Rangaraya Medical College issue: మెడికోలపై లైంగిక వే ధింపుల ఘటనలో ముగ్గురు అరెస్ట్ - అసలు నిందితుడు మామూలోడు కాదు !
Kakinada: రంగరాయ మెడికల్ కాలేజీ ఇష్యూలో నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అసలు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Police have arrested four accused in the Rangaraya Medical College issue : కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తున్న విద్యార్థినీలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంశంపై మీడియా సమావేశాన్ని అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్ ఏర్పాటు చేశారు. నెల రోజుల నుంచి ఈ వేధింపులు జరుగుతున్నప్పటికీ ఎనిమిదవ తేదీన తమకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు అందిందని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. శుక్రవారం ఇది వెలుగులో కొచ్చింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో వెంటనే కఠిన చర్యలు తీసుకున్నారు.
కలెక్టరేట్లో మీడియా సమావేశంలో కలెక్టర్ షామ్ మోహన్, ఎస్పీ బిందుమాధవ్, ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణు వివరాలు వెల్లడించారు. విద్యార్థినిల పేరు బయట పెట్టకూడదు కాబట్టి వారి చెప్పిన అంశాలు చెప్పడం లేదని...జరిగిన సంఘటన వాస్తవమని తేల్చారు. వెంటనే 11 మందితో కూడిన కమిటీని విచారణకు ఏర్పాటు చేశామని.. ఆ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. శుక్రవారం నివేదిక పరిశీలించి నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ,టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు చేశామని , నలుగురి నిందితుల గత చరిత్ర కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. విద్యార్థినిలు ఎవరూ భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. రంగరాయ మెడికల్ కళాశాలలో లైంగిక వేధింపులు వంటివి జరగకుండా అధికారులతో పాటు ఎన్జీవోలతో కూడిన కమిటీ ఉందని.. కమిటీ పూర్తిస్థాయిలో పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇక నుంచి ఇలాంటి సంఘటనలు జరిగితే బా సంబంధిత శాఖధిపతులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో బి.ఎస్సీ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ - MLT) విద్యార్థినులు... నలుగురు పారామెడికల్ సిబ్బంది ల్యాబ్ అటెండెంట్ వి. కళ్యాణ్ చక్రవర్తి (బయోకెమిస్ట్రీ విభాగం), ల్యాబ్ టెక్నీషియన్లు ఎస్. గోపాలకృష్ణ (బయోకెమిస్ట్రీ), బి. జిమ్మీ రాజు (మైక్రోబయాలజీ), కె.వి.వి.ఎస్. ప్రసాద రావు (పాథాలజీ) - తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. సుమారు 55 మంది విద్యార్థినులు ఈ ఆరోపణలు చేశారు. కళాశాల ప్రిన్సిపల్, యు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎ. విష్ణు వర్ధన్‌కు ఈమెయిల్ ద్వారా ఈ లైంగిక వేధింపుల గురించి తొలి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా, కళాశాల అంతర్గత విచారణ కమిటీ విచారణ చేసింది. కళ్యాణ్ చక్రవర్తిపై ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి.. తర్వాత ఇతర ముగ్గురు సిబ్బంది పేర్లు కూడా బయటపడ్డాయి.
అంతర్గత విచారణ కమిటీ నివేదిక ఆధారంగా, నలుగురు ఆరోపిత సిబ్బందిని - వి. కళ్యాణ్ చక్రవర్తి, ఎస్. గోపాలకృష్ణ, బి. జిమ్మీ రాజు, మరియు కె.వి.వి.ఎస్. ప్రసాద రావు - సస్పెండ్ చేస్తూ రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణు వర్ధన్ కాకినాడ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారం వారిని అరెస్టు చేశారు. కళ్యాణ్ చక్రవర్తి పరారీలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను నివేదిక సమర్పించాలని ఆదేశించారు.





















