున్న అరాచకాలు విచారణలో వెలుగు చూసి విస్తుగొలుపుతున్నాయి.

 ఖరీదైన కార్లు.. పబ్బులే ఎర! 

 అర్జున్, ఇన్‌స్టాగ్రామ్‌లో తాను కూడా ఒక  కోటీశ్వరుడి లా ఫోజులు కొట్టేవాడు. ఖరీదైన బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్ల ఫోటోలు, హై-ప్రొఫైల్ పబ్బుల్లో పార్టీల వీడియోలను పోస్ట్ చేస్తూ యువతులను ఆకర్షించేవాడు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే తల్లిదండ్రుల పిల్లలను, ఒంటరిగా ఉండే సంపన్న యువతులను టార్గెట్ చేసేవాడు. ప్రేమ పేరుతో వలవేసి, వారిని నమ్మించి విలాసవంతమైన ప్రదేశాలకు తీసుకెళ్లి, అతి సాన్నిహిత్యంగా ఉంటూ ఆ దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసేవాడు.

 బ్లాక్‌మెయిల్ నెట్‌వర్క్.. ఇంటి దొంగల సాయం! 

ఈ ముఠా కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, బాధితుల ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు, వాచ్‌మెన్‌లతో కూడా స్నేహం చేసేది. వారి ద్వారా ఆ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, పిల్లల కదలికలను సేకరించేది. ఒక పారిశ్రామికవేత్త కుమార్తెను ట్రాప్ చేసిన అర్జున్, ఆమె డ్రైవర్ ఫోన్ ద్వారానే సంభాషణలు సాగించి, ఆ తర్వాత రికార్డ్ చేసిన వీడియోలతో బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారంలో అర్జున్ కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తూ, బాధితులను భయభ్రాంతులకు గురిచేసి లక్షల రూపాయలు వసూలు చేసేవారు.

 30 లక్షల వసూలుతో బయటపడ్డ బాగోతం! 

ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తెను బెదిరించి సుమారు  30 లక్షల రూపాయలు  వసూలు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ధైర్యంగా జూబ్లీహిల్స్ పోలీసులను, షీ-టీమ్స్‌ను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.. టెక్నికల్ ఆధారాలతో నిందితులను పట్టుకున్నాయి. ఇప్పటివరకు సుమారు 20 మందికి పైగా యువతులు ఈ ముఠా బారిన పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల ఫోన్లలో అనేక అభ్యంతరకర వీడియోలు, ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 తల్లిదండ్రులకు పోలీసుల హెచ్చరిక! 

సోషల్ మీడియాలో అపరిచితులతో స్నేహం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ . హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తమ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏయే ఫోటోలు షేర్ చేస్తున్నారు అనే అంశాలపై నిఘా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇలాంటి ముఠాల బారిన పడితే భయపడకుండా వెంటనే  డైల్ 100 , షీ-టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555 కు సమాచారం ఇవ్వాలని వెల్లడించారు. బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.                                    

టాప్ హెడ్ లైన్స్

Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget