అన్వేషించండి

Indian Student Kills Family In Alton: టెక్సాస్‌లో తల్లి,తండ్రితో పాటు అమ్మమ్మలనూ కాల్చేసిన భారత విద్యార్థి - సరదాకే ఇలా చేశాడా?

Gaurav Chopra Capital Murder Texas: టెక్సాస్‌లో 19 ఏళ్ల భారతీయ విద్యార్థి గౌరవ్ చోప్రా తన కుటుంబ సభ్యులను కాల్చి చంపాడు. హై-స్పీడ్ పోలీస్ చేజింగ్ అనంతరం నిందితుడి అరెస్ట్.

 Texas Triple Homicide Gaurav Chopra: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కన్నవారిని,   పెంచిన అమ్మమ్మను ఒక 19 ఏళ్ల భారతీయ విద్యార్థి అతి దారుణంగా కాల్చి చంపిన ఉదంతం.. ఒక హాలీవుడ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ రియో గ్రాండే వ్యాలీ   లో చదువుకుంటున్న గౌరవ్ చోప్రా అనే యువకుడు.. జూన్ 17న తన స్వంత ఇంట్లోనే ఈ మారణహోమానికి ఒడిగట్టాడు. ఏ తప్పు ఎరుగని ఒక ఉన్నతమైన వ్యాపారవేత్త కుటుంబం నిమిషాల వ్యవధిలో శవాల దిబ్బగా ఎలా మారింది. 

 ఆ రాత్రి.. ఆ నిశ్శబ్ద ఇంట్లో ఏం జరిగింది? 

టెక్సాస్‌లోని ఆల్టన్ సమీపంలో ఉన్న ఒక విలాసవంతమైన టస్కనీ విలేజ్ సబ్‌డివిజన్ ఇల్లు అది. జూన్ 17 రాత్రి ఎప్పటిలాగే ప్రశాంతంగా సాగుతోంది. కానీ, 19 ఏళ్ల గౌరవ్ చోప్రా మనసులో మాత్రం ఒక భయంకరమైన నేరపూరిత ఆలోచన సుడిగుండంలా తిరుగుతోంది. ఎవరూ ఊహించని విధంగా ఇంట్లో ఉన్న లోడెడ్ పిస్టల్ తీసుకున్న గౌరవ్.. హాలులోకి వచ్చి ఒక్కొక్కరినీ టార్గెట్ చేశాడు. తన తండ్రి సీతారామ్ , తల్లి కమలేష్ రాణి  , అమ్మమ్మ మహీందర్ కౌర్   లపై అతి సమీపం నుండి తలలపై  గురిచూసి కాల్చాడు. బుల్లెట్లు తలలోకి దూసుకుపోవడంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచారు.

 అన్నపై గురి తప్పిన బుల్లెట్..  

ముగ్గురిని చంపిన ఉన్మాదంలో ఉన్న గౌరవ్.. ఆ శబ్దాలకు నిద్రలేచి వచ్చిన తన 21 ఏళ్ల స్వంత అన్న సాజన్‌ను కూడా వదల్లేదు. అతనిపైకి కూడా తుపాకీ గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. కానీ, అదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ సాజన్‌కు తగలకుండా పక్కకు దూసుకెళ్లింది. తమ్ముడి నరరూప రాక్షసత్వాన్ని చూసి హతాశుడైన సాజన్.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంట్లోనే ఒకచోట దాక్కున్నాడు. వెంటనే భయంతో వణుకుతున్న చేతులతో అమెరికా ఎమర్జెన్సీ నంబర్ 911కు కాల్ చేసి..  నా తమ్ముడు ఇంట్లో అందరినీ కాల్చేసి చంపేశాడు.. నన్ను కూడా చంపడానికి చూస్తున్నాడు.. కాపాడండి అంటూ రోదించాడు.

 హాలీవుడ్ రేంజ్ పోలీస్ చేజింగ్.. క్లైమాక్స్ యాక్సిడెంట్! 

అన్న పోలీసులకు ఫోన్ చేశాడని గ్రహించిన గౌరవ్ చోప్రా.. వెంటనే చేతిలో తుపాకీతో కారు తీసుకుని ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. హిడాల్గో కౌంటీ షెరీఫ్ పోలీసులు సైరన్లు మోగిస్తూ సబ్‌డివిజన్ లోకి ఎంటర్ అయ్యేసరికే గౌరవ్ కారు హైవేపైకి చేరింది. పోలీసులు అతని కారును వెంబడించడం ప్రారంభించారు. సినిమాల్లో చూపించే విధంగా హై-స్పీడ్ పోలీస్ చేజింగ్  నడిచింది. అయితే, 4 మైల్ లైన్ రోడ్ మరియు గ్లాస్‌కాక్ రోడ్ కూడలి వద్దకు వచ్చేసరికి నియంత్రణ కోల్పోయిన గౌరవ్ కారు.. ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది . ఈ ఘోర ప్రమాదంలో అవతలి కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడగా, పోలీసులు క్షణాల్లో గౌరవ్‌ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద స్థలంలోనే అతను వాడిన   గన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 మిస్టరీగా మారిన మోటివ్.. తప్పుడు కథనాలు అల్లుతున్న నిందితుడు! 

నిందితుడిని గురువారం కోర్టులో ప్రవేశపెట్టారు. అతనిపై క్యాపిటల్ మర్డర్ ,  అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదయ్యాయి. దీనికి బెయిల్ వచ్చే అవకాశం లేదు. అయితే, ఈ దారుణారణకాండకు ఒడిగట్టడానికి అసలు కారణం ఏంటి అనేది పోలీసులకు ఇంకా చిక్కడం లేదు.  నిందితుడు గౌరవ్ పోలీసుల విచారణలో నోరు విప్పినప్పటికీ.. చెప్తున్న విషయాలన్నీ  పచ్చి అబద్ధాలు, ఊహాజనిత కల్పితాలు  అని, కేసును తప్పుదోవ పట్టించడానికే అతను ప్రయత్నిస్తున్నాడని  పోలీసులు చెబుతున్నారు.   లవ్ ఎఫైరా, ఆస్తి గొడవలా, లేదా సైకోలా మారాడా అనే కోణంలో పోలీసులు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

 విషాదంలో పంజాబ్ గ్రామం.. యూనివర్సిటీ షాక్!

హత్యకు గురైన సీతారామ్ అక్కడ పామ్‌వ్యూ ఏరియాలో మంచి వ్యాపారవేత్తగా, సమాజంలో నలుగురికీ సహాయం చేసే మంచి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అంతవరకు ఏనాడూ ఆ ఇంటి నుండి గొడవలొచ్చినట్లు రికార్డులు లేవని ఆల్టన్ పోలీస్ చీఫ్ మార్క్ పెరెజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘోర వార్త తెలిసి పంజాబ్‌లోని నవాన్‌షహర్ జిల్లాలో ఉన్న వారి సొంత గ్రామం ఒక్కసారిగా దిగ్భ్రాంతిలోకి వెళ్ళింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కొడుకే.. కన్నవారికి కాలయముడు మారాడనే వార్తను అక్కడి బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు నిందితుడు తమ విద్యార్థేనని నిర్ధారించుకున్న UTRGV యూనివర్సిటీ.. పోలీసుల దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తున్నట్లు ప్రకటించింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget