By: ABP Desam | Updated at : 04 Feb 2022 05:34 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
వైన్ షాపులో చోరీ(ప్రతీకాత్మక చిత్రం)
ఎక్కడైనా దొంగతనం జరిగితే లక్షల్లో కనీసం వేలల్లో అయినా నగదు చోరి అవుతుంది. లేదా విలువైన సామాగ్రి మాయంచేస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో జరిగిన దొంగతనాన్ని చూసి పోలీసులే ఇదేం వింత దొంగతనం అనుకుంటున్నారు. గురువారం అర్ధరాత్రి పూట ఇద్దరు దొంగలు రాడ్డు, గడ్డపారతో వైన్స్ లో చొరబడడానికి ప్రయత్నించారు. చాలా కష్టపడి చివరకు షట్టర్ తెరిచి వైన్స్ లో చొరబడ్డారు. సీసీటీవీలో కూడా వారి దృశ్యాలు నమోదయ్యాయి. ఉదయం షాపు తెరిచేందుకు వచ్చిన యజమాని షట్టర్ తెరిచి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, యజమాని వచ్చి చూస్తే మాత్రం రూ.400 చిల్లర కాయిన్స్ తో బాటు ఒక థమ్సప్ బాటిల్ దొంగిలినట్లు నిర్థారించారు. ఈ విషయం గమనించిన పోలీసులు షాప్ యజమాని ఇలాంటి దొంగతనం ఎక్కడ జరగలేదని నవ్వుకున్నారు.
దొంగకు బుద్ధి చెప్పిన బామ్మ
దొంగోడిని పట్టుకోవాలంటే ఎంతో దమ్ముండాలి. ఎందుకంటే.. వారి వద్ద ఆయుధాలు కూడా ఉండే ప్రమాదం ఉంది. పారిపోయే క్రమంలో.. తమని పట్టుకొనేవారిపై దొంగలు దాడి చేస్తారు. అందుకే.. ఏదైనా దొంగతనం జరుగుతున్నప్పుడు అంత త్వరగా ఎవరూ ముందుకు రారు. అయితే, ఈ బామ్మగారు చాలా ధైర్యవంతురాలు. ధైర్యంగా ఓ దొంగను ఒంటిచేత్తు అడ్డుకుంది. షాప్‌లోని వస్తువులను ఎత్తుకెళ్లకుండా అడ్డుకుంది.
కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో క్యాంప్‌బెల్ రివర్ సమీపంలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో ఓ దొంగ దొరికినవన్నీ కార్డ్‌లో వేసుకుని.. బిల్లు చెల్లించకుండానే బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఓ సైకిల్ తీసుకుని.. వాటిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఓ వ్యక్తి వీడియో రికార్డు చేస్తూ.. ఆ వస్తువులకు డబ్బులు చెల్లించావా? అని అడిగాడు. అదే సమయానికి వస్తువులను కొనుగోలు చేసుకుని బయటకు వెళ్తున్న 73 ఏళ్ల బామ్మ ఆ మాటలు విన్నది. క్షణం ఆలస్యం చేయకుండా అతడిని అడ్డుకుంది. వీడియోలో రికార్డయ్యేందుకు ఆ బామ్మ.. ముందుగా ఆ దొంగోడి ముసుగు తొలగించింది. దీంతో అతడు వస్తువులను అక్కడే వదిలిపెట్టి.. తన బ్యాగ్ తీసుకుని సైకిల్‌పై ఉడాయించాడు.
జనవరి 29న చోటుచేసుకున్న ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బామ్మగారి ధైర్యాన్ని చూసి అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అన్నట్లు.. ఆ బామ్మగారి పేరు ఎలైన్ గాలవే. తాజాగా ఆమె ఓ వీడియో సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నేను డోర్ వద్దకు వెళ్తున్న సమయంలో ఆ వ్యక్తి కార్ట్ నిండా వస్తువులతో అక్కడి నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు. నా వద్దకు రాగానే అతడి ముసుగు తొలగించి వీడియోకు చూపించా. కానీ, అది అనుకోకుండా.. అప్పటికప్పుడు జరిగిపోయింది. అతడు దొంగ అని తెలియగానే.. అతడిని బయటకు వెళ్లనీవకూడదని అనుకున్నాను. అతడి ఒక చేయి కార్ట్ మీద, మరో చేతిని సైకిల్ మీద పెట్టాడు. కాబట్టి.. అతడికి ఆయుధాలు బయటకు తీసి దాడి చేసే అవకాశం కూడా లేదు’’ అని తెలిపింది. ఏది ఏమైనా ఈ బామ్మగారు గట్టివారే సుమీ. సెకన్ల వ్యవధిలోనే ఆమె అన్నివిధాలుగా ఆలోచించారంటే నిజంగా గ్రేటే. అతడిని కొనేందుకు సిద్ధమైన మహిళలు, ధర ఎంతంటే..
Chittoor Crime: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను లాక్కెళ్లిన వృద్ధుడు, ఆపై దారుణం ! తల్లి రాగానే అక్కడినుంచి పరార్
ASI Attacks Dhaba Staff: మద్యం మత్తులో ఏఎస్ఐ వీరంగం - బిర్యానీ పెట్టలేదని హోటల్ సిబ్బందిపై బూతులు, దాడి
Nellore Pistol: నెల్లూరులో రెండు ప్రాణాలు తీసిన పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టిన పోలీసులు, కీలక విషయాలు
ప్రేమ పేరుతో నమ్మించి, రెండుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ - ప్రియుడిని నిలదీస్తే ఏమన్నాడంటే !
Hyderabad news : ప్రియుడితో భార్య రాసలీలలు, రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న భర్త
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!