Hyderabad Crime News: షాపింగ్ పేరుతో జార్ఖండ్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌లో రేప్ - స్నేహితురాలిపై ఘోరం
Student Rape: జార్ఖండ్‌కు చెందిన ఓ విద్యార్థినిపై స్నేహితులు హైదరాబాద్‌లో అత్యాచారానికి పాల్పడ్డారు. షాపింగ్ పేరుతో ఆ యువతిని హైదరాబాద్ తీసుకు వచ్చారు.

Jharkhand student was raped by her friends in Hyderabad: మాయ మాటలు చెప్పారు. హైదరాబాద్ ను చూద్దామన్నారు. షాపింగ్ చేయిస్తామన్నారు. మాల్స్ లో తిరుగుదామన్నారు. వారి మాటల్ని నమ్మిన యువతి హైదరాబాద్‌కు వచ్చింది. స్నేహితులే కదా ఏమీ చేయరని అనుకుంది. కానీ వాళ్లు స్నేహితుల రూపంలో ఉన్న తోడేళ్లు అని అర్థం చేసుకునే సరికి ఘోరం జరిగిపోయింది.
సాక్షి అనే విద్యార్థినిపై స్నేహితుల అత్యాచారం
స్నేహితులు తనపై అత్యాచారం చేశారని సాక్షి అనే విద్యార్థిని బాచుపల్లి పోలీసుల్ని ఆశ్రయించింది. ఆమె చెప్పిన వివరాలు విని పోలీసే షాకయ్యారు. సాక్షి అనే విద్యార్థిని జార్ఖండ్‌కు చెందిన వారు. అక్కడ సదాశివలింగం అకాడమీ ఆఫ్ రిసెర్చ్ సెంటర్ లో బయోమెడికల్ కోర్సు చేస్తున్నారు. ఆమె తో పాటు అజయ్ అనే విద్యార్థి కూడా చదువుకుంటున్నాయి. ఈ అజయ్ ది హైదరాబాద్. అతను సెలవులకు హైదరాబాద్ వచ్చాడు. తన స్నేహితురాలికి ఓ రోజు కాల్ చేశాడు. హాలీడేసే కదా.. హైదరాబాద్ వస్తే షాపింగ్ చేద్దామని పిలిచాడు. హాస్టల్ లో ఉండవచ్చని.. సెక్యూరిటీకి సమస్య ఉండదని నమ్మబలికాడు.
షాపింగ్ కోసం అని పిలిపించి స్నేహితుడితో కలిసి అత్యాచారం చేసిన సైకో
స్నేహితుడ్ని నమ్మిన సాక్షి హైదరాబాద్ వచ్చింది. అప్పటికే దుర్భుద్దితో ఉన్న అజయ్.. ముందుగా అనుమానం రాకుండా తన స్నేహితురాల్ని కూకట్ పల్లిలోని ఓ హాస్టల్ లో జాయిన్ చేశాడు. ఆ తర్వాత షాపింగ్‌లకు.. హైదరాబాద్ సైట్ సీయింగ్ కు తీసుకెళ్లాడు. బాగా నమ్మకం కుదిరిన తర్వాత తన ప్లాన్ అమలు చేశాడు. తన మిత్రుడు హరితో కలిసి సాక్షిపై అత్యాచారం చేయడానికి పక్కా ప్లాన్ చేసుకున్నాడు. రాజీవ్ గృహకల్పలో .. తెలిసిన వారి ఫ్లాట్ తాళాలు తీసుకున్నాడు. ఓ రోజు షాపింగ్ కు అని చెప్పి..అటూ ఇటూ తిప్పి..తెలిసిన వారి ఇంట్లో భోజనం చేద్దామని నిజాంపేటలోని రాజీవ్ గృహకల్ప ఇంట్లోకి తీసుకెళ్లారు.
పూర్తి వివరాలు ఇంకా వెల్లడించని పోలీసులు
అక్కడ హరి,అజయ్ తమ ప్రణాళిక అమలు చేశారు. సాక్షికి మద్యం తాగించి.. సామూహిక అత్యాచారం చేశారు. కాసేపటికి సాక్షి తెలివిలోకి వచ్చి కేకలు వేయడంతో స్థానికులు గుర్తించారు. స్థానికులు రావడంతో వారిద్దరూ పరారయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు సాక్షిని కాపాడారు. ఆస్పత్రికి తరిలించారు. విద్యార్థిని సాక్షి(21) పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శనివారం కేసు నమోదు అయింది. నిందితులు ఇద్దర్నీ అరెస్టు చేశారు. అయితే పోలీసులు ఇంకా పూర్తి వివరాల్ని వెలుగులోకి తీసుకు రాలేదు.






















