Cyber Crime: ఇన్ స్టాలో వల వేస్తాడు.. దొరకగానే దోచేస్తాడు.. ఇదే అతడి స్టైల్!
Cyber Crime:చేపలకు వల వేసినట్లు ఇన్ స్టాలో అమ్మాయిలకు వల వేస్తాడు. కాస్త ఛాన్స్ ఇచ్చారంటే అల్లుకుపోయి.. అందినకాడికి దోచేస్తాడు. ఇలా దాదాపు 60 మంది అమ్మాయిల నుంచి 4 కోట్ల రూపాయలు కాజేశాడు.
Cyber Crime: చేపలకు ఎర ఆశ చూపి వల వేస్తుంటారు. అయితే ఈ యువకుడు మాత్ర తన ఫొటోలను ఎరగా వేసి అమ్మాయిలకు వల వేస్తాడు. అతను చాలా హై ప్రొఫైల్ అనే బిల్డప్ ఇచ్చేందుకు అమ్మాయిల పేరిట ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి... తన అకౌంట్ ను ఫాలో చేస్తాడు. ఈ యువకుడంటే ఆ అమ్మాయిల పడి చచ్చిపోతున్నట్లుగా కామెంట్లు చేస్తుంటాడు. చూసిన వాళ్లకి అతడు హై ప్రొఫైల్ కి చెందిన వాడని... ప్రతీ అమ్మాయి అతడి వెంట పడుతుందనే అనిపిస్తుంది. అతడి టార్గెట్ కూడా అదే. ఇలా చేయడం పూర్తవగానే.... టార్గెట్ చేసిన అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాడు.
60 మంది అమ్మాయిల నుంచి 4 కోట్లు స్వాహా...
ఒక్కసారి వాళ్లు యాక్సెప్ట్ చేశారంటే... తాను కోటీశ్వరుడినని బిల్డప్ ఇచ్చుకుంటూ అమ్మాయిలను మాయ చేసి ప్రేమలోకి దించుతాడు. ఛాటింగ్ లు, ఫోన్లు చేస్తూ... వారిని ఏమారుస్తాడు. అడిగితే తన నాన్న లక్ష రూపాయలైనా ఇస్తాడు కానీ... తనకే అడగడం ఇష్టం ఉండదంటూ, అత్యవసరం అంటూ, మళ్లీ వెంటనే ఇచ్చేస్తానంటూ, వివిధ కారణాలు చెప్తూ... వారి దగ్గర నుంచి డబ్బులు లాగడం ప్రారంభిస్తాడు. ఇలా దాదాపు 60 మంది అమ్మాయిలను మోసం చేశాడు. అంతేనా అక్షరాల 4 కోట్ల రూపాయను గుంజేశాడు. చివరకు విషయం అర్థం చేసుకున్న ఓ అమ్మాయిపై ఇతగాడిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం చేస్తున్నాడు.. ఎలా ముంచేస్తున్నాడు..?
ఏపీలోని రాజమండ్రి కి చెందిన జోగడ వంశీకృష్ణ బీటెక్ పూర్తి చేశాడు. కూర్చున్న చోట నుంచే డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అందుకోసం ఎలాంటి అడ్డదార్లు తొక్కేందుకైన సిద్ధ పడ్డాడు. ఇన్ స్టాలో తన అందమై ఫొటోలు పెడ్తూ.. అమ్మాయిల పేరిట క్రియేట్ చేస్కున్న ఫేక్ అకౌంట్ల నుంచి కామెంట్లు పెట్టుకుంటా బిల్డప్ ఇచ్చుకున్నాడు. టార్గెట్ చేసిన వాళ్లకి రిక్వెస్ట్ పెట్టి.. ప్రేమ పేరుతో డబ్బులు గుంజుతాడు. తమ డబ్బు తమకు కావాలని అడిగితే ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తాడు. ఆ అమ్మాయిని అన్ ఫాలో చేస్తాడు. అయితే హైదరాబాద్ కి చెందిన ఓ అమ్మాయి అమెరికాలో ఉంటుంది. ఇలాగే ఆమెకు కూడా మాయమాటలు చెప్పి పాతిక లక్షల వరకు దోచేశాడు. మోసపోయానని గ్రహించిన అమ్మాయి పోలీసుల ఫిర్యాదు చేసింది.
నిందితుడిని పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. అంతే కాదండోయ్ వంశీకృష్ణ పై గతంలో రాచకొండ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, ఖమ్మం, భీమవరం, వైజాగ్, కరీంనగర్, విజయవాడలలో కూడా ఈ తరహా కేసులు నమోదు అయ్యాయి.