అన్వేషించండి

Warangal Crime: డాక్టర్ భార్యను కాదని రీల్స్ శృతి మోజులో డాక్టర్ - చివరికి జైలు పాలయ్యాడు - జీవితం కోల్పోయాడు !

Love Reels: డాక్టర్ అయిన భార్యకు బదులు రీల్స్ చేసే మహిళపై మోజు పడ్డాడో డాక్టర్. చివరికి జీవితాన్ని కోల్పోయాడు. వరంగల్‌లో ఈ ఘటన జరిగింది.

Doctor wife commits suicide in Warangal: సోషల్ మీడియా చాలా డేంజర్. ఎంత పద్దతిగా ఉపయోగించుకుంటే లైఫ్ అంత పద్దతిగా ఉంటుంది. బానిసలా మారితే.. లైఫ్ అంతా గజిబిజి అయిపోతుంది. ఇది అందరికీ వర్తిస్తుంది. డాక్టర్లకు కూడా. ఎందుకంటే.. వరంగల్ లో ఓ యువ డాక్టర్ సోషల్ మీడియా మోజులో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాడు. ఇప్పుడు అటు కుటుంబం చిన్నా భిన్నమైంది...ఇటు జైలుకు పోయే పరిస్థితికి వచ్చింది.                    

వరంగల్‌లో ప్రత్యూష అనే డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. మంచి కుటుంబం, ఆర్థిక సమస్యలు లేవు.. అయినా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అని అందరూ షాక్ కు గురయ్యారు. కానీ అసలు కారణం సోషల్ మీడియా అని తేలింది.              

ప్రత్యూష భర్త సృజన్ కూడా వైద్యుడే. మంచి ప్రతిభావంతమైన యువ వైద్యుడిగా గుర్తింపు పొందారు. కార్డియాలజీ రంగంలో ఎంతో భవిష్యత్ ఉందని అనుకున్నారు. 2017లో ప్త్రత్యూషతో సృజన్ పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.  ఒకరు సంవత్సరం ఏడు నెలల పాప కాగా మరొకరు 7 నెలల పాప. ఇద్దరు పిల్లలతో వీరి కుటుంబం .. బంగారు కుటుంబంగా ఉంటుందని అనుకున్నారు. కానీ సృజన్ సోషల్ మీడియాలో. రీల్స్ చేసే ఓ మహిళ పట్ల ఆకర్షితుడయ్యాడు.                         

బుట్టబొమ్మ పేరుతో ఇన్ స్టాలో రీల్స్ చేసే శృతి అనే అమ్మాయితో.. సృజన్ పరిచయం పెంచుకుంది. రాను రాను  వారి మధ్య బంధం హద్దులు దాటిపోయింది. కుటుంబ సభ్యులు బాధపడతారని కానీ..  కుటుంబం నాశనమైపోతుందని కానీ అనుకోలేదు. సృజన్ మారకపోగా.. ఆ రీల్స్ చేసే శృతితో కలిసి భార్య ప్రత్యూషను అవమానించడం ప్రారంభించారు. చివరికి శృతి కూడా.. సృజన్ భార్యను బెదిరించినట్లుగా ఆరోపణలుఉన్నాయి.                  
 
వివాహేతర బంధ ప్రేమలో మునిగిపోయిన యువ డాక్టర్ సృజన్ వేధింపులు ఎక్కువ కావడంతో భార్య డాక్టర్ ప్రత్యూష తట్టుకోలేకపోయారు.  హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే చనిపోయినటు వైద్యులు నిర్ధారించారు. అయితే సృజన్ ప్రేమ వ్యవహారానికి భార్య అడ్డు ఉండడంతో తొలగించాలని చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు..

సృజన్ ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న రీల్స్ అమ్మాయి బానోతు శృతి సైతం తన కుమార్తెను బెదిరించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని భార్య మృతిలో నిందితుడు గా ఆరోపణలు ఎదుర్కొంటున్న సృజన్ ను హాసన్ పర్తి పోలీస్ లు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రీల్స్ చేసే మహిళపై మోజులో పడి.. తన ఇద్దరు పిల్లలకు తల్లిని కోల్పోయాడు సృజన్. కుటుంబం చిన్నాభిన్నమైందని గుర్తించేసరికి .. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

టాప్ హెడ్ లైన్స్

Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
FIFA Rights Scam: ఫిఫా రైట్స్ వెనుక పెద్దల స్కెచ్? హైదరాబాద్ స్టార్టప్‌ను ముంచేసిన అమెరికా మాయగాడు.. రంగంలోకి సీసీఎస్!
ఫిఫా రైట్స్ వెనుక పెద్దల స్కెచ్? హైదరాబాద్ స్టార్టప్‌ను ముంచేసిన అమెరికా మాయగాడు.. రంగంలోకి సీసీఎస్!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
AP Cabinet Special Task Force: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
Embed widget