Buttabamma arrest: డాక్టర్ ఆత్మహత్య కేసులో ఇన్‌ఫ్లూయన్సర్ బుట్టబొమ్మ అరెస్ట్ - వివాహేతర బంధంతో టార్చర్ !
Buttabomma Shruti ఇన్ స్టా ఇన్ ఫ్లూయన్సర్ బుట్టబొొమ్మ శృతిని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ వైద్యుడితో వివాహేతర బంధం పెట్టుకుని ఆయన భార్య ఆత్మహత్యకు కారణం అయినట్లుగా పోలీసులు గుర్తించారు.

Buttabomma Shruti arrested by Warangal police: డాక్టర్స్ కాపురంలో చిచ్చు పెట్టి, మహిళా డాక్టర్ ఆత్మహత్యకు భర్త డాక్టర్ సృజన్, రీల్స్ లేడీ, బుట్టబొమ్మ సోషల్ మీడియా ఫేమ్ శృతి కారకులని వరంగల్ కమిషనరేట్ పోలీసులు తేల్చారు. వరంగల్ లో సంచలనం సృష్టించిన మహిళ డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో భర్త డాక్టర్ సృజన్, సోషల్ మీడియా ఫేం భూక్య శ్రుతి, సృజన్ తల్లిదండ్రులను అరెస్ట్ చేసినట్లు కాజీపేట ఎసిపి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
వరంగల్ ఎంజీఎం లో హార్ట్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్న సృజన్ కు సంవత్సర కాలంగా సోషల్ మీడియా ఫేమ్ భూక్య శ్రుతితో సృజన్ కు పరిచయం కావడం, అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసినట్లు విచారణలో తేలిందని ఎసిపి తెలిపారు. సృజన్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో హార్ట్ స్పెషలిస్ట్ గా పని చేయడంతో పాటు మరో ప్రైవేట్ ఆస్పత్రిలో కన్సల్టెంట్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో హాస్పటల్ ప్రమోషన్ కు వచ్చిన శృతి తో పరిచయం ఏర్పడిందన్నారు. సృజన్, శృతి మధ్యల కొనసాగుతున్న క్రమ సంబంధం సృజన్ భార్య డాక్టర్ ప్రత్యూష కు తెలియడంతో పలుమార్లు డాక్టర్ భర్తను మందలించడం జరిగిందని ఎసిపి చెప్పారు. భర్త సృజన్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సోషల్ మీడియా ఫేమ్ శృతికి సైతం ప్రత్యూష ఫోన్ చేసి మందలించడంతోపాటు మా కాపురంలో చిచ్చు పెట్టకని హెచ్చరించిన శృతి వినకుండా ప్రత్యూష ను ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడినట్టు విచారణలో తేలిందని ఎసిపి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 13 వ తేదీన బొగత పర్యాటక ప్రాంతానికి వెళ్లి వచ్చిన సృజన్, ప్రత్యూషకు శృతి విషయంలో గొడవ జరిగింది. ఈ సమయంలో శృతి వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పడంతో మనస్తాపానికి గురైన ప్రత్యూష ఇంట్లోనీ మొదటి అంతస్తులోని బెడ్రూంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రత్యూష పైకి వెళ్లి కిందికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సృజన్ పైకి వెళ్లి చూడగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో చుట్టుపక్కల ఉన్న మిత్రులను పిలిచి తలుపులను పగలగొట్టి ప్రత్యూషను కిందికి దింపి సిపిఆర్ చేశారని ఫలితం లేకపోవడంతో వెంటనే ప్రత్యూష పని చేస్తున్న హాస్పటల్ కు తరలించారని అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని ఎసిపి చెప్పారు.
డాక్టర్ సృజన్, డాక్టర్ ప్రత్యూష కు 2017 లో వివాహం.
హార్ట్ స్పెషలిస్ట్ గా ఎంజిఎం లో విధులు నిర్వహిస్తున్న సృజన్ కు డెంటల్ డాక్టర్ ప్రత్యూషతో 2017 వ సంవత్సరంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో కారు 30 తులాల బంగారు ఆభరణాలు 30 లక్షల క్యాష్ కట్నంగా ఇవ్వడం జరిగింది. వీరికి ఏడు సంవత్సరాల పాపతో పాటు ఏడు నెలల మరో పాప ఉంది.
ఆత్మహత్య రోజు ఇంట్లో ఇద్దరే.
ప్రత్యూష ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్న సమయంలో భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు. హనుమకొండ జిల్లా హాసన్ పర్తి లో సృజన్ తల్లిదండ్రులు మధుసూదన్, సత్యవతి వీరితోనే ఉంటారు. శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో మధుసూదన్ సత్యవతి ఇద్దరు మనుమరాళ్లతో కలిసి భద్రాచలం వెళ్లినట్లు ఎసిపి తెలిపారు. అయితే సృజన్ ప్రవర్తన పై అత్తమామలకు చెప్పిన ప్రత్యూష మాట వినకుండా కొడుకుని వెనుకేసుకు వచ్చేవారని పోలీసులు తెలిపారు.
మెజిస్ట్రేట్ ముందు హాజరు.
పోలీస్ అదుపులో ఉన్న డాక్టర్ సృజన్ వారి తల్లిదండ్రులు మధుసూదన్ సత్యవతి తో పాటు సోషల్ మీడియా ఫేమ్, సృజన్ అక్రమ సంబంధం కొనసాగిస్తున్న శృతిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని ఏసిపి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.





















